జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక : సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యూహాల ఫలితం, మరి వీరు ఏమరంటే…

హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం, రాష్ట్రంలో ప్రజాభిమానాన్ని ప్రతిబింబిస్తోందని టీపీసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి మార్గదర్శకంలో సమన్వయం, వ్యూహాత్మక ప్రణాళికలు ఈ విజయానికి ప్రధాన కారణమని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికలోనే పార్టీకి గ్రాండ్ విక్టరీ అందించడం మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి గారు—మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ఆఫీస్ బేరర్స్‌తో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ,స్పష్టమైన దిశా నిర్దేశంతో గెలుపు దిశగా నడిపించారు.

ఎన్నికల ప్రక్రియ అంతటా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రేయింబవళ్ళూ శ్రమించి, ప్రతీ బూత్, ప్రతీ డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ చేపట్టి పోల్ మేనేజ్మెంట్‌ను కచ్చితమైన శైలి లో మలిచారు. ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారి సమన్వయం, సీఎం–టీపీసీసీ చీఫ్ కలిసి నిర్వహించిన తరచు జూమ్ సమావేశాలు, నేతలతో నిరంతర కమ్యూనికేషన్ ఈ విజయాన్ని మరింత బలపరిచాయి.

Also Read-

పార్టీ వ్యూహాలు, ఏరియా-వైజ్ పర్యవేక్షణ, గ్రౌండ్ లెవెల్‌లో కేడర్‌కు ఇచ్చిన దిశానిర్దేశం అన్ని కలిసి పనిచేయడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించగలిగింది. పోల్ మేనేజ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో టీపీసీసీ చీఫ్ పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. ఈ విజయం రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంచుతున్న విశ్వాసానికి నిదర్శనం కాగా, రాబోయే రోజుల్లో కూడా సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేయడానికి ఈ ఫలితం ప్రేరణగా మారనుంది.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఫలితం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రంపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో విజయవంతంగా పాలన సాగిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎంగా అన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చారు. మిగిలినవి భవిష్యత్తులో తీర్చాల్సి ఉంది.

అయితే సీఎంగా అధికారం చేపట్టిన సమయంలో ఆయన్ను పలు సవాళ్లు స్వాగతం పలికాయి. చాలా సమస్యలు ఎదురయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, వడ్డీలు, అభివృద్ధి, సంక్షేమంతో పాటు గత ప్రభుత్వ తప్పిదాలు వంటి అంశాలకు ఆయన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీటన్నింటిని అధిగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇంతలో రాష్ట్రంలో జరిగిన సంఘటన ఆయనకు ఎదురైంది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణించారు. ఆ స్థానంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి.. అధికారంలోకి వచ్చి కొద్ది రోజుల్లోనే మళ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ఎన్నికలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరగడంతో అది ఆయనకు తొలి విజయంగా అంతా చెప్పుకున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దివంగత గోపీనాధ్ అకాల మరణంలో అక్కడ కూడా ఎన్నికలు అనివార్యమైంది.

కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరపున గోపీనాథ్ సతీమణి పోటీ చేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా ఆయన పాలనకు ఇది రెండో మెట్టుగా మారింది. అయితే జూబ్లీహిల్స్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ పాలనపై వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశాయి. అయినా సరే రేవంత్ రెడ్డి మొక్కవోని దీమాతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను ప్రకటించి పోటీకి కావాల్సిన దిశానిర్దేశం చేశారు. స్వయంగా ఆయనే వచ్చి జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ మేరకు ప్రజలు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే ఈ విజయం సైతం రేవంత్ రెడ్డికి సీఎంగా రెండో విజయంగా మారింది. ఇప్పుడు అందరి చూపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనే ఉంది. ఈ ఎమ్మెల్యేల స్థానంలో కూడా ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డికి మరో టాస్క్ అవుతుంది. ముఖ్యంగా ఖైరతాబాద్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇదే జరిగితే రేవంత్ రెడ్డికి మూడో టాస్క్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడాలి మరీ తెలంగాణ భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో.

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా సక్సెస్ అయిండు. మమ్ముల్ని జూబ్లీహిల్స్ లో ఒక నాయకుడిగా నడిపించాడు. బూత్ సభ్యుల కు మనస్ఫూర్తిగా అభినదిస్తున్న. జూబ్లీహిల్స్ విజయంసభ్యులదే బూత్. యువకుడిగా ప్రజలు నవీన్ యాదవ్ ను గెలిపించారు. గొప్ప అవకాశాన్ని తీసుకొని జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. నీ మీద రౌడీ వేసిన ముద్రను ప్రజల్లో మంచి పేరుతో చెడిపేయాలి. నవీన్ యాదవ్ గెలుపుతే ghmc ఎన్నికల్లో ఈజీగా గెలవాలి. జూబ్లీహిల్స్ లో ఏవిధంగా గెలిచామో లోకల్ బాడీ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి. సర్పంచ్, zptc మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలి. అపొజిషన్ ఉండి ప్రజల సమస్యలకోసం మాట్లాడట్లేదు. కిరాయి సోషల్ మీడియా తో కేటిఆర్ మాట్లాడు తుండు.

జూబ్లీహిల్స్ లో కిషన్ రెడ్డి కి పడ్డ 60వేల ఓట్లు బీజేపీ కి ఎందుకు పడలేదు. బీహార్ లో SIR పెట్టి 69 లక్షల మైనారిటీ,అట్టడుగు వర్గాల ఓట్లను తొలగించారు. 69లక్షల ఓట్లు అన్ని కాంగ్రెస్ కూటమికి పడే ఓట్లు. టెర్రరిస్ట్ ఎటాక్ లు అన్ని ఎన్నికల ముందు రోజే జరుగుతున్నవి. టెర్రరిస్ట్ ఎటాక్ లను ఎందుకు ఆపలేక పోతున్నారు. రష్యా లో పుతిన్ మాదిరిగా మోడీ ప్రధానిగా ఉండాలని చూస్తుండు. తెలంగాణ లో కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ చేసినట్లుగా దేశం మొత్తం పోల్ మేనేజ్మెంట్ చేయాలి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ల్లో కాంగ్రెస్ విజయం పై మంత్రి సీతక్క పత్రిక ప్రకటన

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు అపూర్వ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టిన ఓట‌ర్ల‌కు శిర‌స్సు వంచి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాం. ఈ విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌తి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌కు ధ‌న్య‌వాదాలు. ఘన విజ‌యం సాధించిన కాంగ్రెస్ అభ్య‌ర్ది న‌వీన్ యాద‌వ్ కు అభినంద‌న‌లు.

ఇది చారిత్రాత్మ‌క విజ‌యం. చ‌రిత్ర గుర్తుపెట్టుకునే గెలుపు ఇది. బీఆర్ఎస్ త‌ప్పుడు ప్ర‌చారాన్ని, అనంత‌మైన అబ‌ద్దాల‌కు ప్ర‌జ‌లు చెప్పిన గుణ‌పాఠం ఇది. రెండేళ్ల ప్ర‌జా పాల‌న‌కు, రేవంత్ రెడ్డి గారి ప‌రిపాల‌న‌ను ల‌భించిన ఆమోదం. ప్ర‌జా ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జ‌లు క‌ట్టిన ప‌ట్టం ఈ విజ‌యం. కాంగ్రెస్ పాల‌న‌కు తిరుగు లేద‌ని నిరూపించారు.

చింత చ‌చ్చినా పులుపు చావ‌దు అన్న‌ట్లుగా టిఆర్ఎస్ ప‌దేళ్ల పాప‌లు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి రెండేళ్లు అయినా ప్ర‌జ‌లు టిఆర్ఎస్ మోసాల‌ను మ‌రిచిపోలేదు. అందుకే ప్ర‌జ‌లు వెంట‌ప‌డి ఓడించారు. దోపిడి సొమ్ముతో సోష‌ల్ మీడియాలో విచ్చ‌ల‌విడిగా త‌ప్పుడు ప్ర‌చారం చేశారు.

సోష‌ల్ మీడియాలో త‌ప్ప తెలంగాణ సోసైట్ లో BRS లేదని జూబ్లీహిల్స్ ఎన్నిక‌లతో తేలిపోయింది. మీ బుద‌ర రాజ‌కీయాల‌కు ప్ర‌జ‌లు స‌మాధి క‌ట్టారు. ఇప్ప‌టి కైనా బుద్ది తెచ్చుకుని హుందాగా రాజ‌కీయాలు చేయండి. రాజ‌కీయాలు అంటే రాద్దాంతం కాదు. రాజ‌కీయం అంటే సిద్దాంతం. గెలుపోట‌ములు స‌హ‌జం. ఆ విష‌యాన్ని గ్ర‌హించి రాష్ట్ర అభివృద్దికి స‌హ‌క‌రించండి. లేక‌పోతే..మీ పార్టీ క‌నుమ‌రుగు కావ‌డం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X