IPL-2025: हाई वोल्टेज और हाई स्कोरिंग मैच में आसीबी को ऐसे मिली बड़ी जीत, जानें इस खेल में किसने क्या-क्या किया

हैदराबाद : आईपीएल-2025 में बीते मंगलवार को रात को लखनऊ सुपर जायंट्स और रॉयल चैलेंजर्स बेंगलुरु के बीच खेला गया। यह मैच एक हाई वोल्टेज और हाई स्कोरिंग मैच रहा है। इसको आरसीबी ने अपने नाम कर टॉप 2 में अपनी जगह बना ली। बेंगलुरु ने लखनऊ को 6 विकेट से हरा दिया। इसी के साथ ही आरसीबी क्वालिफायर 1 के लिए क्वालीफाई हो गई। अब 29 मई को उसका सामना पंजाब किंग्स से मुल्लांपुर में होगा।

आरसीबी को पहले क्वालिफायर में अपनी जगह बनाने के लिए यह मैच जीतना बहुत जरूरी हो गया था। वैसे तो आरसीबी के इस जीत के हीरो कार्यवाहक कप्तान जितेश शर्मा रहे। उन्होंने गजब की पारी खेली। यदि ऐसी पारी नहीं खेलते तो वह हीरो बनते-बनते विलेन बन जाते।

दरअसल, हुआ यह कि आरसीबी की पारी का 17वां ओवर लेग स्पिनर दिग्वेश राठी लेकर आए थे। राठी के ओवर की पहली गेंद पर रिवर्स स्वीप मारते हुए जितेश शर्मा आउट हो गए थे। उनका कैच आयुष बडोनी ने पकड़ लिया था। वो मैच का बहुत ही अहम पल था। लेकिन, वह नो बॉल थी। वे एक बैक फुट नो बॉल थी। इसके बाद जितेश शर्मा और आरसीबी को फ्री हिट भी मिली। इस गेंद पर उन्होंने छक्का लगाकर अपना अर्धशतक पूरा किया।

गौरतलब है कि आरसीबी ने टॉस जीतकर पहले गेंदबाजी करने का फैसला किया था। ऐसे में लखनऊ सुपर जायंट्स ने ऋषभ पंत के शतक (118* रन) के चलते 20 ओवर में 3 विकेट पर 227 रन बना दिए थे। इसके जवाब में आरसीबी ने 18.4 ओवर में ही 4 विकेट पर 230 रन बनाये और मैच जीत लिया। जितेश शर्मा ने नाबाद 85 रन बनाये। यह रन जीत का कारण बने।

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం

హైదరాబాద్ : ఐపీఎల్ 2025 టోర్నమెంటులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. లక్నో జట్టుపై మంగళవారం రోజున 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో సమిష్టిగా రాణించి బెంగుళూరు టాప్ 2 లోకి దూసుకు వెళ్ళింది.

మంగళవారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో మధ్య ఫైట్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణిత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు అవలీలగా ఛేదించింది. కేవలం 18.4 ఓవర్స్ లోనే.. నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 54 పరుగులు చేయగా.. జితేష్ శర్మ దుమ్ము లేపాడు. తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న జితేష్ శర్మ ఈ మ్యాచ్ లో 33 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు.

ఇందులో ఆరు సిక్సర్లు అలాగే 8 బౌండరీలు ఉన్నాయి. జితేష్ శర్మతో పాటు అగర్వాల్ 41 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి వెళ్ళింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో క్వాలిఫైయర్ 1 లో పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ మ్యాచ్ మే 29వ తేదీన చండీఘర్ వేదికగా జరగనుంది.

ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా కోహ్లీ హిస్టరీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న కోహ్లీ.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లక్నో వేదికగా మంగళవారం (మే 27) లక్నో సూపర్ జయింట్స్ పై హాఫ్ సెంచరీ చేసి దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును కోహ్లీ నెలకొల్పాడు.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లీ 9000 పరుగులు చేశాడు.

ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడి 8594 పరుగులు చేసిన కోహ్లీ.. ఛాంపియన్స్ లీగ్ లో ఆర్సీబీ జట్టు తరపున ఆడి 400 పైగా పరుగులు సాధించాడు. దీంతో ఒకే జట్టుకు ఆడుతూ 9000 పరుగుల క్లబ్ లో చేరిన తొలి ప్లేయర్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ తర్వాత ఈ లిస్ట్ లో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ ముంబై ఇండియన్స్ తరపున 6060 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ప్రస్తుతం 53 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు.అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి  235 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఒకే జట్టు తరపున అత్యధిక పరుగుల చేసింది వీరే

9004* – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ, 6060 – ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ, 5934 – హాంప్‌షైర్ తరపున జేమ్స్ విన్స్, 5528 – చెన్నై సూపర్ కింగ్స్ తరపున సురేష్ రైనా మరియు 5314 – చెన్నై సూపర్ కింగ్స్ తరపున MS ధోని ((ఏజెన్సీలు) )
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X