కెసిఆర్ కు చర్లపల్లి జైలు తప్పదు…
కుటుంబ పాలనకు చరమగీతం పాడండి…
రైతు సమస్యలు పట్టని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు…
Hyderabad: ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శేష జీవితం చర్లపల్లి జైలులో అని… కేంద్రంలో బిజెపి… రాష్ట్రంలో తెరాసాసర్కార్ కు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ టి పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖీలాషాపురం గ్రామాల్లో స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మయ్య మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో కాలం వెలదీస్తున్న కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని కుటుంబ పాలనతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని వాటిపై విచారణ జరిగితే కేసీఆర్ కుటుంబానికి జైలు పాలుకాకా తప్పదని ఆయన అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసిఆర్ దక్కింది అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన అయిందని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులకు పెద్దపీట వేస్తూ వారికి అనుకూలంగా ఉన్న కంపెనీలకే కాంట్రాక్టు ఇస్తూ పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ బంధువులకే పోలీసు వాహనాల కాంట్రాక్టు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ది అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో రాష్ట్రంలో సుశ్రిత పాలన అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ సర్కార్ రైతు సమస్యలను గాలికి వదిలి ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతాంగం పట్ల కాంగ్రెస్ అండగా నిలిచి దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల పక్షాన ఉండేది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలంఆయన అన్నారు.
రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తక్షణమే ధరణి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని.. రాష్ట్రంలోకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజి, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి ధర్మ సంతోష్ రెడ్డి, జనగామ జిల్లా నాయకులు ఉడత రవియాదవ్ సోషల్ మీడియాఇన్చార్జి పిట్టల సతీష్, మండల పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్, ఎంపీపీమేకల వరలక్ష్మి నరేందర్, జిల్లా నాయకులు కొలిపాకసతీష్, కవాటి భాస్కర్ రాజకుమార్ సర్పంచ్ శ్రీధర్, ఎంపీటీసీ అల్బిలి కృష్ణ అంజిరెడ్డి రఘునాథ్ పల్లి, sc సెల్ అధ్యక్షుడు కడారి నగేష్ నమాల రాజు తదితరులు పాల్గొన్నారు
.