“Telangana Has Been Blessing The BJP With MP Seats, But At What Cost?”

Despite giving 8 MPs to the BJP from Telangana during its tough times, the BJP-led NDA government hasn’t sanctioned a penny for the Hyderabad Metro Rail expansion even in the latest budget.

We had made several representations to the Union government in the past, but to no avail.

BJP Govt has funded 20 Metro Rail projects in the country over the last 10 years.

Uttar Pradesh (4 projects) – Rs. 5,134.99 cr
Maharashtra (3 projects) – Rs. 4,109 cr
Gujarat (3 projects) – Rs. 3,777.85 cr
Delhi (2 projects) – Rs. 3,520.52 cr
Karnataka- Rs. 1880.14 cr
Madhya Pradesh (2 projects) – Rs. 1,638.02 cr
Bihar – Rs. 1,400.75 cr
Tamil Nadu – Rs. 713 cr
Kerala (2 projects) – Rs. 146.74 cr
Rapid Rail Project (Delhi-Ghaziabad) – Rs. 1,106.65 cr

Unfortunately, Hyderabad Metro has received diddly-squat

Unjust and unfair!

Also Read-

బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చినా అదే వివక్షా?

మొదటి నుంచి తెలంగాణపై ద్వేషం నింపుకున్న ప్రధాని మోడీ

దేశంలో 20 మెట్రో ప్రాజెక్ట్ లకు నిధులిచ్చి హైదరాబాద్ మెట్రో కు మాత్రం గుండుసున్నా

కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ పై ప్రధాని మోడీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నారన్నారు. ఎన్నిసార్లు తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని అడిగినప్పటికీ ఆయన పట్టించుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. మొన్నటి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు చేసిన అన్యాయం అంత ఇంత కాదన్నారు. హైదరాబాద్ మెట్రో కోసం నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. తాజాగా ప్రకటించిన బడ్జెట్ లోనూ మళ్లీ హైదరాబాద్ మెట్రోకు మొండి చెయ్యే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మోడీ తన తెలంగాణ వ్యతిరేకత ఎన్నోసార్లు బయటపెట్టుకున్నారని చెప్పారు. అదే ద్వేషాన్ని మన రాష్ట్ర అభివృద్ధిని నిధులు ఇచ్చే విషయంలోనూ చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో గెలిచే పార్టీ ఎంపీలు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుందని భావించిన తెలంగాణ ప్రజలు ఈ సారి బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఏం ప్రయోజనం అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కన్నా కూడా మనకు నిధుల్లో కోతలు పెట్టారన్నారు. మరి మన రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది రాష్ట్రంపై ఇలా వివక్షను మరింత చూపేందుకేనా అని ఆయన ప్రశ్నించారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ మెట్రోకు ఎన్నోసార్లు నిధులు కావాలని అడిగితే పట్టించుకోలేదని గుర్తు చేశారు.

ఇదే కేంద్రం హైదరాబాద్ మెట్రోను విస్మరిస్తూ మిగతా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్ట్ లకు మాత్రం భారీగా నిధులు కేటాయిస్తుందని లెక్కలతో సహా కేటీఆర్ వివరించారు.

ఉత్తర ప్రదేశ్ (4 ప్రాజెక్టులు) – రూ. 5,134.99 కోట్లు
మహారాష్ట్ర (3 ప్రాజెక్టులు) – రూ. 4,109 కోట్లు
గుజరాత్ (3 ప్రాజెక్టులు) – రూ. 3,777.85 కోట్లు
ఢిల్లీ (2 ప్రాజెక్టులు) – రూ. 3,520.52 కోట్లు
కర్ణాటక- రూ. 1880.14 కోట్లు
మధ్యప్రదేశ్ (2 ప్రాజెక్టులు) – రూ. 1,638.02 కోట్లు
బీహార్ – రూ. 1,400.75 కోట్లు
తమిళనాడు – రూ. 713 కోట్లు
కేరళ (2 ప్రాజెక్టులు) – రూ. 146.74 కోట్లు
రాపిడ్ రైల్ ప్రాజెక్ట్ (ఢిల్లీ-ఘజియాబాద్) – రూ. 1,106.65 కోట్లు

గత పదేళ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్ట్ ల కోసం మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది. కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో జరిగిన అన్యాయాన్ని మోడీకి వివరించి రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిధులు తేవాలని డిమాండ్ చేశారు.

Full Speech On the Budget 2024-25
by Sri T Harish Rao (Dt: 27-07-2024)

The more a government blames others, the more it reveals its own failures and inability.

ఏ ప్రభుత్వమైతే ఇతరులను ఎక్కువగా నిందిస్తుందో, ఆ ప్రభుత్వం తన అసమర్థతను, వైఫల్యాలను బయటపెట్టుకుంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి.
బడ్జెట్ ప్రసంగమంతా బిఆర్ఎస్ ను తిట్టిపోయడం కోసమే తయారు చేసినట్లుంది. రాజకీయ కరపత్రం లాగా ఉంది.
బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత గానీ, దార్శనికత గానీ ఏమాత్రం లేదు.
ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా, హ్యుమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు.
నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా. ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతరు. మీరు చేసింది ఏందో, చెయ్యబోయేది ఏందో గది చెప్పరాదు.
8 నెలలు గడుస్తున్నయి అధ్యక్షా. మన రాష్ట్రంలో దశ, దిశ లేని పాలన నడుస్తున్నది. ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు, ప్రజలకు వెల్లడించలేదు.
ఎంతసేపు ఉత్త రాజకీయ రొద, కాయగొరుకుడు మాటలు. ఏమి లేని విస్తరాకుకు ఎగురుడు ఎక్కువ అనే సామెత గుర్తుకువస్తుంది.
విజన్ లేదు, విషయం లేదు, ఇప్పటివరకు సాధించిన ఒక విజయం లేదు
ఆర్థిక మంత్రి గారు స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధ హస్తులని ఈ బడ్జెట్ నిరూపిస్తుంది.
ఒకవైపు బిఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళలో అన్ని రంగాలలో పూర్తిగా వైఫల్యం చెందింది అని రాసిన్రు. మరోవైపు ఇదే బడ్జెట్ లో రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,229 రూపాయలు అని పేర్కొన్నరు.
ఇంత సెల్ఫ్ కాంట్రడిక్షనా? ఇంత కన్ఫ్యూజనా? ఇంత కుట్రనా?
2014 లో తలసరి ఆదాయంలో తెలంగాణ 11 వ స్థానంలో ఉండేది. గోవా, సిక్కిం మినహా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపినం.
తలసరి ఆదాయం ఇంత గొప్పగా మా పాలనలో పెరిగిందా? ఎనిమిది నెలల మీ పాలనలో పెరిగిందా? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తరా భట్టి గారూ?
నాలుగున్నర లక్షలు లేని జిఎస్డిపి ని 14 న్నర లక్షల పైకి తీసకపోయింది బిఆర్ఎస్ పాలనా? మీ కాంగ్రెస్ పాలనా?
2014లో దేశ జీడీపిలో తెలంగాణ కాంట్రిబ్యూషన్ 4.1 శాతం. పదేళ్లలో 5శాతానికి పోయింది. ఇది పదేండ్ల మా శ్రమ ఫలితమా? ఎనిమిది నెలల మీ డ్రామా ఫలితమా?
2013-14లో కోటి 7లక్షలున్న పంటల ఉత్పత్తిని, 4కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలనా? మీ పరిపాలనా?
మేము వ్యవసాయానికి ఏం చెయ్యకుండనే నాలుగు రెట్లు ఎక్కువ పంట పండిందా?
చెయ్యి పార్టీ వాళ్లు చెవిలో పుష్పగుచ్చాలు పెడుతరని భట్టి గారి ప్రసంగం విన్నంక అర్థమైంది.
రెండేండ్ల వ్యవధిలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి తీసుకుపోయినం.
ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తిప్పితిప్పికొడితే 7778 మెగావాట్లు.
పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒకే ఒక్క దశాబ్దంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 19,483 మెగవాట్లకు పెరిగింది. మీరు చేసినదానికి మూడింతలు చేసినం. ఈ మధ్య అదనంగా 1400 మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి వచ్చింది.
మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుండేదో తెలుసా కేవలం 1196 యూనిట్లు.
అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు పేర్కొన్న బిఆర్ఎస్ పరిపాలనలో తలసరి విద్యుత్ వినియోగం 2349 యూనిట్లకు పెరిగింది.
గిదంత కాదు భట్టి గారు. గింత చర్చ, ఇన్ని సాక్ష్యాలు కూడా అవసరం లేదు. ఈరోజు పరిస్థితి గురించే మాట్లాడుకుందాం.
స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి టీ బ్రేక్ తీసుకొని మీరు, నేను ఇదే అసెంబ్లీ ముందట ఉన్న గన్ పార్క్ చౌరస్తల ఓ పది నిమిషాలు నిలవడి వచ్చిపోయెటోళ్లను అడుగుదాం. కరెంట్ సరఫరా బిఆర్ఎస్ పరిపాలనల మంచిగున్నదా? కాంగ్రెస్ పరిపాలనల మంచిగున్నదా అని? పది నిమిషాలల్ల మొత్తం ఖుల్లం ఖుల్ల అయితది. మాట్లాడితే అర్థం పరమార్థం ఉండాలెకదా అధ్యక్షా.
కరెంట్ గురించి రేవంత్ రెడ్డి గారు, అప్పుడు టిడిపి ఎమ్మెల్యేగా ఉండి ఏమన్నారు. తన తండ్రి చనిపోతే ఊళ్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంట్ లేక నీళ్లు లేక నెత్తిమీద నీళ్లు చల్లుకున్నా అని నాడు రేవంత్ గారు అన్నరు. అలా ఉంది నాటి కరెంట్ పరిస్థితి.
సీఎం, మంత్రుల మీటింగ్ లకు పోలీసులతో పాటు, కరెంటు వాళ్లు జనరేటర్లు పెట్టుకొని రెడీగా ఉంటున్నారు.
గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పింఛన్ 200 రూపాయలు. మేము అధికారంలోకి వచ్చిన వెనువెంటనే వెయ్యి రూపాయలు చేసినం. రెండోసారి అధికారంలోకి రాగానే 2వేలు చేసినం.
పురోగతిలేని మా దశాబ్ధ కాలంలో ఇచ్చిన మాట ప్రకారం వృద్దాప్యం పింఛన్ 200 నుంచి 2వేలకు పెరిగింది.
మీ సోకాల్డ్ ప్రజాపాలనలో చెప్పిన వంద రోజుల గడువు దాటిపోయింది. నాలుగు వేల పింఛన్ నాలుక మీదనే మిగిలింది. ఉన్న రెండు వేలు కూడా సక్కగ రాక అవ్వాతాతల పరిస్థితి అదోగతి అయ్యింది.

2021లో విడుదలైన నీతి అయోగ్ నివేదికలో ఏముంది అధ్యక్షా.. Telangana is the seventh largest state in terms of GSDP and has clocked a CAGR of more than 11% (in Rupee terms) since 2015-16. It is one of the fastest growing states in the country. The state’s economy has grown at an average annual rate of more than 9% since its formation, which is significantly higher than the growth rate it had attained before its formation as a separate state.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించిందని నీతి అయోగ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినా కూడా అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదని చేసే ప్రచారాన్ని ఏమనాలె అధ్యక్షా. వీళ్ల ముందు గోబెల్స్ కూడా పనికిరాడు.
ఆర్థిక మంత్రిగారు వాక్రుచ్చిన పురోగతి లేని దశాబ్ద కాలంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ పల్లెలు టాప్ 20లో 19 అవార్డులు గెలుచుకున్నాయి.
దీన్నిబట్టి తేలేదేమిటంటే ఈ బడ్జెట్ లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ, అవాస్తవాల విస్తరణ.
ఈ ప్రభుత్వానిది ఎంత సంకుచిత వైఖరంటే, దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్బుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్ లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేసిన్రు అధ్యక్షా. ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటదా.
ముఖ్యమంత్రి గారు, మీరు కంప్యూటర్ మెమొరీ నుంచి డిలీట్ చేయగలరు గానీ, ప్రజల మెమొరీ లోంచి డిలీట్ చేయలేరు. అక్షరాలను మలిపేస్తరు గానీ, అనుభవాలను మలిపేయలేరు.
బడ్జెట్ గురించి భట్టి గారు అందంగా చెప్పారు. బడ్జెట్ పూర్తి అవాస్తవాలతో కూడుకున్నది.
ఇది అన్ రియలిస్టిక్ బడ్జెట్:
సెంట్రల్ గ్రాంట్స్:
2023-24కు గాను 9,729 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా తెలంగాణకు వచ్చింది.
2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 21,636 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ గా వస్తుందని మీరు బడ్జెట్ లో పేర్కొన్నారు.
మొన్ననే కదా తెలంగాణకు సరైన సహకారం కేంద్రం అందించడం లేదని సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపినం.
భట్టి గారూ.. 9 సంవత్సరాలుగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ 9-10 వేల కోట్ల కంటే ఎక్కువ రావడం లేదని తమరే 2023-24 బడ్జెట్ సందర్భంగా మాట్లాడారు.
మరి ఇప్పుడు 21వేల 636 కోట్లు వస్తుందని ఎట్ల పెట్టారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 2023-24కు సీఎస్ఎస్ కింద 4,60,614కోట్లు పెడితే, ఈ ఏడాది 2024-25 గాను 5,05,978 కోట్లు పొందుపరిచారు. అంటే దేర్ ఈజ్ ఎ మార్జినల్ ఇంక్రీజ్ ఆఫ్ 45,000 కోట్లు.
అంటే దేశం మొత్తానికి 45వేల కోట్లు ఎక్కువ కేటాయించినప్పుడు, ఒక్క తెలంగాణకు 12వేల కోట్లు ఎట్ల ఎక్కువస్తది.
టాక్స్ రెవెన్యూ:
2023-24 (ఆర్.ఇ) ప్రకారం, 1,11,798 కోట్ల టాక్స్ రెవెన్యూ చూపించడం జరిగింది.
2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం, 1,38,118 కోట్ల టాక్స్ రెవెన్యూ వస్తుందని అంచనాలు వేశారు.
ఈ ఏడాది అదనంగా 26,383 కోట్ల టాక్స్ రెవెన్యూ వస్తుందని చూపించారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా 2023-24 (ఆర్.ఇ) ప్రకారం, 14,295 కోట్లు రాబోతుందని చెప్పారు. అదే 2024-25లో 18,228 కోట్లు రాబోతుందని అంచనాలు వేశారు. ఇది గతేడాది కంటే సుమారు 4వేల కోట్ల అధికం.
దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న సందర్భంలో 4వేల కోట్లు డ్యూటీ అధికంగా పెంచడం వల్ల 2023-24 సంవత్సరానికి వచ్చిన 14,225 కోట్లు రావడమే కష్టసాధ్యం.
ఇలాంటి సందర్భంలో 4వేలు పెంచడం వలన పేద, మధ్య తరగతి వారు చిన్న ఫ్లాటో, ప్లాటో లేదా కొంత వ్యవసాయ భూమి కొనుగోలు చేసే వారిపై 4వేల కోట్ల అధిక భారం వేస్తున్నట్లు స్పష్టమైపోతుంది.
ఎక్సైజ్:
సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ నాయకులు
2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం, 19,884 కోట్ల ఆదాయాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంటే, 2024-25కు గాను కాంగ్రెస్ ప్రభుత్వం 25,617 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అంటే, 5,773 కోట్లు అదనంగా అంచనా వేసుకున్నారు.
2,760 కోట్లుగా ఉన్న బీర్లపై డ్యూటీని 3,500 కోట్లకు పెంచారు.
లిక్కర్ పై ఉన్న డ్యూటీని 11,031 కోట్ల నుంచి 15,500 కోట్లకు పెంచారు.
అంటే బీర్లు, లిక్కర్ ధరలు రాబోయే రోజుల్లో భారీగా పెంచబోతున్నట్లు స్పష్టం చేశారు.
2023-24లో ఉన్న 14,570 కోట్ల ఎక్సైజ్ వ్యాట్ ను 2024-25కు గాను 16,432 కోట్లుగా అంచనా వేశారు.
అంటే 2000 కోట్ల రూపాయల వ్యాట్ కు సమానమైన మద్యం అమ్మకాలను పెంచబోతున్నట్లు చెప్పారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకాలపై రాద్దాంతం చేసిన వాళ్లే, మద్యం అమ్మకం ద్వారా 7,700 కోట్ల అధిక రాబడిని సమకూర్చుకోవాలని బడ్జెట్ అంచనాలు పొందుపరిచారు.
ఎక్సైజ్, వ్యాట్ కలిపి మొత్తం 42వేల కోట్ల 49 రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్ లో పెట్టారు.
నాడు గ్రామాల్లో బెల్ట్ షాపు, ఇప్పుడు గల్లీకో బెల్ట్ షాపు పెట్టే పరిస్థితి వచ్చింది.
ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని చెబుతున్నారు.
తెలంగాణ బెల్ట్ షాపుల తెలంగాణ, బొందల గడ్డ తెలంగాణ అయ్యిందన్నరు
బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి, ఆదాయం 42వేల కోట్లు తెచ్చుకునే ప్లాన్ చేస్తున్నారు.
టాక్సెస్ ఆన్ సేల్స్ ట్రేడ్:
2023-24 బడ్జెట్ లో టాక్సెస్ ఆన్ సేల్స్ ట్రేడ్ 29,983 కోట్లుగా ఉంటే, 2024-25 బడ్జెట్ లో 33,449గా చూపించారు. 3,466 వ్యాట్ అధికంగా వసూలు అవుతుందని చెప్పారు. ఇది సాధ్యమవుతుందా?
నాన్ టాక్స్ రెవెన్యూ:
2023-24 బడ్జెట్ లో 23,819 కోట్లుగా ఉన్న నాన్ టాక్స్ రెవెన్యూ 2024-25 కి గాను 35,208 కోట్లుగా చూపించారు.
11,389 కోట్ల నాన్ టాక్స్ రెవెన్యూ అధికంగా రాబోతున్నట్లు లెక్కలు వేశారు.
ఇందులో 10వేల కోట్లు భూముల అమ్మకం ద్వారా వస్తాయన్నారు. మరో 14వేల కోట్లు అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ అని పేర్కొన్నారు.
అసలు ఈ అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ అంటే ఏంటి. ఇదేం బ్రహ్మ పదార్థం. అసెంబ్లీకి కూడా చెప్పనంత గోప్యంత ఏమిటి?
మేము భూములను అమ్మితే అమ్మకూడదు అన్నారు. మీరు 24వేల కోట్లు భూముల అమ్మి సమకూర్చుకోబోతున్నట్లు చెబుతున్నరు.
నాన్ టాక్స్ రెవెన్యూ 11,389 కోట్లు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ 12వేల కోట్లు. టాక్స్ రెవెన్యూ 26,383 కోట్లు. మొత్తం కలిపి సుమారు 50వేల కోట్లు అధికంగా చూపించారు.
ఇందులో 10, 20 వేల కోట్లు దాటి నిధులు సమీకరించే అవకాశం లేదు.
వాస్తవిక బడ్జెట్ అని బ్రమలు కల్పిస్తూ సుమారు 30వేల కోట్లు అధికంగా ఆదాయం వస్తుందని చూపించారు.
ఒకవైపు ఆదాయం ఎక్కువ వస్తుందని చూపి మరోవైపు ఖర్చులు తక్కువ చేసి చూపించారు. వాస్తవానికి దూరంగా బడ్జెట్ ఉంది.

రుణమాఫీ:
రుణమాఫీ విషయంలో పూటకో మాట చెప్పిన్రు. ఒకసారి 40వేల కోట్లు అని, మరోసారి 35వేల కోట్లని, ఇంకోసారి 31వేల కోట్లని చెప్పారు.
రుణమాఫీ అర్హత నుంచి లబ్ధిదారులను సాధ్యమైనంతగా తొలగించే విధంగా వ్యవహరిస్తున్నరు.
రేషన్ కార్డు, పీఎం కిసాన్, ఎన్పీఏ వంటి కండీషన్స్ పెట్టి అర్హులను గణనీయంగా కుదిస్తున్నరు.
రుణమాఫీ పథకం అమలుకు ప్రారంభ తేదీగా డిసెంబర్9 2018గా పెట్టడం ఎంత వరకు సమంజసం.
డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీని సకాలంలో చేయకపోగా, ఈ ఎనిమిది నెలల వడ్డీని రైతునే కట్టుకోమనడం దుర్మార్గమైన చర్య. ఆలస్యానికి కారణం మీరు వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి.
బడ్జెట్ లో రుణమాఫీ కొరకు కేటాయించుకున్న నిదులు 26వేల కోట్లు మాత్రమే. మీరు చెప్పిన 31వేల కోట్ల కంటే ఇది 5వేల కోట్లు తక్కువ.
ఆరోగ్య శ్రీ:
ఆరోగ్యశ్రీకి 2023-24 కు గాను 1,101 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది బడ్జెట్ లో 1,065 కోట్లు కేటాయించారు.
ఆరోగ్య శ్రీ పరిధిని 5లక్షల నుంచి 10లక్షలకు పెంచామని, కొత్త రోగాలు యాడ్ చేశామని, రేట్లు 20శాతం పెంచామని చెబుతూ బడ్జెట్ ను మాత్రం 36కోట్లు తగ్గించారు. ఇదెట్లా సాధ్యం.
కేసీఆర్ కిట్ అనేది మంచి పథకం. దాన్ని కూడా తొలగించారు.
కేసీఆర్ కిట్ పథకం వల్ల ఎంఎంఆర్, ఐఎంఆర్ గణనీయంగా తగ్గింది. దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
భట్టి గారిని కోరడం ఏమిటంటే…
వైఎస్ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రియెంబర్స్ మెంట్, 108 అనేవి మంచి పథకాలు అని, పేర్లు కూడా మార్చకుండా కొనసాగిస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే సభలో చెప్పారు.
కానీ మీరు ఆ మాగ్నానిటీని ప్రదర్శించకుండా పథకాలు రద్దు చేయడం వల్ల పేద గర్బిణీల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఎంతో ప్రభావం చూపుతుంది.
మీకు అంతగా కావాలంటే, భేషజాలు ఉంటే పథకాల పేర్లు మార్చుకోండి కాని దయచేసి పథకాలు ఆపకండి.
పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు పై దెబ్బ కొట్టకండి.
అప్పులు:
బిఆర్ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్లు అప్పు చేసిందని పదే పేద చెబుతున్నరు.
డిసెంబర్ 23నాడు మీరు విడుదల చేసిన శ్వేత పత్రంలో నాలుగు రకాల అప్పులు చూపించారు.
రెండు రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని, శ్వేత పత్రలో క్లియర్ గా మెన్షన్ చేశారు.
మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే గవర్నమెంట్ హామి లేనివి, గవర్నమెంట్ కట్టనివి 59,414 కోట్లు అని చెప్పారు.
గవర్నమెంట్ హామి ఉండి, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనివి 95,462కోట్లు అని చెప్పారు.
అంటే గవర్నమెంట్ కట్టవల్సిన అవసరం లేని అప్పులు 1,54,876కోట్లు.
మీరు చెప్పిన 6,71,757 కోట్ల అప్పుల నుండి గవర్నమెంట్ కట్టవల్సిన అవసరం లేని 1,54,876 కోట్లను తీసేస్తే మిగిలిన అప్పు 5,16,881 కోట్లు.
మీరు ఇచ్చిన శ్వేతపత్రలో రాష్ట్రం ఏర్పడే నాటికి 72,658కోట్ల అప్పు తెలంగాణకు గత ప్రభుత్వాల నుంచి సంక్రమించింది అని చెప్పారు.
5,16,881 కోట్ల ప్రభుత్వం కట్టవల్సిన అప్పు నుంచి వారసత్వంగా వచ్చిన 72,658 కోట్ల అప్పును తీసివేస్తే 4,44,223 కోట్ల అప్పు ఉంటుంది.
తెలంగాణ ఏర్పడక ముందు ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్స్)ల ద్వారా గత ప్రభుత్వాలు చేసిన అప్పు 11,609కోట్లు.
ఈ మొత్తాన్ని కూడా 4,44,223 కోట్ల నుంచి తీసివేస్తే, 4,32,614 కోట్లు మిగులుతుంది.
మీరు శ్వేతపత్రంలో ఎఫ్ఆర్బిఎం అప్పులు మార్చి 31, 2024 వరకు ఉన్న బడ్జెట్ ఎస్టిమేట్స్ ను తీసుకున్నారు.
శ్వేతపత్రం డిసెంబర్ లోనే విడుదల చేశారనేది మనందరికి తెలిసిందే. ఈ శ్వేతపత్రంలో తెలివిగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న 6,115 కోట్ల అప్పును బిఆర్ఎస్ ఖాతాలో జమ చేశారు.
కాంగ్రెస్ తీసుకున్న 6,115 కోట్లను, 4,32,614 నుంచి తీసివేస్తే 4,26,499 కోట్ల అప్పు మిగులుతుంది.
అంటే తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4,26,499 కోట్లు మాత్రమే. కానీ పదే పదే 6,71,757 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అధ్యక్షా.. కేంద్ర ప్రభుత్వం ఉదయ్ అనే స్కీం తీసుకువచ్చి డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని చట్టం చేయడం వలన 9వేల కోట్ల రూపాయల అదనపు అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది.
2019-20 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పు రూపంగా తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అనివార్యంగా 2,459కోట్ల అప్పు తీసుకోవాల్సి వచ్చింది.
కోవిడ్ మహమ్మారి దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేశాయి అనేది అందరికీ తెలిసిన సత్యం. ఆ సందర్భంలో పన్ను రాబడిలు గణనీయంగా తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీలో 1.75శాతం అధికంగా అప్పులు చేసే వెసులుబాటు కల్పించింది.
గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలను ఆదుకోకుండా, అప్పులు తీసుకునే స్థితికి కేంద్రం నెట్టింది. అందువల్ల 17,558 కోట్ల అప్పు చేయవల్సిన అనివార్య పరిస్థితి తెలంగాణకు వచ్చింది.
అదే విధంగా కోవిడ్ కారణంగా 2021-22 సంవత్సరంలో జీఎస్డీపీలో 1శాతం అధికంగా అప్పు చేయాల్సి వచ్చింది. ఆ మొత్తం 10,784 కోట్లు
తెలంగాణ రాష్ట్రం అనివార్యంగా 41,159 కోట్ల అప్పు తీసుకోవల్సిన పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కోవిడ్ వలన నెట్టబడింది. ఇది ఏ ప్రభుత్వమున్నా అనివార్యంగా చేయాల్సిన అప్పు.
ఈ 41,159 కోట్ల అప్పును 4,26,499కోట్ల నుంచి తీసివేస్తే 3,85,340కోట్లుగా తేలుతుంది.
తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమాల కొరకు నెట్ గా చేసిన అప్పు 3,85,340కోట్లు మాత్రమే.
ఆస్తులు:
తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆస్తులను సమకూర్చిందనే వాస్తవాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వెలుగు చూడనివ్వడం లేదు. చర్చకు రానివ్వడం లేదు.
కాళేశ్వరానికి 94,000 కోట్లతో లక్షల కోట్ల విలువైన ఆస్తులను సాధించాం.
మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల కోసం 4వేల కోట్లు ఖర్చు చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాం.
మిషన్ భగీరథకు 28,000 కోట్లు
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ….27,554కోట్లు
సీతారామ ప్రాజెక్టు ….8056కోట్లు
దేవాదుల ప్రాజెక్టు 6000కోట్లు
సమ్మక్క సాగర్ 2000కోట్లు
తుమ్మిళ్ల, భక్తరామదాసు ప్రాజెక్టులు పూర్తి
ఆర్ అండ్ బీ 8200 కిలోమీటర్లు డబుల్ లైన్, 321 కి.మీ ఫోర్ లైన్, 382 బ్రిడ్జిలను బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది.
యాదాద్రి, ఇతర దేవాలయాల కోసం 2,800 కోట్లు.
రైతు బంధుకు 72,972కోట్లు
రైతు బీమా 6,800 కోట్లు
రైతు రుణమాఫీ 29వేల కోట్లు
ఉచిత కరెంట్ కు 61వేల కోట్లు
గొర్రెల పంపిణీకి 5వేల కోట్లు
ఆసరా పింఛన్లకు 61వేల కోట్లు
మీరు కూర్చుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం
పటిష్టమైన భద్రత కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ
జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ
జిల్లాకు ఒక కలెక్టరేట్
జిల్లాకు ఒక ఎస్పీ ఆఫీస్
వెయ్యి గురుకులాలు
68లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వరి ఉత్పత్తిని, 2కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచినం.
నీరుగారిన ఆరు గ్యారెంటీలు:
ప్రముఖ తత్వవేత్త మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాటన్నరు అధ్యక్షా. Each betrayal begins with trust. ప్రతీ ద్రోహం కూడా నమ్మకం లో నుంచే పుడుతుందని అన్నారు.
ఈ కొటేషన్ ఈ ప్రభుత్వ నిర్వాకానికి సరిగ్గా సరిపోతుంది.
ఈ ప్రభుత్వం తమ మొదటి వాగ్దానానికి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తిలోదకాలిచ్చింది. నమ్మక ద్రోహాల పరంపరకు నాంది పలికింది.
I am sorry to say, but unfortunately, This shows the original attitude of this Congress Government.
అభయహస్తం పేరిట మ్యానిఫెస్టో రూపొందించారు అందులో ఆరు గ్యారంటీలను ప్రముఖంగా ప్రస్తావించారు.
మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాల మీద విశ్వాసం కల్పించడం కోసం మరో వాగ్దానం చేశారు.
వంద రోజుల్లో ఆరుగ్యారంటీలు అమలు చేస్తామనే హామికి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టబద్దత కల్పిస్తామని వీరి జాతీయ నాయకులు, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి మునిమనుమలు, ఇందిరా గాంధీ గారి మనునమలు, రాజీవ్ సోనియా గాంధీల సుపుత్రులు, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు అయిన రాహుల్ గాంధీ గారు భూమ్యాకాశాలు దద్దరిల్లే విధంగా ప్రామిస్ చేశారు.
వారలా ప్రకటించగానే పీసీసీ అధ్యక్షులు బాకాలూదిన్రు. కాంగ్రెస్ వాళ్లు భజంత్రీలు వాయించిన్రు.
వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసి, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, అప్పటి సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క గారు చెరోవైపు సంతకాలు చేశారు. ప్రజలను నమ్మించేందుకు ఆ బాండ్ పేపర్లను ఇంటింటికి పంచారు.
తీరా జరిగిందేమిటి అధ్యక్షా. వంద రోజులు గడిచిపోయాయి, 8 నెలలు గడిచిపోయాయి. ఇది మూడో అసెంబ్లీ సమావేశం. చట్టబద్దత చట్టుబండలు అయిపోయిందని సుస్పష్టంగా తేలిపోయింది.
ఆరుగ్యారంటీల అమలుకు చట్టబద్ధత కల్పిస్తారని ప్రజలు పాపం ఎంతో ఆశగా ఎదురుచూశారు.. కానీ జరిగింది ఏమిటి అధ్యక్షా? ఆశగా ఎదురు చూస్తున్న కళ్ళలో దుమ్ముకొట్టిన్రు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాల పేరిట కపట నాటకాన్ని నడిపించారు.
చట్టబద్దత ఏమైందని అడుగుదామంటే రాహుల్ గాంధీ పత్తకు లేడు. చట్ట బద్ధత అనే హామీ ఏమయిందో ఏ కాంగ్రెస్ నాయకుడు పెదవి విప్పడు. ఇగ ముఖ్యమంత్రి గారిని అడుగుదామని అనుకుంటే ఆయనను మాట్లాడించ వశం కాదు. ప్రతిపక్షం మీద రగిలిపోతూ, ఫ్రస్ట్రేషన్ తో పగిలిపోతూ పేగులు మేడలో వేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడుతా, లాగుల తొండలు జొర్రగొడుత, పండవెట్టి తొక్కుత, గోచీ ఊడగొడుతా, లాగులూడగొడుతా… ఇలా వారు రాక్షస భాషలో చెలరేగి పొతుంటే పాపం సామాన్య ప్రజలుకు ఎట్ల అడుగోస్తది అధ్యక్షా
ముఖ్యమంత్రి గారి రాజకీయ రొదలో తిట్ల దాడిలో ఆరు గ్యారంటీలకు చట్ట బద్ధత ఏమైంది మహాప్రభో అనే ప్రజల ఆక్రందన వినిపించకుండా పోయింది అధ్యక్షా
ఐ డిమాండ్ మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా, భయభక్తులు ఉన్నా, మీరిచ్చిన హామీల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ముందిది ఒప్పుకోండి. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రతి ఎన్నికల సభలో నొక్కి వక్కానించిన మాట నిజం.
జాతీయ అధ్యక్షులు ఖర్గే గారి నుంచి మొదలు పెడితే గల్లీ నాయకుడు వరకు అదే మాట చెప్పారు. ఇక భట్టి గారైతే బాండ్ పేపర్లు రాసిచ్చారు. మీకు నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వాక్యం తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి మేము మాట తప్పినం. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక పోయినం అనే కన్ఫెషన్ నోట్ తో ఉండేది. నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పండి.
బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని కాదు ప్రజన్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది. ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడండి. ప్రజలు గమనిస్తున్నరు. ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించండి.
అభయహస్తం మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయి. వాటి అమలు మాట అటుంచి మొత్తం 13 హామీలను ఈ బడ్జెట్ లో ప్రస్తావించిన పాపాన కూడా పోలేదు. ఇది మీకు తగునా..ఆర్థిక మంత్రి గారూ..
అధికారపక్షంగా మీరు గుర్తు పెట్టుకోకపోయినా, ప్రతిపక్షంగా మేము గుర్తుచేస్తూనే ఉంటాం. ఇది ప్రజలు మాకు అప్పగించిన బాధ్యత.
అభయహస్తం మేనిఫోస్టో గ్యారెంటీలు కౌంటర్:
మహాలక్ష్మి:
కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్ట మొదటి హామి మహాలక్ష్మి పథకం. దీంట్లో మహిళలందరిని ఆకర్షించిన ప్రధానమైన అంశం..అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళలందరికి నెల నెలా 2500 రూపాయల చొప్పున చెల్లిస్తమని చెప్పారు. మహిళల ఓట్లు పొందడానికి ఈ అంశం మీకు బాగా ఉపయోగపడ్డది.
అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిపోయింది. మీరు చెప్పింది అమలు చేసి ఉంటే, ఈ నాటికి ప్రతి మహిళ అకౌంట్ లో 20వేలు పడాల్సి ఉండే. పడ్డాయా? పడలేదు. పడకుండానే పడిపోయినట్లు రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలో ప్రకటిస్తరు. అంతపెద్ద నాయకునికి ఇంత గొప్ప మిస్ ఇన్ఫర్మేషన్ మీరు గాక మరెవరు ఇవ్వగలరు.
బడ్జెట్ లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారా? అంటే లేదు.
మహాలక్ష్మి పథకం కోసం గత వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో 4500 కోట్లు ప్రతిపాదించారు. కానీ ఈ పూర్తి స్థాయి బడ్జెట్ కు వచ్చే సరికి మాయమైంది.
పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు తప్ప, ఇప్పుడు అమలు అమలు విషయంలో మొండి చెయ్యి చూపారు.
అంటే భట్టి గారి బడ్జెట్ మీద రాష్ట్రంలోని మహిళలు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయేలా చేసింది. ఈ బడ్జెట్ సారాశం ఏమిటంటే మహిళలకు ఇప్పట్లో 2500 ఇచ్చేది లేదు అని.
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది.
మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయకపోతే, తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహాకాళులు అవుతారు జాగ్రత్త!
ఎన్నికలకు ముందు అందరికీ 500లకే గ్యాస్ సిలిండర్ అన్నరు. అధికారంలోకి రాగానే షరతులు విధించి కొందరికే అన్నరు. సాధారణంగా వ్యాపార ప్రకటనల్లో ఈ రకమైన వైఖరి కనిపిస్తుంది. పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి … కింద ఎక్కడో చిన్న అక్షరాలతో షరతులు వర్తిస్తాయి అని కనిపించకుండా పెడతరు.. ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలెనె ఉండటం శోచనీయం.
ఈ కదంతా ఎందుకు. కనీసం తెల్లరేషన్ కార్డులున్నవాళ్లందరికైనా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన్రు మంచిదే కానీ, బస్సులు సరిపోక ప్రజలు నానా యాతనలు పడుతున్నరు. బస్సులో స్థలం సరిపోక గొడవలు పడుతున్నరు.
కొట్టుకుంటున్నరు. విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్ బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నరు. ఏ ప్రమాదం జరగకముందే మేల్కొని వెంటనే బస్సుల సంఖ్య పెంచండి. ప్రజలకు జరుగుతున్న అసౌకర్యాన్ని తొలగించండని కోరుతున్నా.
రైతు భరోసా:
నేను మీ మేనిఫోస్టో ఆర్డర్ లోనే వస్తున్నా అధ్యక్షా..(మీరు సభను ఆర్డర్ లో పెట్టండి)
రైతు భరోసా అనేది రెండో గ్యారెంటీ. ఈ బడ్జెట్ పరిశీలిస్తే, రైతులు ఆశించిన భరోసా ఏకోశాన కనిపించడం లేదు.
గతంలో మేము రైతు బంధు పేరుతో పంట పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి పది వేలు ఇస్తే, మీరు 15వేలు ఇస్తామని ప్రకటించారు. విధివిధానాల కోసం ఒక కమిటీ వేసారు. ఆ కమిటీకి నిర్దిష్ట కాలవ్యవధి విధించకుండా కాలయాపన చేస్తున్నారు.
ప్రస్తుత సీజన్ కు సంబంధించి ఒక్కరూపాయి కూడా మీరు ఒక్క రైతు అకౌంట్ లో కూడా వేయలేదు. పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు అనివార్యంగా ప్రైవేటు రుణాల కోసం చెయ్యి చాచవల్సి వస్తున్నది.
రైతులతో పాటూ కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు అన్నరు. గత సీజన్‌ లో నాట్ల సమయంలో ఇవ్వకుండా ఓట్ల సమయంలో ఇచ్చిన్రు. అదీ మేము డిమాండ్ చేస్తేనే ఇచ్చిన్రు. కౌలు రైతులకు ఇవ్వనేలేదు. పంచాయతీ ఎన్నికలు వస్తే తప్ప మీరు ఇచ్చేట్లు లేరు అని రైతులు ఆందోళన పడుతున్నారు.
ముందు మీరు ఎప్పుడిస్తారో త్వరగా తేల్చండి. ఈ సీజన్ లోపే తేల్చండి. రైతులకు, కౌలు రైతులకు అన్యాయం చేయకుండా బకాయిలతో సహా చెల్లించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నా.
వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12వేలు ఇస్తామన్న హామిని బడ్జెట్ లో ప్రస్తావించారు. కొన్ని నిధులు కేటాయించిన్రు. సంతోషం. అయితే ఏ ఒక్కరినీ వదలకుండా వ్యవసాయ కూలీలందరికి వర్తింపజేయాలని కోరుతున్నా. ఈ ఎనిమిది నెలలకు గాను వారు కోల్పోయిన బకాయిలను కూడా చెల్లించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
రెండో గ్యారెంటీలోని మరొక ముఖ్యమైన హామి, రైతులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న హామి.. పండిన పంటకు బోనస్.
ఏ ప్రభుత్వాన్నైనా వారు మేనిఫెస్టోలో ప్రవచించిన హామిలు, విలువల ఆధారంగానే ప్రశ్నిస్తాం. నేను అదే పని చేస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అభయహస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ లో బోనస్ ఇచ్చే పంటల లిస్టును స్పష్టంగా పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, కందులు, సోయా బీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్న వీటన్నిటికి 500 బోనస్ ఇస్తామన్నరు. వీటి మద్దతు ధరలు, అదనంగా 500 బోనస్ ఇస్తే వచ్చే మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా పేర్కొన్నరు.
ఇప్పడేమంటున్నరు, బోనస్ కేవలం వరికే, అది కూడా కేవలం సన్నాలకు మత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు.
డిక్లరేషన్ లో ఆరోజు మీరు వరికి పేర్కొన్న మద్దతు ధర 2,183 అనేది దొడ్డు రకం వడ్ల మద్దతు ధర. ఇంత స్పష్టంగా పేర్కొని, ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఎట్ల ప్రకటిస్తరు.
తెలంగాణలో 90శాతం రైతులు పండించేది దొడ్డు రకానికి ఎగ్గొట్టడానికి సన్నాలు అంటున్నరు. మీరు నిజంగానే సన్నాలను ప్రోత్సహించాలనే సదాశయంతోనే ఈ మాట అంటున్నట్లైతే దొడ్డుకు 500, సన్నాలకు వెయ్యి, పదిహేను వందలు అనండి.
సన్నాల సాగు పెంచండి, కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయకండి.
గృహజ్యోతి
మూడవ గ్యారంటీ అయిన గృహజ్యోతి విషయంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కొందరికే అంటున్నరు. అంటే మల్ల గదే షరతులు వర్తిస్తాయనే నిబంధన.
మీరు చెప్పినట్లు ప్రతి కుటుంబానికి కాకపోయినా, కనీసం తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికైనా వర్తింపచేయండి.
గృహజ్యోతిని వెలుగనివ్వండి, కరెంటు కోతలతో కొవ్వొత్తుల జ్యోతులు వెలిగేలా చెయ్యకండి.

యువ వికాసం..
యువ వికాసం కింద విద్యార్థులకు రూ. 5లక్షల విద్య భరోసా కార్డు అన్నరు. ఆ కార్డు ఉంటే ఫీజులే కట్టనవసరం లేదన్నరు. ఇప్పటివరకు కార్డు లేదు, కాకరకాయ లేదు. ఆ ఊసే ఎత్తడం లేదు. యువ వికాసం మరో మోసం కాకూడదని, ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా
చేయూత:
ఈ బడ్జెట్ లో కనీస ప్రస్తావన లేని గ్యారెంటీ చేయూత అనే గ్యారెంటీ. ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి గారు ఎంత డ్రమటిక్ గా చెప్పిన్రు.
కాంగ్రెస్ కు ఓటు వేయండి, డిసెంబర్ 9 నాడు పెద్దమ్మా.. రెండు వేలు కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల పింఛన్ ఇస్తది. ఇగ ఎవ్వర్ని అడుక్కునే పని లేదు. ఐదు వందలో వెయ్యో ఇయ్యిమని మీ మనువడు వచ్చి నీ కాళ్లు ఒత్తుతడు అని చెబుతుంటే తెలంగాణలోని అవ్వాతాతలు మురిసిపోయిన్రు అధ్యక్షా. 8 నెలలుగా ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయిన్రు అధ్యక్షా.
పోస్టాఫిస్ దగ్గరకు, బ్యాంకు దగ్గరకు వచ్చి నాలుగు వేలు ఎప్పుడు పడుతయి బిడ్డా.. అని ఎంతో ఆర్తి తోని, ఆవేదన తోని అడుగుతున్నరు. దివ్యాంగ సోదర సోదరీమణులు దీనంగా ఎదురు చూస్తున్నరు. ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నరు. వితంతువులు, డయాలసిస్ పేషెంట్లు, బోదకాలు బాధితులు, నేతన్నలు, గీతన్నలు కళ్లు కాయలు కాచేటట్లు ఎదురుచూస్తున్నరు.
నాలుగు వేల మాట దేవుడెరుగు రెండు నెలల నుంచి ఇచ్చే రెండు వేలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. మాది ప్రజా పాలన అని, పేదల ప్రభుత్వం అని పెద్ద పెద్ద మాటలు, అంబేద్కర్, గాంధీ, మండేలా సూక్తులు.. ఇవన్నీ పెట్టి పాపం గివీళ్లకు లేట్ చేస్తరా..వీళ్లకంటే పేదవాళ్లు, నిస్సహాయులు ఎవరుంటరు.
మేము 2014లో అధికారంలోకి రాగాcgనే మొదటి క్యాబినెట్ సమావేశంలోనే 42 సంక్షేమ పథకాలను ఆమోదించి అమలులోకి తెచ్చినం. మాది పేదల ప్రభుత్వమని ప్రజలకు విశ్వాసం కల్పించినం. అప్పటి వరకు 200 ఉన్న పింఛన్ ను వెయ్యి రూపాయలు చేస్తమని చెప్పినం, అధికారంలోకి వచ్చిన వెనువెంటనే చేసి చూపినం.
రెండో సారి అధికారంలోకి వచ్చినం వెనువెంటనే రెండు వేలు చేసినం. మీరు వచ్చి 8 నెలలు అవుతున్నది. పింఛన్ కొత్తగ పెరిగింది లేదు, ఉన్నదన్న సరిగ్గ వస్తలేదు.
ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించిన అధ్యక్షా.. బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు అన్నట్టు ‘చేతగానమ్మకు మాటలెక్కువ’ అనే మాట ఇక్కడ ఆప్ట్ గా వర్తిస్తుంది.
మొత్తం మీద వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఎన్నికలప్పుడు బజాయించు హామీల ఢంకా… అమలు చేయకుండా ఉండేందుకు వెతకాలె ఎదో ఒక వంకా.
హామీలు అమలు చేయడం లేదు కానీ, కుంటిసాకులు వెతకడమనే కుతంత్రాన్ని మాత్రం అద్భుతంగా అమలు చేస్తున్నారు.
మీ ఎనిమిది నెలల పరిపాలనలో జరిగింది రాజకీయ గారడీ తప్ప ఒరిగింది ఏమీలేదు.
మేము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. అంతే తప్ప సంక్షేమంలో ఇదీ మా విధానం ఇదీ మా ప్రణాళిక, ఇవీ మేము సాధించిన ఫలితాలు అని చెప్పుకోవడానికి ఏమీలేదు. బభ్రాజమానం భజగోవిందం అంతే.
మేనిఫెస్టోలోని మొదటి పేజీ చాప్టర్1, మొదటి లైన్ లో చెప్పిందేమిటంటే ‘పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన‘ అందిస్తామన్నరు.
పూర్తి ప్రజాస్వామిక పాలన అంటే ప్రజల భావ ప్రకటనా స్వేచ్చకు, నిరసన తెలియజేసే హక్కుకు హామీపడతామనే కదా అధ్యక్షా?
కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటి అధ్యక్షా !
చదువుల తల్లి నిలయమైన సిటీ సెంట్రల్ లైబ్రరీలో పరీక్షలకోసం విద్యార్థులు చదువుకుంటూ ఉంటే, అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులను నిర్బందించి, లాఠీలతో వీరంగం వేసి వీపులు చిట్ల గొట్టారు. ఈ సంఘటన చూసి సరస్వతీ దేవి కూడా కన్నీరు పెట్టుకొని ఉంటది.
ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఘోషించి ఉంటాయి అధ్యక్షా . అందులో చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు బహూకరించిన కాళోజీ నా గొడవ పుస్తకం కూడా ఉండే ఉంటది.
రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాళోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో. కాళోజీ నా గొడవ ఎంత ఘోషించిందో.
ఒక నిరుద్యోగ విద్యార్థి సోషల్ మీడియాలో కాళోజీ కవిత పెట్టిండు. ఏమనంటే అధ్యక్షా.. “ఓటిచ్చునప్పుడే ఉండాలి బుద్ధి, ఎన్నుకొని తలబాదుకున్ననేమగును’’ ఇగ ఇంత కంటే నేను చెప్ప అధ్యక్షా.
ఆదిలాబాద్ లో రైతులు ఎరువులు అడిగినందుకు లాఠీచార్జే సమాధానం
నడిరోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు ఝుళిపించడమేనా మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం.
ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీచార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులూ తిట్టి, కొట్టడమేనా కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యమా ? ఇందిరమ్మ పాలననా ?
అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అణచివేతనే
ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు – నిలదీసిన వారిపై దాడులు
చివరికి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరింపూలూ, కేసులు. జైళ్లు.
మొత్తం మీద కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థి నులకు ఇస్తామన్న స్కూటీలా లేదు. పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది
ఇదేనా మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామిక సుపరిపాలనా ముఖచిత్రం ?
ప్రజల గొంతులు నొక్కేస్తూ, వీపులు వాయగొడుతూ ప్రజాపాలన అని చెప్పుకోవడం మీకే చెల్లింది. ఎంతైనా ఎమర్జెన్సీ ప్రయోగించిన ఇందిరమ్మ రాజ్యం ఎట్లా ఉండాలనో గట్లే ఉన్నది
అభయహస్తం చాప్టర్ 1 సుపరిపాలన కింద పేర్కొన్న మరో ఆణిముత్యం .. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మాదిరిగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తాం అని లిఖించారు
రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలో హమారా చీఫ్ మినిస్టర్ ప్రజాదర్బార్ మే హర్ దిన్ జనతా సే మిలేంగే అని హిందీలో ఘనంగా చెప్పినరు.
బడ్జెట్ పుస్తకంలో ప్రజాదర్బార్ ప్రజావాణి అయింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో అని చెప్పి ప్రజా భవన్ లో కానిచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకే ఒక్క రోజు అటెండ్ అయ్యి ఆరంభ శూరత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.
ప్రతి రోజూ పోయి వారానికి రెండ్రోజులకు, ముఖ్యమంత్రి పోయి మంత్రులకు, మంత్రుల నుంచి ప్లానింగ్ బోర్డు ఛైర్మన్ కు, ఐ ఏ ఎస్ అధికారుల నుంచి అవుట్ సోర్సింగ్ అధికారుల స్థాయికి.. ప్రజాదర్బార్ పరిస్థితి నా నాటికి తీసికట్టు నాగంభొట్లు అన్నట్టు తయారయింది. పరిష్కారాలు చూపించని ప్రజావాణి ప్రాధాన్యత కోల్పోయిందని ప్రజలు భావిస్తున్నారు.
మొదట్లో మీడియా లైవ్ లు నడిచిన ప్రజా దర్బార్ ఇప్పుడు సింగిల్ కాలం వార్తకు కూడా నోచుకుంట లేదు. దరఖాస్తుదారులు పాపం పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగి వేసారి పోతున్నరు.
నాకు అందిన సమాచారం ప్రకారం లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినయి అందులో పది శాతం కూడా పరిష్కారానికి నోచుకోలేదు.
ప్రజాదర్బార్ ప్రజల సమస్యలు తీర్చని ఎండమావిగా మారింది
శ్వేత పత్రాలు విడుదల చేయడంలో దిట్ట అయిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజా దర్బార్ మీద కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని దరఖాస్తుదారుల పక్షాన కోరుతున్నాను.
మా ప్రభుత్వ హయాంలో గ్రామీణ వృత్తులను ఆదుకోవడానికి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టినం.
మత్స్య సంపద పెంచినం. పశు సంపద పెంచినం. మాంసోత్పత్తిని పెంచినం. లాండ్రీలకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ అందించినం.
సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ లో కల్లు డిపోలు మూసేయించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్దరించినం.
హరితహారంలో భాగంగా రాష్ట్రంలో ఈత, తాటి వనాల అభివృద్ధికి పాటుపడినం. గౌడ సోదరులకు చెట్ల రఖం రద్దు చేసినం. బకాయిలు కూడా మాఫీ చేసినం. ప్రమాదవశాత్తు చెట్ల మీద నుంచి పడిపోతే ఇచ్చే ఎక్స్ గ్రేషియాను 50వేల నుంచి 5లక్షలకు పెంచినం. మద్యం షాపులకు ఇచ్చే లైసెన్స్ లలో గౌడ సోదరులకు 15శాతం రిజర్వేషన్ కల్పించినం. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం రాగానే హైదరాబాద్ లోని కల్లు డిపోల మీద దాడులు జరుగుతుండటంతో గౌడ సోదరులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన్రు.
ముఖ్యమంత్రి గారు ఈ సభా వేదికగా గౌడ సోదరులకు ఎటువంటి వేదింపులు ఉండవని ఒక హామి ఇవ్వండి. మాట ఇవ్వడమే కాకుండా చేతల్లో కూడా చూపించండి.
అధ్యక్షా తెలంగాణ ఏర్పడిన నాడు రైతుల ఆత్మహత్యలతో పాటు చేనేత కార్మికుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారిపోయినయి. మేమెంతో బాధ్యతాయుతంగా ఆలోచించినం. చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించినం. చేనేత కార్మికునికి, పవర్ లూమ్ కార్మికునికి 15వేలకు తగ్గకుండా ఆదాయం లభించే విధంగా చర్యలు తీసుకున్నాం. చేనేత కార్మికుల ఆత్మహత్యలు అనేవి లేకుండా చేసినం.
బతుకమ్మ చీరెలతో బతుకునిచ్చినం. రంజాన్ తోఫా ఆర్డర్లతో రంది తీర్చినం. యూనిఫాం ఆర్డర్లు ఇచ్చి భరోసా కల్పించినం.
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల నోటి కాడి బుక్క ఎత్తగొట్టిన్రు. వాళ్లకు ఆర్డర్లు బంద్ పెట్టి పని లేకుండా చేసిన్రు. మీ నిర్వాకం వల్ల ఇప్పటికే 14 మంది చేనేత కార్మికులు ప్రాణాలు తీసుకున్నరు.
మా ఆర్డర్లు మాకు గావాలె అని రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నరు. ఈ ప్రభుత్వానికి చేనేత కార్మికుల ప్రాణాలు లెక్కలేకుండా పోయాయి.
ఇగ మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన్రు. బీసీ సంక్షేమానికి 5 ఏళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తమన్నరు. కానీ బడ్జెట్ లో కేటాయింపులు దానికి అనుగుణంగా లేవు.
లెక్క ప్రకారం ఏడాదికి 20వేల కోట్లన్నా పెట్టాలె. ఈ బడ్జెట్ లో మీరు పెట్టింది 9వేల కోట్లు. బీసీ డిక్లరేషన్ పై మీకున్న కమిట్మెంట్ ఏమిటో ఈ కేటాయింపులతో తేటతెల్లమైంది.
ఎంబీసీ కులాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెడుతానన్నరు. దాని ఊసే లేదు.
మైనార్టీల బడ్జెట్ 4వేల కోట్లు పెంచుతమన్నరు. 3వేలు మాత్రమే పెట్టిన్రు.
ఇమాంలు, పాస్టర్లు, గ్రంధిలతో పాటు మత బోధకులందరికీ 10 నుంచి 12 వేల గౌరవ వేతనం ఇస్తమన్నరు. దాని ప్రస్తావనే లేదు.
ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రత్యేక డీఎస్సీ పెడుతమన్నరు. పెట్టనేలేదు. ఎప్పుడు వేస్తరో చెప్పండి.
ఈ ప్రభుత్వం ఎక్కువ ఎక్సర్ సైజ్ చేస్తున్న డిపార్ట్ మెంట్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్.
మా ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం 18 వేల కోట్లుగా అంచనా వేసినం.
ఇందిరమ్మ రాజ్యంలో ఎంత అంచనా వేస్తున్నారు అధ్యక్షా 25,617 కోట్లు.
అంటే మా అంచనా కన్నా 7,617 కోట్లు ఎక్కువ అంచనా వేస్తున్నారు
18వేల కోట్లు అంచనా వేసినందుకే ఆనాడు మా మీద లేనిపోని అభాండాలు వేసిన్రు.
మరి ఇవాళ మీరు 25వేల కోట్లు అంచనా వేస్తున్నరు. అంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నరు. బెల్ట్ షాపులను పెంచాలనుకుంటున్నరా.
మీరు ఈ బడ్జెట్ లో మిషన్ భగీరథ గురించి చాలా తక్కువ చేసి చూపించిన్రు. 34వేల కోట్లు వృదా చేసినమని బురదజల్లే ప్రయత్నం చేసిన్రు. మిషన్ భగీరథ కోసం పెట్టిన ఖర్చు 28వేల కోట్లు అనే సత్యాన్ని మరుగపరిచే ప్రయత్నం చేసిన్రు. బడ్జెట్ సాక్షిగా సత్యదూరమైన విషయాలు చెప్పడం ఆర్థిక మంత్రి అయిన భట్టి గారికి భావ్యం కాదు.
మేము పరిపాలనలోకి వచ్చిన రోజు రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి ఏమిటి. చౌరస్తాల్లో వీధి నల్లాల దగ్గర మహిళలు బిందెడు నీళ్ల కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. ప్రతి ఎండకాలం ట్యాంకర్ల కోసం ఎమ్మెల్యేలకు మొర పెట్టుకోవాల్సిన పరిస్థితి. బిందె మీద బిందె పెట్టుకొని గిరిజన తల్లులు మైళ్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి.
ఎమ్మెల్యే వస్తున్నడంటే రోడ్డుకు అడ్డంగా ఖాళీ బిందెల ప్రదర్శనలు జరిగేవి. ప్రతి ఎండాకాలం అసెంబ్లీలో కూడా తాగు నీటి ఎద్దడి మీద ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టేవి. మేము ఉన్న పదేళ్లు మీకు ఆ అవకాశం లేకుండా చేసినం. ఒక్కరోజున్నా తాగు నీటి ఎద్దడి మీద మీరు మాట్లాడిన దాఖలా ఉందా? లేదు కదా.
మీరు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ అస్తవ్యస్తం చేస్తున్నరు. సరైన నిర్వహణ లేదు. మళ్లా తాగు నీటి యెద్దడి సమస్య ముందుకు వస్తున్నది.
మీ అస్తవ్యస్త విధానాల ఫలితంగా ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతిన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా 30 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ కర్కశ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు
మేమిఫెస్టోలో ఏడాదికి 12 వేలు ఇస్తామని అన్నారు. అతీగతి లేదు. చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా దిక్కు లేదు. ఆటో కార్మికులను ఆదుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి వాటిని అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని యూత్ డిక్లరేషన్ లో కేటగారికల్ గా చెప్పిన్రు. ఏడాదిలోపు చేస్తామని చెప్పిన హామీ గురించి ఈ బడ్జెట్ లో ప్రస్తావనే లేదు. ఒక్క రూపాయి కేటాయింపు లేదు.
నిరుద్యోగ సోదరులలో ఆశలు రేపి, వాళ్ళను తమ పార్టీ ప్రచారకులుగా మార్చుకొని బస్సుయాత్రలు చేయించి గడప గడప తిప్పి ఓట్లు దండుకున్నారు. ఇప్పుడేమో బడ్జెట్ లో మొండి చేయి చూపించారు.
సంవత్సరం లోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ కేలండర్ ప్రకటిస్తామన్నారు. ఎనిమిది నెలలు గడిచాయి. మిగిలిన నాలుగు నెలలలో జాబ్ కేలండర్ ప్రకటించేది ఎప్పుడు ? ఉద్యోగాలు నింపేది ఎప్పుడు.
ఇంకోవైపేమో.. మేము నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియ పూర్తీ చేసిన 31,761 ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి అవి తమ ఖాతాలో వేసుకోవడం ఈ ప్రభుత్వ దివాలాకోరు తనానికి మోసపూరిత వైఖరికి ప్రబల నిదర్శనం.
మేము ఐదువేల పై చిలుకు ఉద్యోగాలతో డి ఎస్ సి నోటిఫికేషన్ ఇచ్చినం. మీ మేనిఫెస్టోలో ఆరునెలల్లో అన్ని ఉపాధ్యాయపోస్టులను అంటే 25 వేల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. అందుకోసం మెగా డి ఎస్ సి నిర్వహిస్తామని మొదటి క్యాబినెట్ లోనే ఆమోద ముద్ర వేస్తామని అన్నారు.
ఆరునెలలు కాదు కదా ఎనిమిది నెలలు అవుతున్నాయి. మెగా డి ఎస్ సి వేసింది లేదు. మేమిచ్చిన ఐదువేలకు మరో ఆరు వేలు కలిపి ఇదే మెగా డి ఎస్ సి అని దగా కోరు వైఖరి ప్రదర్శిస్తున్నారు.
గ్రూప్1, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల భర్తీది ఇదే కథ. చెప్పింది ఒకటి చేసింది ఒకటి. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో అదనంగా రెండువేల పోస్టులు పెంచుతామన్నారు. గ్రూప్ 3 లో మూడువేల పోస్టులు పెంచుతామని అన్నారు. మాట నిలబెట్టుకోలేదు. ఇచ్చిన హామీ నిలబెట్టు కోమని అడిగిన పాపానికి నిరుద్యోగుల మీద దమనకాండ జరుపుతున్నారు.
మీరిచ్చిన హామీలనే కదా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు? భట్టి గారూ మీరిదే ఫ్లోర్ మీద గ్రూప్ వన్ మెయిన్స్ కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని మీ నోటితో మీరే డిమాండ్ చేసారు. మీ డిమాండ్ ను మీకు గుర్తు చేస్తున్న నిరుద్యోగులను ఇప్పుడు మీరు ఎందుకు అణచివేస్తున్నారు? రాజకీయంగా మీరు వాడుకున్నప్పుడు అది నిరుద్యోగ సమస్య. అదే సమస్య మీకు ఎదురైతే అది రాజకీయ కుట్ర అని దురుద్దేశ్యాలు అంటగడుతున్నారు.
నిరాహార దీక్ష చేసిన గిరిజన బిడ్డ మోతీలాల్ నాయక్ గురించి ఆయన అసలు ఉద్యోగానికి అప్లై చేయనేలేదని అసలు నిరుద్యోగే కాదని అభాండాలు వేసి అణచివేస్తారా? తెలంగాణ యువత ఆశలతో రాజకీయ చెలగాటమాడుతారా?
ఉపాధ్యాయ ఉద్యోగులకు ఈ బడ్జెట్ తీవ నిరాశనే మిగిల్చింది. ఐదు విడతల కరువు భత్యం తక్షణం విడుదల చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఆరునెలల్లో పి ఆర్ సి ఇస్తామన్నారు. ఈ హామీ హుష్ కాకి అయింది. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ రావడం లేదు. ఎప్పుడొస్తాయో అర్థం కాని అయోమయంలో పాపం రిటైర్డ్ ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారు. ఇ హెచ్ ఎస్ అమలు మీద మాట తప్పారు. సిపిఎస్ విధానం రద్దు అనే హామీ ఆగమైపోయింది.
బి ఆర్ ఎస్ హాయంలో హైదారాబాద్ అభివ్రుద్ధికాలేదని బడ్జెట్లో పెద్ద జోక్ పేల్చారు. ఇది జోక్ ఆఫ్ ద డికేడ్. హైదరాబాద్ లో తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చేసినం
బస్తీల పేదలకు, మధ్యతరగతి అపార్ట్ మెంట్లకు ఉచితంగా తాగునీరు సరఫరా చేసినం
బస్తీ దవాఖానాలు పెట్టినం.
మెట్రో రైలు పూర్తీ చేసినం
ఎస్ ఆర్ డీ పీ కింద 19 ఫ్లై ఓవర్ లు, 5 అండర్ పాస్ లు 7 ఆర్వోబీలు వీటికి తోడుగా కేబుల్ బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ లు నిన్నగాక మొన్న మీరు ప్రారంభించైనా గోపన పల్లి ఫ్లై ఓవర్ కూడా మేమే నిర్మించి ట్రాఫిక్ సమస్యను గణనీయంగా తగ్గించినం
ఐటీ ఉత్పత్తులు 57 000 కోట్ల నుండి – 2.41 లక్షల కోట్లకు పెంచినం
ఐ టీ ఉద్యోగాలు 323000 నుండి10 లక్షల వరకు పెంచినం
ప్రపంచంలో దిగ్గజ ఐ టీ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది మా పాలనలో కాదా ?
దేశంలోనే ఎక్కడ లేని విధంగా 10 లక్షల సిసి కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా చేసినం
గంగా జమునా తెహజీబ్ ను మత సామరస్యాన్ని కాపాడినం. కరువులూ కర్ఫ్యూలు లేని పరిపాలన అందించినం
మీరు రివ్యూలకోసం చాలా సౌకర్యంగా కూచుంటున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం, సచివాలయ భవనం కూడా మా హాయంలోనే నిర్మాణమైనాయనే సంగతి ఎమార్చలేరు. మీరు వద్దన్నా ఆ భవనాలు మీకు గుర్తుచేస్తాయి.
ముఖ్యమంత్రి గారి గురువు సారీ సహచరుడైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యనే హైదరాబాద్ లో జరిగిన సభలో కే సి ఆర్ హయాం లో హైదరాబాద్ చాలా అభివృద్ధి జరిగింది అని ప్రకటించినారు. ప్రత్యర్థులు కూడా ప్రశంసించేలా మేము హైదరాబాద్ ను అన్ని కోణాలలో అభివృద్ధి చేసినం. కుట్ర పూరితంగా మీరు కాదన్న మాత్రాన కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధి అదృశ్యమై పోదు
ముగింపు…..
ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైనట్లుంది
కేంద్ర బడ్జెట్ తెలంగాణకు మొండి చేయి చూపింది. రాష్ట్ర బడ్జెట్ లో అభయ హస్తం శూన్య హస్తంగా మారింది.
వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్ అని డబ్బా కొట్టినప్పటికీ బడ్జెట్ అంచనాలకు, వాస్తవికతకు మధ్య చాలా దూరం ఉంది.
ఇది ప్రజల బాగోగులు కేంద్రంగా తయారైన బడ్జెట్ కాదు. రాజకీయం ఎక్కువ, ప్రజల కోణం తక్కువ. ఆరు గ్యారంటీలకు దిక్కులేదు, హామీలు నెరవేరే మార్గం లేదు
భట్టి గారు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నట్టు సంపద వల్ల సమర్థత రాదు కానీ సమర్థత వల్ల సంపద వస్తది … ఈ ప్రభుత్వానికి సమర్థత లేదు, వాస్తవిక అంచనాలు లేవు కనుక ఆశించిన సంపద రాదు, ఫలితంగా ప్రజల సమస్యలు పరిష్కారం కావు అనే నిరాశనే ఈ బడ్జెట్ మిగిల్చింది.
రాబోయే బడ్జెట్ అయినా ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటునాను. ఇకనుంచైనా ఈ ప్రభుత్వానికి రాజకీయాలు కేంద్రంగా కాకుండా ప్రజలు కేంద్రంగా ఆలోచించే సద్బుద్ధిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X