మోదీ నినాదం ‘‘ఖేలో ఇండియా- జీతో ఇండియా’’…
కేసీఆర్ నినాదం ‘‘పీలో తెలంగాణ –పిలావో తెలంగాణ’
క్రీడలకు అధిక బడ్జెట్ కేటాయించిన ఘనత మోదీదే
మద్యం మత్తులో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తూ క్రీడలను విస్మరించిన కేసీఆర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
హైదరాబాద్ : హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఘనంగా ప్రారంభమైన ‘‘ఖేలో భారత్ –జీతో భాగ్యనగర్’’ క్రీడలు ‘‘ఖేలో ఇండియా- జీతో ఇండియా’’ నినాదంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో క్రీడలను ప్రోత్సహిస్తుంటే… ముఖ్యమంత్రి కేసీఆర్ ‘‘పీలో తెలంగాణ –పిలావో తెలంగాణ’’ నినాదంతో మద్యాన్ని ఏరులై పారిస్తూ క్రీడలను విస్మరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.
• హైదరాబాద్ లోని ఛాదర్ ఘాట్ లో ‘‘ఖేలో భారత్ – జీతో భాగ్యనగర్’’ పేరిట క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తోపాటు జాతీయ ఓబీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్ రాజ్ అహిర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ నాయక్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరుజల్లుల నడుమ బాణాసంచా పేల్చి క్రీడా పోటీలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…
• ఖేలో ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. బీజేపీ ఎంపీలున్న ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అనాథగా మారొద్దనే ఉద్దేశంతో డాక్టర్ లక్ష్మణ్ భుజాన వేసుకుని క్రీడలు నిర్వహించడం అభినందనీయం.
• ‘‘ఖేలో భారత్ – జీతో భాగ్యనగర్’’ పేరుతో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో క్రీడలను ప్రారంభించడానికి ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో… ఆటలు కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా సమ్మర్ లో విద్యార్థులందరికీ దాదాపుగా సెలవులే కాబట్టి అందరినీ భాగస్వాములను చేసేందుకు ఈ క్రీడలను నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది.
• నరేంద్రమోదీ గారు ప్రధాని అయ్యాక క్రీడల్లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా పక్కకుపెట్టారు. పేద, ధనిక, అధికారం అనే తేడా లేకుండా నైపుణ్యమే తొలి మెట్టుగా తీసుకుని క్రీడాకారుల ఎంపిక జరిగేలా చేశారు. యూపీఏ హయాంలో క్రీడా రంగ బడ్జెట్ 466 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. మోదీగారు ఈ బడ్జెట్ (2023-24)లో క్రీడలకు రూ.3 వేల 397 కోట్లు కేటాయించారు..
• తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ‘‘ఖేలో ఇండియా’’ కేసీఆర్ నినాదం ‘‘పీలో తెలంగాణ-పిలావో తెలంగాణ’’ నినాదంతో పాలిస్తున్నారు. పొద్దున లేస్తే బాటిల్ ముందు పెట్టుకుని తాగడం తాగించడమే పనిగా పెట్టుకుని పనిచేస్తున్నడు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో 5 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. ఇంటికో ఉద్యోగమిస్తానని చెప్పి మాట తప్పి నిరుద్యోగ యువకులను నిలువునా మోసం చేసిండు. ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో యువత ఆశలను చిదిమేసిండు. రుణమాఫీ చేస్తానని, ఫ్రీ ఎరువులిస్తానని రైతులను మోసం చేసిండు. దళిత బంధు, దళితులకు మూడెకరాల పొలం పేరుతో దళితులను, పోడు పట్టాల పేరుతో గిరిజనులను మోసం చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసాలకు అంతేలేదు. యువత కేసీఆర్ మోసాలను గ్రహించాలి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే క్రీడలకు అత్యధిక ప్రోత్సహిస్తాం.