కొమురవెళ్లి మల్లన్న స్వామి కల్యాణం, ప‌ట్టు వస్త్రాలతో పాటు రూ. కోటి విలువైన బంగారు కిరీటాన్ని స‌మ‌ర్పించిన మంత్రి హ‌రీశ్‌రావు (Photos)

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి క‌ల్యాణోత్స‌వంలో మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు. కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న స్వామికి ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వస్త్రాలతో పాటు రూ. కోటి విలువైన బంగారు కిరీటాన్ని మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌ర్పించారు.

కొమురవెళ్లి మల్లన్న మన కొంగు బంగారమని, రాష్ట్రానికే తలమానికం మల్లన్న జాతర అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు. ఇవాళ మల్లన్న స్వామివారి కల్యాణం వైభవంగా జరగడం స్వామివారికి బంగారు కిరీట ధారణ చేయడం సంతోషంగా ఉన్నదని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న మన కొంగు బంగారమని, రాష్ట్రానికే తలమానికం మల్లన్న జాతర అని పేర్కొన్నారు. ఇవాళ మల్లన్న స్వామివారి కల్యాణం వైభవంగా జరగడం, స్వామివారికి బంగారు కిరీట ధారణ చేయడం సంతోషంగా ఉంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ.. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి వెల్లడించారు.

కొముర‌వెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికై రూ. 30 కోట్లు కేటాయించార‌ని గుర్తు చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ మల్లన్న స్వామివారిని రెండుసార్లు దర్శించుకున్నారు. వచ్చే ఏడాది మల్లన్న స్వామి కల్యాణం వరకు కేతమ్మ, మేడమ్మల అమ్మవార్లకు ఒక కిలో స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని మంత్రి ప్ర‌క‌టించారు. కొందరు ఎన్ని కుట్రలు చేసిన మల్లన్న దయతో మల్లన్న సాగర్ అనుకున్న సమయానికి పూర్తి చేసుకున్నాం. మల్లన్న దేవుడి దయతో, సీఎం కేసీఆర్ కృషితో మూడేళ్లలో మల్లన్న సాగర్ పూర్తి చేసుకుని పలు జిల్లాలకు సాగునీటితో సస్యశ్యామలం చేయడం జరుగుతున్నద‌ని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రారంభం చేసి గోదావరి జలలతో సీఎం కేసీఆర్ మల్లన్న పాదాలు కడిగి మొక్కులు తీర్చుకున్నార‌ని హ‌రీశ్ రావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ.. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి వెల్లడించారు.

రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…

గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కొమురవెళ్లి మల్లన్న స్వామి కల్యాణం ఘనంగా వైభవంగా జరిగింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొమురవెళ్లి మల్లన్న ఆలయ అభివృద్ధికై రూ.30 కోట్లు కేటాయించారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ మల్లన్న స్వామివారిని రెండుసార్లు దర్శించుకున్నారు.

వచ్చే యేటా మల్లన్న స్వామి కల్యాణం వరకు కేతమ్మ, మేడమ్మల అమ్మవార్లకు ఒక కిలో స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని మంత్రి హరీశ్ వెల్లడి.

కొమురవెళ్లి మల్లన్న కల్యాణం కోసం అశేష జన వాహిని సమక్షంలో హాజరుకావడం చాలా సంతోషం.

రూ. 1100 కోట్ల రూపాయలతో యాదాద్రి నిర్మాణం జరగడం సంతోషకరం.

కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించడం జరిగింది.

కోరిన కోర్కెలు తీర్చే కొమురవెళ్లి మల్లన్నకు కిలోన్నర స్వర్ణ కిరీటం చేయించడం సంతోషం.

కొందరు ఎన్ని కుట్రలు చేసిన మల్లన్న దయతో మల్లన్న సాగర్ అనుకున్న సమయానికి పూర్తి చేసుకున్నాం.

మల్లన్న దేవుడి దయతో, సీఎం కేసీఆర్ కృషితో మూడేళ్లలో మల్లన్న సాగర్ పూర్తి చేసుకుని పలు జిల్లాలకు సాగునీటితో సస్యశ్యామలం చేయడం జరుగుతున్నది.

మల్లన్న సాగర్ ప్రారంభం చేసి గోదావరి జలలతో సీఎం కేసీఆర్ మల్లన్న పాదాలు కడిగి మొక్కులు తీర్చుకున్నాం.

రూ.11కోట్ల రూపాయలతో భక్తులకు కావాల్సిన క్యూలైన్లు, 50 గదులతో సత్రం, కోనేరు అభివృద్ధి, దేవాలయం అభివృద్ధి ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X