హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల పరంపర కొనసాగుతూనే వున్నది. మహారాష్ట్ర సౌత్ వెస్ట్ నాగపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన, ఆ ప్రాంత ప్రజల్లో రాజకీయ పట్టువున్న శివసేన పార్టీ (షిండే గ్రూపు) సీనియర్ నేత ప్రవీణ్ షిండే, శుక్రవారం నాడు బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
వారితో పాటు బిఆర్ ఎస్ లో చేరిన పలువురు మహారాష్ట్ర నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సిఎం ఆహ్వానించారు. కాగా నాగ్ పూర్ సౌత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రస్థుతం బిజెపి నేత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దాంతో ప్రవీణ్ షిండే చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది.
వీరితో పాటు బిఆర్ఎస్ పార్టీలో… ధవలయన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విక్రమ్ పిస్కే, పద్మశాలి యువ సేన వ్యవస్థాపకుడు గౌతమ్ సంగ, వ్యాపారవేత్త రఘురాములు కందికట్ల, సామ్రాట్ మౌర్య సేన అధ్యక్షుడు మహారాష్ట్ర అర్జున్ సల్గర్, బీజేపీ ఓబీసీ సెల్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైభవ్ షెట్, వదార్ సమాజ్ మహారాష్ట్ర కార్యదర్శి రాజు లింబోల్, శివానంద్ దారేకర్,
మోచి సమాజ్ కార్యదర్శి మార్కండే షెర్ల, రాజు అసడే, రవి మేత్రే, సిధ్రామ్ మ్హెత్రే, శ్రీకాంత్ రౌత్, మనోజ్ డిగే, కిసాన్ నై, బాల్కృష్ణ నై, మహేష్ డోలారే, రూపేష్ ఠాక్రే, మనీష్ గావండే, గిరిరాజ్ మర్దా, అభిజిత్ పవార్, ఆశిష్ షిండే, అంబాదాస్ తాడ్గొప్పుల్, ఆకాశ్ భవర్ తదితరులు చేరారు. కాగా మహారాష్ట్ర సాంప్రదాయ పద్దతిలో సిఎం కేసీఆర్ ను వారు గొంగడి తో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి, దండే విఠల్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మర్రి జనార్థన్ రెడ్డి, మహారాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నేత శంకరన్న డోంగ్రే తదితరులు పాల్గొన్నారు.