చంద్రబాబుకి కండీషన్స్ బెయిల్, జనంలో తిరగకూడదు… మరియు…

हैदराबाद: तेलुगु देशम पार्टी के राष्ट्रीय अध्यक्ष नारा चंद्रबाबू नायडू को अंतरिम जमानत देने वाले आंध्र प्रदेश उच्च न्यायालय ने स्पष्ट किया है कि खराब स्वास्थ्य के कारण यह जमानत दी जा रही है। लंबी बहस के बाद, उच्च न्यायालय ने घोषणा की कि वह यह जमानत दे रहे है क्योंकि बीमारी के कारण आंख के ऑपरेशन की आवश्यकता है। और इस जमानत पर शर्तें लगाई है। हाई कोर्ट में लंबी बहस के बाद 31 अक्टूबर को यह फैसला सुनाया।

హైదరాబాద్: టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనారోగ్య కారణాలతో ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత అనారోగ్యం దృష్ట్యా కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉండటంతో ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించిన హైకోర్టు అందుకు కండీషన్స్ పెట్టింది. అక్టోబర్ 31వ తేదీన హైకోర్టులో సుదీర్ఘవాదనల తర్వాత ఈ తీర్పు వెల్లడించింది హైకోర్టు.

చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా జనంలో తిరగటానికి వీల్లేదని రాజకీయ సభలు, సమావేశాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేసింది కోర్టు. కేవలం ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరాదని అలా చేసినట్లయితే వెంటనే బెయిల్ రద్దు అవుతుందని ఆదేశాలు ఇచ్చింది. మీడియా, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కూడా ఆదేశించింది హైకోర్టు. మీడియాతో మాట్లాడకూడదని.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కోర్టు.

సాక్షులను బెదిరించటం కేసును ప్రభావితం చేసే విధంగా వ్యవహరించటం వంటివి చేస్తే వెంటనే బెయిల్ రద్దు అవుతుందని కూడా కండీషన్ పెట్టింది కోర్టు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా పొలిటికల్ యాక్టివిటీస్ అనేవి చేయరాదు. కేవలం ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవటం, కంటికి ఆపరేషన్ చేయించుకోవటం మాత్రమే చేయాలి. నవంబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కోర్టులో హాజరుకావాలని మధ్యంతర బెయిల్ లో స్పష్టం చేసింది.

టీడీపీ శ్రేణుల్లో సంబరాలు, మిఠాయిలు పంచుకుంటూ… బాణాసంచా పేలుస్తూ…

మరోవైపు చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా పేలుస్తూ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట, రాజమహేంద్రవరం, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద అలాగే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ‘బాబు ఈజ్ బ్యాక్’, ‘నిజం గెలిచింది’ వంటి హ్యాష్‌టాగ్‌లను జత చేస్తున్నారు.

కళ్లు కనిపించడంలేదు కాబట్టే బెయిల్ వచ్చింది: మంత్రి అంబటి

చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేయడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. టీడీపీ, జనసేన పార్టీలపై మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడుతన్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పైనా తీవ్రంగా స్పందించారు. ‘నిజం గెలిచింది కాబట్టి చంద్రబాబుకు బెయిల్ రాలేదని, చంద్రబాబుకు కళ్లు కనిపించడంలేదు కాబట్టి బెయిల్ వచ్చిందంటూ ట్వీట్ చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X