హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అయితే ఇప్పటి నుండే ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియ (RPI) తన అభ్యర్థిని ప్రకటించింది. మొదటిసారిగా RPIని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించారు.
తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియ (RPI) ఎం ఎల్ ఏ అభ్యర్థిని నిర్మల్ జిల్లా మరియు స్థానికురాలు సీనియర్ అడ్వేకెట్ కారం నివేదితని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియ తరుపున నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థిగా నియమించినట్లు పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ జిల్లా ఇంచార్జి గవ్వల శ్రీకాంత్ నిర్మల్ ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ… రాష్ట్రంలో నిర్మల్ లో ఓటర్ లు మరియు బహుజనులు ఇప్పటివరకు పరిపాలించిన రెడ్డీలు, రావులు వారి వారి అవసరాల కొరకు పని చేసారని ఇప్పుడు నిర్మల్ నియోజకవర్గానికి బహుజన బిడ్డ కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని అందుకే మన బహుజన బిడ్డ విద్యావేత్త కారం నివేదిత అన్ని రకాలుగా రాజకీయంగా పరంగా తెలిసిన వారు అంతేగాక సీనియర్ న్యాయవాది కాబట్టి అందుకే నివేదితని ప్రజలు ఆదరిస్తారని గవ్వల శ్రీకాంత్ అన్నారు.
అన్ని అర్హతలు ఉన్న మన బహుజన బిడ్డ సీనియర్ లాయర్ అయిన కారం నివేదిత ను నిర్మల్ నియోజకవర్గ ఎం. ఎల్. ఏ. అభ్యర్థిగా RPI తరుపున నిలబెట్టినట్లు గవ్వల శ్రీకాంత్ తెలిపినారు. గతం నుండి ఇప్పటి వరకు వారి వారి స్వార్థ రాజకీయాల కొరకు పార్టీలను మారుస్తూ అధికార దాహం కొరకు రాజకీయం చేస్తూ అధికారంలొ ఉంటున్నారు తప్ప నిర్మల్ లో వారు సాధించింది ఒరగ బెట్టింది ఏమి లేదని గవ్వల శ్రీకాంత్ అన్నారు. సంపద కొరకు ఉన్నది కాపడం కొరకు కుర్చీ కొరకు మనుషులు మారుతున్నారు తప్ప ప్రజల పరిస్థితులు మారలేదన్నారు.
ధరల మీద ధరలు దంచి కొట్టి ముక్కు పిండి వసులు చేస్తున్నారు. అన్ని వస్తువలు ధరలు పెంచుతున్నారు తప్ప ప్రజలకు రైతులకు మహిళలకు ఉద్యోగులకు విద్యార్థులకు యువకులకు నిరుద్యోగులకు ఒరగబెట్టింది చెప్పుకోవడనికి ఏమి లేదని గవ్వల శ్రీకాంత్ అన్నారు. అందుకే ధరలు మరియు జిల్లా నియోజకవర్గ ప్రజలు ఓటర్లు మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని అభివృద్ధి ఎలా ఉండలో చేసి చూపిస్తామని గవ్వల శ్రీకాంత్ అన్నారు.
అదేవిదంగా జూన్ 6న రాంలిలా మైదానం ఆదిలాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్మల్ జిల్లా తో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరు వేలాదిగా తరలి రావాలని గవ్వల శ్రీకాంత్ తెలిపినారు. మరియు పార్టీలో చేరాలి అనుకునే వారు ఎం ఎల్ ఏ గా పోటీ చేయాలనుకునే వారు వారి బయోడేటా పంపాలని ఎన్నికలు చాల దగ్గరలో ఉన్నాయి కాబట్టి సమయం లేదు, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలో చేరేవాళ్ళు త్వరగా చేరాలని అన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో నిర్మల్ నియోజకవర్గ ఎం ఎల్ ఏ అభ్యర్థి కారం నివేదిత రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మహ్మద్ రహీం, తీగల శేఖర్, యువనాయకుడు రాజ్ ప్రసెన్ జిత్ తదితరులు పాల్గొన్నారు.