హైదరాబాద్ : ఆదివారం హైదరాబాదులో జరిగిన…ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) పదవ ప్లీనరీ మరియు టియుడబ్ల్యూజే రెండవ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ…
“జర్నలిస్టులు వెలుగు దివ్వెలు. త్యాగశీలురు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల త్యాగం గొప్పది. యుద్ధంలో అందరూ పారిపోతే యుద్ధం వైపు ఉరికే వాడే జర్నలిస్టు. వీరు నిస్వార్థ జీవులు. వీరికి ప్రజలకు సమాచారం అందించాలనే తపన ఉంటుందన్నారు. ఉద్యమం లో జర్నలిస్టుల త్యాగాన్ని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో వారి ఆకాంక్షలకు అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నారనీ, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని సీఎం కేసీఆర్ గారు తరచూ చెప్తుంటారన్నారు.”
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అందరికీ అనేక పథకాలను వర్తింపజేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులను కేటాయించి 42 కోట్లు విడుదల చేసిన ఒకే ఒక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వమని తెలియజేశారు. 20,000 మందికి అక్రిడేషన్ కార్డులు ఇచ్చి హెల్త్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. జర్నలిస్టులు మరణిస్తే వారికి పెన్షన్ ఇస్తూ ఆదుకుంటున్నది. వారి పిల్లలను చదివిస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వమే.
Related News:
హైదరాబాద్ గంగ జమున తహజీబ్ కు నిదర్శనం. చార్మినార్ సెక్యులర్ స్పిరిట్కు నిదర్శనం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. 17 రాష్ట్రాల నుంచి వచ్చిన ఐజెయు జర్నలిస్ట్ సంఘాల నాయకులకు హైదరాబాద్ సాదరంగా స్వాగతం పలుకుతుంది. మీరు హైదరాబాద్ ప్రత్యేకమైన ఆతిథ్యాన్ని స్వీకరించడం మాకు ఎంతో సంతోషం.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కూడా మీరు పరిశీలించాలి. తెలంగాణ వ్యాప్తంగా మీరు తిరిగి జరుగుతున్న అభివృద్ధిని రాయండి. ఇప్పటికే మీకు మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలిసే ఉంటుంది. తెలంగాణ ఈ దేశంలో నెంబర్ వన్ స్టేట్ అనే సంగతి మీకు తెలిసిందే. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక అభివృద్ది. రైతు బంధు, 24 గంటలు ఉచిత విద్యుత్తు. సాగు నీరు, తాగు నీరు, సమస్త రంగాలను అభివృద్ది చేసి, దేశానికి ఆదర్శంగా నిలబెట్టినది సీఎం కేసీఆర్ మాత్రమే.
ఇవాళ దేశం మతవిద్వేషాల దిశగా పయనిస్తున్నది. సెక్యులర్ భావనలను జర్నలిస్టులుగా మీరు ముందుకు తీసుకుపోవాలి. ఈ దిశగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు జర్నలిస్టులు అండగా నిలవాలి. దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తున్న, రైతుల కోసం ఆలోచిస్తున్న, సీఎం కేసీఆర్ కు జర్నలిస్టులు అండగా నిలవాలనీ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకత్వాన్ని కోరుతున్న. మీతో కలిసి ఇవాళ మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు.