आईपीएल-2024: हैदराबाद-बेंगलुरु मैच, मेट्रो ट्रेन का समय विस्तार
हैदराबाद : आईपीएल के 17वें सीजन के तहत गुरुवार को शाम 7.30 बजे उप्पल मैदान पर हैदराबाद और बेंगलुरु की टीमों के बीच मैच होगा। इसी पृष्ठभूमि में उप्पल रूट पर मेट्रो ट्रेनों का समय बढ़ाया गया है।
आखिरी ट्रेनें रात 12.15 बजे रवाना होंगी. वे 1.10 बजे अपने गंतव्य पर पहुंचेंगे। इस समय केवल उप्पल स्टेडियम-एनजीआरआई स्टेशनों पर ही प्रवेश की अनुमति होगी। उप्पल मार्ग पर अन्य स्टेशनों पर केवल निकास की अनुमति होगी।
హైదరాబాద్: ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ – బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు.
అర్ధరాత్రి 12.15 గంటలకు చివరిగా రైళ్లు బయలుదేరనున్నాయి. 1.10 గంటలకు ఇవి గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. ఈ సమయంలో ఉప్పల్ స్టేడియం-ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతించనున్నారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో నిష్క్రమణలకు మాత్రమే వీలు కల్పిస్తారు.
హైదరాబాద్ – బెంగళూరు జట్ల మధ్య 41 మ్యాచ్
ఐపీఎల్ 2024 లో భాగంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య 41 మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు లైవ్ ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్ కు ముందు సన్‌రైజర్స్ ఆర్సీబీతో చిన్నస్వామి స్టేడియంలో తలపడి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక (287)పరుగులు చేసింది.

కాగా ఈ మ్యాచులో ఆర్సీబీ కూడా 264 పరుగులు చేసి చివరి వరకు పోరాటం సాగించింది. ఇదిలా ఉంటే వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ జట్టు బౌలింగ్ వీక్ గా ఉన్న ఆర్సీబీ జట్టుపై 300 స్కోర్ చేసేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. సొంత గ్రౌండ్‌లో సన్ రైజర్స్ కు తిరుగు లేదు.
అయితే గత మ్యాచులో చిత్తుగా ఓడిన ఆర్సీబీ జట్టు ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేసులో కొనసాగాలని చూస్తుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ విజయాలకు బ్రేక్ వేసి జోరును తగ్గించి విజయంతో తాము రేస్ లో నిలవాలని ఆర్సీబీ భావిస్తోంది. మరీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే రాత్రి మ్యాచ్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే మరి. (ఏజెన్సీలు)
