KTR Condemns Illegal Arrest of Telangana Digital Media’s Former Director Dileep Konatham

Autocracy in Telangana? Dileep Konatham’s Arrest Sparks Outrage!

Illegal Arrests Won’t Silence the People! KTR Demands Immediate Release of Dileep Konatham

Is Telangana Now a Police State? KTR Calls Out Revanth’s Autocratic Rule Over Illegal Detention of Former Digital Director of Telangana Dileep

Hyderabad: BRS Party in a statement by its Working President K.T. Rama Rao said that, in a brazen display of autocratic governance, former Telangana Digital Media Director Dileep Konatham was illegally detained without any formal information or clarity on the charges against him.

The Party states that, this arrest comes after a series of incidents where Dileep questioned the inefficiency of Revanth Reddy’s government, which seems to be using revenge politics to silence critics.

BRS Working President KTR added that, despite a previous reprimand from the High Court for such actions, the state government continues to target those who speak out, showcasing a complete disregard for democratic principles.

KTR has strongly condemned this unlawful detention and called for Dileep’s immediate release, asserting that no number of false cases or arrests will stop the voices that question this administration. BRS leader further added that, the blatant suppression of freedom of speech in Telangana has been going on for the last 9 months, reflecting a shift towards autocracy under Congress rule.

Also Read-

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ వాది కొణతం దిలీప్ ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోంది.

కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిన బుద్ధి రాలేదు. ఎలాగైనా దిలీప్ గొంతునొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారు.

ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే? అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చునుకుంటే అది మీ భ్రమే. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత పుట్టుకొస్తారు. అక్రమంగా దిలీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను విడుదల చేయాలి. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదు. నిరంకుశ పాలన సాగుతోంది.

దేవీప్రసాద్ కార్పొరేషన్ మాజీ

దిలీప్ కొనతంను అరెస్టు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు ఇచ్చినప్పటికీ అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషం. కేసు వివరాలుచెప్పకుండా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవటం అక్రమం కేసు, ఎఫ్ఐఆర్ పైన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడం ఎమర్జెన్సీ రోజులు గురుతుకొస్తున్నాయి. ప్రజాపాలన పేరుతో ప్రభుత్వము అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కే ప్రతీకార పాలనకు నిదర్శనం.

కొణతం దిలీప్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్న ప్రజల సమస్యల ను పరిష్కరించే వైపు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నాం. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు జోక్యం తో నిలిచిపోయింది. ఎలాగైనా దిలీప్ గొంతునొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తిస్తాం.

మాజీ డిజిటల్ డైరెక్టర్, తెలంగాణ వాది కొణతం దిలీప్ ను అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. గత కొంతకాలంగా ప్రభుత్వ తప్పులను సోషల్ మీడియాలో ఎత్తిచూపుతున్న దిలీప్ కొణతం. కొణతం దిలీప్ ను టార్గెట్ చేసిన రేవంత్ సర్కారు. ఆరునెలలుగా కొణతం దిలీప్ ను వేధిస్తున్న పోలీసులు. గతంలోనే ఒక అక్రమ కేసు పెడితే… రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు. దిలీప్ కొనతంను అరెస్టు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు.

కొనతం దిలీప్ ఇంటి నుంచి ఎలాంటి కారణం చెప్పకుండా బలవంతంగా తీసుకు వెళ్లిన పోలీసులు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయి… మమ్మల్ని ఏ వివరాలు అడగొద్దు అన్న పోలీసులు.కేసు ఎఫ్ఐఆర్ వంటి ఈ అంశం పైన ఇప్పటివరకు స్పష్టత ఇవ్వని పోలీసులు. కాంగ్రెస్ సర్కారు, పోలీసుల తీరుపై బీఆరెస్ నేతల ఆగ్రహం. ప్రజాపాలన పేరుతో ఖాకీదౌర్జన్యమేంటని మండిపాటు. కొణతం దిలీప్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్ ను ఖండించిన బీఆర్ఎస్ నేతలు. సీఎం ఆదేశాలతోనే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ సీసీఎస్ స్టేషన్ లో నిరసన. వెంటనే దిలీప్ ను విడుదల చేయాలని డిమాండ్.

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, ప్రముఖ తెలంగాణ వాది కొణతం దిలీప్ అరెస్ట్ ను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారం లేకుండా ఆయనను అరెస్ట్ చేయటంపై మండిపడ్డారు. అక్రమంగా బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో కొణతం దిలీప్ ను నిర్బంధించారన్న విషయం తెలియటంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, కార్తీక్ రెడ్డి సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు సీసీఎస్ కు చేరుకున్నారు. కొణతం దిలీప్ ను ఎందుకు అక్రమంగా నిర్భంధించారని పోలీసులను ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు వాగ్వాదం జరిగింది. పై నుంచి ఆదేశాలు రావటంతోనే అరెస్ట్ చేశామంటూ కొణతం దిలీప్ అరెస్ట్ కు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపలేదు. దీంతో ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు దిలీప్ ను విడుదల చేసే వరకు అక్కడే ఉంటామని చెప్పారు.

అనంతరం బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

పోలీసుల మీద ఆధారపడి బతకాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మిగతా డిపార్ట్ మెంట్లతో పనిచేయించే పరిస్థితి లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కనుకనే పోలీసులను వాడుకొని భయపెట్టే పని చేస్తున్నారు. దిలీప్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటే సహేతుకమైన కారణం చెప్పటం లేదు. ఏదో అనుమానం ఉంది. ఏందో ప్రశ్నిస్తాం అంటే మీ ఇష్టరాజ్యం కాదు. ఇది పోలీసు రాజ్యం కాదు. మాట్లాడితే ప్రజా ప్రభుత్వమంటారు. కానీ ప్రజలను మింగేసే, ప్రశ్నిస్తే దాడులు చేసే ప్రభుత్వం ఇది. ఏ కారణం లేకుండా కొణతం దిలీప్ గారిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. దీనికి క్షమాపణ చెప్పాలి. వెంటనే కొణతం దిలీప్ ను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేత

కొణతం దిలీప్ గారిని ఏం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులతో ఏమాత్రం కమ్యూనికేషన్ లేకుండా గంటల పాటు నిర్భంధంలో పెట్టారు. ఏం ఆధారం ఉందో చూపించాలని పోలీసులను అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు. తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ కు కొణతం దిలీప్ కు ఏమాత్రం సంబంధం లేదు. ఆధారాలు చూపించాలంటే చూపరు. తెలుగు స్క్రైబ్ హ్యాండిల్ ఒక న్యూస్ పోస్ట్ చేసింది. అది మత కలోల్లానికి సంబంధించిన వార్త అంటారు. తెలుగు స్క్రైబ్ కు కొణతం దిలీప్ కు సంబంధం ఉందటారు. అసలు ట్విట్టర్ వాళ్లు మీకు చెప్పారా?

మత కల్లోలాలను బీఆర్ఎస్ ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. కేసీఆర్ గారు గంగా జమున తెహజీబ్ సంస్కృతి ని కాపాడారు. బీజేపీ వాళ్లు ఓపెన్ గా రాష్ట్ర వ్యాప్తంగా మత కల్లోలాలను వ్యాప్తి చేసేలా వాళ్ల అఫిషీయల్ హ్యాండిల్స్ లోనే ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అనేది లౌకిక వాద పార్టీ. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని అరెస్ట్ చేయండి. మేము కూడా సహకరిస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ కు దిలీప్ అపాయింట్ అయినట్లు లెటర్ ఏమైనా ఉందా? బీఆర్ఎస్ పార్టీకి, తెలుగు స్క్రైబ్ కు ఏం సంబంధం? సీఎం ఆదేశాలతోనే దిలీప్ ను అరెస్ట్ చేశారు. అక్రమ నిర్భందం ఇది. మీరు అరెస్ట్ చేయాల్సిన వాళ్లు వేరే ఉన్నారు. మతం పేరుతో చిచ్చు పెడుతున్న వాళ్లను కనీసం పట్టుకోవటం లేదు.

ముఖ్యమంత్రి గారే హోంమంత్రి గా కూడా ఉన్నారు. వెంటనే అక్రమంగా నిర్భంధించిన కొణతం దిలీప్ ను విడుదల చేయాలి. కక్షపూరిత, ప్రతీకార పూరిత చర్యలను ముఖ్యమంత్రి గారు మానుకోవాలి. అక్రమంగా నిర్బంధించిన దిలీప్ ను విడుదల చేసే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్లం. ఖమ్మంలో మా బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X