KCR… మీ తప్పు లేకపోతే ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదు?

  • ఎంజీఎం ఆసుపత్రిలోనే ప్రీతి చనిపోయింది
  • ప్రీతి డెడ్ బాడీని నిమ్స్ తరలించి ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు డ్రామాలాడారు
  • సైఫ్ ను కాపాడేందుకే కేసీఆర్ ప్రభుత్వం డ్రామాలు
  • ప్రీతిది ముమ్మాటికీ హత్యే…
  • కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పుడే స్పందించి ఉంటే ప్రీతి బతికేది
  • పోలీసులూ… మీ కుటుంబ సభ్యుల విషయంలో ఇట్లానే వ్యవహరిస్తారా?
  • ప్రీతి డెడ్ బాడీ థంబ్ ప్రింట్ తీసుకుని మొబైల్ లాక్ తీసి ఆధారాలు చెరిపేస్తారా?
  • కుటుంబ సభ్యులను బెదిరించి డెడ్ బాడీని ఎత్తుకెళ్లే నీచానికి దిగజారిన కేసీఆర్
  • ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు
  • ప్రీతి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది
  • సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా న్యాయ పోరాటం చేస్తాం
  • మహిళలపై అత్యాచారాలకు నిరసనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటలపాటు దీక్ష
  • కేసీఆర్ ఇంకెన్నాళ్లీ అరాచకాలు… మీ సర్కార్ కు పోయే రోజులు దగ్గర పడ్డాయి
  • కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బండి సంజయ్
  • జనగాం జిల్లా గిర్ని తండాలో ప్రీతి కుటుంబ సభ్యులకు పరామర్శ

హైదరాబాద్ : ‘‘కేసీఆర్… మీరు తప్పు చేయకపోతే మెడికో విద్యార్ధి ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఈ విషయంలో మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? ప్రీతి తరపున పోరాడే విద్యార్థులను ఎందుకు బెదిరిస్తున్నారు?’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

ఎంజీఎం ఆసుపత్రిలోనే ప్రతి చనిపోయిందని… నిందితుడు సైకోను కాపాడేందుకు డెడ్ బాడీని ఎత్తుకుపోయి నిమ్స్ లో చికిత్స చేస్తున్నట్లుగా డ్రామా చేశారని మండిపడ్డారు. డెడ్ బాడీ థంబ్ ద్వారా ప్రీతి మొబైల్ లాక్ ను ఓపెన్ చేసి ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. పోలీసులారా… మీ కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగితే.. ఇదే విధంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు.

ఈరోజు జనగాం జిల్లాలోని గిర్ని తండాలో ప్రీతి కుటుంబాన్ని బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. బండి సంజయ్ తోపాటు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్; పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ తదితరులు ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రీతి మరణానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

• గత 7 రోజుల క్రితం ఎంజీఎంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చూపారు. సైఫ్ అనే వ్యక్తి ర్యాగింగ్ చేసినట్లుగా చెప్పడం, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా స్పందించకుండా కాలేజీ హెచ్ఓడీ ప్రీతినే బెదిరించడం వంటివనీన చూశాం.

• ప్రీతి ఆత్మహత్య చేసుకునే పరికితనం ఉన్న అమ్మాయి కాదు. నిర్మొహమాటంగా చెప్పే అలవాటుందని ఆమె ఫ్రెండ్స్ చెప్పారు. కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. ఆధారాలన్నీ చెరిపేశారు. లాక్ ఉన్నమొబైల్ ను ఎట్లా ఓపెన్ చేస్తారు?

• నిందితుడికి అనుకూలంగా వ్యవహరించారు. నిందితుడి వల్ల మత కల్లోలాలు వస్తాయనే భయపడ్డట్లున్నరు. ప్రీతిది హత్యే… ఆత్మహత్య కాదని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మేం డిమాండ్ చేశారు.

• ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ జరిపితే ప్రీతి చనిపోయేది కాదు. నిందితుడి సైఫ్ పక్షాన బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండటం సిగ్గు చేటు. సీఎంకు సిగ్గు లేదు.

• విద్యార్థులు, రాజకీయ నేతలు స్పందిస్తారని భయపడి… చనిపోయిన డెడ్ బాడీని నిమ్స్ కు తీసుకెళ్లి దొంగ ట్రీట్ మెంట్ చేశారు. డెడ్ బాడీని ఎత్తుకుపోయే చిల్లర సంస్క్రుతికి కేసీఆర్ ప్రభుత్వం తెరదీసింది.

• కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లే చేయాలట. వాళ్లకు కనీసం సెంటిమెంట్ లేదు. తొందరగా డెడ్ బాడీని ఖననం చేసి చేతులు దులుపుకోవాలని చూశారు.

• కేసీఆర్ కొడుకుకు కండ కావరం ఎక్కింది. బలుపెక్కి మాట్లాడుతున్నడు. ప్రీతి ఘటనపై ఎందుకు స్పందించలేదు? ప్రతి దానికి ట్వీట్ చేస్తావ్ కదా… హోంమంత్రి అసలున్నాడా? పాతబస్తీకే పరిమితమైండు.

• చనిపోయిన డెడ్ బాడీని తీసుకొచ్చి థంబ్ పెట్టి మొబైల్ లాక్ ఓపెన్ చేశారంటే వీళ్లు ఎంతటి దుర్మార్గులో అర్ధమవుతోంది. ప్రీతి ఎలా చనిపోయిందో ఇప్పటికీ పూర్తిగా పోలీసులు వాస్తవాలు వెల్లడించలేదు.

• పోలీసులూ… మీకు కుటుంబాలున్నాయి? మీ వాళ్లకు ఇట్లా జరిగితే ఇలానే వ్యవహరిస్తారా? పేదోళ్ల బతుకులకు న్యాయం ఉండదా?

• ప్రీతి ఘటనకు నిరసనగా వాస్తవాలు తెలియజేయాలని బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తే లాఠీ చార్జ్ చేశారు.

• మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు నిరసనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష చేస్తున్నాం.

• కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా న్యాయ పోరాటం చేస్తాం. కేసీఆర్ కు ఎస్టీలంటనే చులకన. విద్యార్థులు, అమ్మాయిలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. పోడు భూముల సమస్య పరిష్కరించడు. గిరిజన రిజర్వేషన్లు అమలు చేయడం లేదు.

• కేసీఆర్… మీకు తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిపై కఠినంగా ఎందుకు శిక్షించడం లేదు? ప్రీతి తరపున పోరాడే విద్యార్థులను ఎందుకు బెదిరిస్తున్నవ్? బిడ్డా… మీకు రోజులు దగ్గర పడ్డయి. ఇంకెన్నాళ్లు ఈ అరాచకాలు చేస్తారో చూస్తాం..

KCR… if it’s not your fault then why is there no inquiry into the Preethi incident with a sitting judge?

Hyderabad : Demanding that Bharat Rashtra Samithi government led by chief minister K Chandrasekhar Rao order a judicial inquiry into the last week’s death of post-graduate medico Dr D Preethi of Kakatiya Medical College, Warangal, Bharatiya Janata Party Telangana unit would take up demonstrations all over the state on Monday in pursuance of the demand. This was announced by BJP state president Bandi Sanjay Kumar, while speaking to media after calling on the family members of Preethi at Girni Thanda in Jangaon district.

Sanjay said the demonstrations would take place from 12 noon to 4 pm all over the state, in protest against atrocities on women. “If the government is not at fault, why can’t it order a judicial probe by a sitting high court judge into Preethi’s death? What is its objection in taking stern action against the culprits? Why are the police threatening the students who are agitating for justice?” he asked. Stating that Dr Preethi was not a timid girl who would commit suicide, Sanjay said she had died in mysterious circumstances. “According to her friends, she was dare enough to call a spade a spade. But it was projected that she had committed suicide,” he said.

Alleging that the police had tampering with the evidences to save the accused, Dr Saif fearing that it might lead to communal violence, the BJP president said the police had forcibly opened the mobile phone of Dr Preethi using her thumb impressions. “Her family members were also apprehensive that she might not have committed suicide, but killed and demanded a thorough probe into it,” he reminded. Sanjay said had the authorities taken action immediately after receiving the complaint from Dr Preethi, she would not have died. It was shameful on the part of some BRS leaders to speak in support of Dr Saif, he said.

Expressing suspicion that Dr Preethi had died in MGM hospital itself, the BJP president said the police had shifted the body to the Nizam’s Institute of Medical Sciences only on the pretext of providing treatment to her. “It was a drama and they pretended giving treatment to her dead body,” he alleged. He also accused the police of threatening the family members of the deceased medico and forcing them to do last rites to the body. He questioned by KCR’s son K T Rama Rao, who tweets on every small issue, had remained silent on the medico’s death.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X