బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల ఘటనల వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగిన సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అదేవిధంగా దేశ విభజనకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ శక్తులు, కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీల కుట్రలను ఎండగట్టారు.

బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు జరుగుతున్నాయని… అయితే ఆ ఘటనలపై రాహుల్ గాంధీ కనీసం నోరు మెదపకపోవడం, ఖండించకపోవడం దారుణమన్నారు. భారతదేశాన్ని కులాల పేరుతో, మతం పేరుతో విడగొట్టాలని కొన్ని విదేశీ శక్తులతో పాటు, స్వదేశంలోని కాంగ్రెస్ వంటి కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. మమత బెనర్జీ ప్రభుత్వం ఓట్ల కోసం రోహింగ్యాలకు ఆధార్ కార్డులు, ఆశ్రయంతో పాటు సకల సదుపాయాలు కల్పిస్తూ దేశ సంపదను పంచిపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు, అరబ్బు దేశాలు భారత దేశాన్ని బలహీన పర్చాలని చూస్తున్నాయని… విచ్ఛిన్నకర శక్తుల సవాళ్లను ప్రతి భారతీయుడు కులాలు, మతాలకు అతీతంగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని డాక్టర్ కె. లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ గారు మాట్లాడిన ముఖ్యాంశాలు:

యావత్ భారత ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అనేక మంది స్వాతంత్ర్య సమరమోధులకు, త్యాగధనులకు ఘన నివాళులు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల మాదిరిగా సమపాళ్లలో పాలన అందిస్తున్నది. అనేక సంక్షేమ కార్యక్రమాలతో దేశాన్ని ఆత్మనిర్భర భారత్ గా తీర్చిదిద్దేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది.

Also Read-

మోదీ పాలనలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటపడేయంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. డిజిటల్ యుగంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తోంది. రైల్వేస్, ఎయిర్వేస్, రోడ్ వేస్ వంటి అనేక మౌలిక సదుపాయాల్లో ముందంజలో ఉంది. చదువుకునే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపొందిస్తోంది.

భారతదేశం యూనికార్న్ హబ్ గా మారుతోంది. లక్ష పై చిలుకు స్టార్టప్స్, వందల యూనికార్న్స్ తో ప్రపంచానికే సవాల్ విసిరేలా మారింది. నరేంద్ర మోదీ పాలనలో భారత్ ప్ర‌పంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదిగింది. రానున్న రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ రూపుదిద్దుకోవడం ఖాయం. సహాయ నిరాకరణోద్యమం, సత్యాగ్రహ ఉద్యమాలతో పూజ్య బాపూజీ, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, వీర్ సావర్కర్ వంటి వారు దేశ స్వాతంత్ర్యం కోసం అనేకమంది పోరాడారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంతో నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. వారి త్యాగాన్ని విస్మరించలేం.

భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో మరచిపోలేని రోజు. భారతదేశం ముక్కలు కాకూడదని తుది వరకు తపన పడ్డారు మహాత్మా గాంధీ. ఒకానొక దశలో తన దేహాన్ని రెండు ముక్కలు చేసి అపుడు దేశాన్ని విడగొట్టండని తెల్ల దొరలకు సవాల్ చేసారు బాపూజీ. భారత్ ఎప్పటికీ ప్రశాంతంగా ఉందరాదని, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలంటూ జిన్నా ముస్లిం లీగ్ ని స్థాపించి దేశ విభజనకు కారణమయ్యాడు. కాని, నేడు మరోసారి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో విదేశీ శక్తులు, స్వదేశంలో కాంగ్రెస్ వంటి కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి.

స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను కనుమరుగు చేసేలా ప్రయత్నిస్తున్నారు. నెహ్రూ నుంచి మొదలు నేటి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే దేశ మహనీయుల త్యాగాలను కనుమరుగు చేసే కుట్రలు చేసే కుట్రలు చేస్తోంది. బాంగ్లాదేశ్‌ పరిణామాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అయితే, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్ గాంధీ కనీసం నోరుమెదపకపోవడం దారుణం. కాంగ్రెస్ తో పాటు కొన్ని అంతర్జాతీయ శక్తులు దక్షిణ భారత దేశం, ఉత్తర భారతదేశం అంటూ విభజన కుట్రలు చేస్తున్నాయి. విచ్ఛిన్నకర శక్తుల సవాళ్లను ప్రతి భారతీయుడు కులాలు, మతాలకు అతీతంగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి.

బిజెపి కిసాన్ మోర్చా

78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రంగారెడ్డి రూరల్ జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామంలో అటల్ బిహారీ వాజ్ పాయ్ వ్యవసాయ క్షేత్రంలో రైతులు విశ్రాంత ఆర్మీ జవాన్లతో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదనంతరం బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విశ్రాంత ఆర్మీ జవాన్లకు రైతులకు ఏర్పాటుచేసిన సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి నాయకులతో కలసి విశ్రాంత ఆర్మీ జవాన్లను రైతులను శాలువాలు పూలమాలలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి అందెల శ్రీరాములు యాదవ్ బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పాపయ్య గౌడ్ బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్కా రవీందర్ రెడ్డి బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ సన్మాన గ్రహీతలు అయిన విశ్రాంత జవాన్లు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X