హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలింది. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ అధికార కాంగ్రెస్ పార్టీకి గూటికీ చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్‌కు కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్‌ను కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ స్టార్ట్ చేసినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నట్లు టాక్. రెండు రోజుల గ్యాప్‌లోనే ఇద్దరు ఎమ్మెల్యేలను చేజార్చుకున్న బీఆర్ఎస్‌కు నెక్ట్స్ ఎవరు వెళ్తారోనని టెన్షన్ పట్టుకుంది. (ఏజెన్సీలు)
हैदराबाद: बीआरएस पार्टी को एक और बड़ा झटका लगा है। हाल ही में उस पार्टी के वरिष्ठ नेता पोचाराम श्रीनिवास रेड्डी ने बीआरएस पार्टी से इस्तीफा दे दिया था।अब एक और विधायक ने बीआरएस को झटका दिया। हाल ही में जगित्याला विधायक डॉ. संजय ने बीआरएस पार्टी से इस्तीफा दे दिया है। संजय सीएम रेवंत रेड्डी की मौजूदगी में सत्तारूढ़ कांग्रेस पार्टी में शामिल हुए। सीएम रेवंत रेड्डी ने जुबली हिल्स स्थित अपने आवास पर विधायक संजय को पार्टी में आमंत्रित किया।
ఇది కూడ చదవండి-