హైద్రాబాద్: జె.ఎన్.టీ.యు.హెచ్. సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు సీ-డాక్ హైద్రాబాద్ సంస్థలు సమ్యుక్తంగా మే 22 నుండి జూన్ 1 వ తేదీ వరకు పది రోజులపాటు ఆన్ లైన్ లో నిర్వహించుచున్న “సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్స్” అనే వర్క్ షాప్ జే.ఎన్.టీ.యూ.హెచ్ లో ఘనంగా ప్రారంభమైంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో వర్థమాన సమస్యలు, ఎదుర్కోవలసిన సవాళ్ళ గురించి బీ.టెక్ మరియు ఎం.టెక్ విద్యార్థులకు ఈరంగం లో నిష్ణాతులైన అకాడమిక్ మరియు ఇండస్ట్రీ నిపుణులు ఈ వర్క్ షాప్ లో విద్యార్థులకు అవగాహన కలిగించనున్నారు.
జె.ఎన్.టీ.యు.హెచ్. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నర్సిమ్హా రెడ్డి గారు, వర్ధమాన సాంకేతిక అంశాల పై విద్యార్థులకు అవగాహన కోసం మరియు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రెక్టార్. ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ గారు, సైబర్ నేరాలు జరగకుండా చూసే నిపుణులు మరియు నేరం జరిగిన తదనంతరం నేర నిరూపణకు ఫోరెన్సిక్ నిపుణుల కొరత చాలా ఉందని అందుకే విద్యార్థులు ఈ వర్క్ షాప్ ను ఉపయోగించుకోవాలని అన్నారు.
మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుసేన్ గారు మాట్లాడుతూ… సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ అనే అంశం రాబోయే కాలంలో అవకాశాల గని అనీ, అందరూ ఈ సాంకేతికత పై అవగాహన పెంచుకోవాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో సీ.డాక్. హైద్రాబాద్ డైరెక్టర్ పీ. ఆర్. లక్ష్మి ఈశ్వరి గారు, మరియు సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్. శ్రీదేవి గారు పాల్గొన్నారు.
సైబర్ సెక్యూరిటీ మరియు ఫోరెన్సిక్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ గురించి ఇంజనీరింగ్ విద్యార్థులు అవగాహన పెంచుకోవాలనీ, వేసవి సెలవులలు కావడం వల్ల ఈ వర్క్ షాప్ ను ఆన్ లైన్ మోడ్ లో నిర్వహించి అందరికీ అందుబాటులో ఉంచామని, ఈ అవకాశాన్ని బీ.టెక్. మరియు ఎం.టెక్. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఈ వర్క్ షాప్ లో జె.ఎన్.టీ.యూ అనుబంధ మరియు ఇతర కళాశాలల నుండి 226 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
ఈ వర్క్ షాప్ లో టాప్ 50 మంది విద్యార్థులకు ఇండస్ట్రీ నిష్ణాతులచే నాల్గు నెలల పాటు ఫ్రీ ఇంటర్న్ షిప్ అవకాశాన్ని కల్పించనున్నట్టు ఈ వర్క్ షాప్ కన్వీనర్, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శ్రీ దేవి గారు తెలిపారు.
JNAFAU FINE ARTS AND DESIGN ENTRANCE EXAMINATION – 2023
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ వర్సి టీలో పలు కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగు తున్నది. 2023-24 విద్యా సంవత్సరంలో ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎ డీఈఈ) షెడ్యూలు వర్సిటీ అధికారులు ఇటీవల విడుదల చేశారు.