हैदराबाद : हैदराबाद मेट्रो रेल टिकट के दामों में बढ़ोत्तरी की गई है। बढ़ाये गये दाम 17 मई से लागू होने वाले हैं। हैदराबाद मेट्रो रेल ने घोषणा की है कि कम से कम 10 रुपये टिकट किराया को बढ़ाकर 12 रुपये किया गया है।

Alo Read-
यह 12 रुपये पहले दो स्टाफों के लिए होगा। इसके बाद 2 से 4 स्टाफों के लिए 18 रुपये, 4 से 6 के लिए 30 रुपये, 6 से 9 के लिए 40, 9 से 12 के लिए 50, 12 से 15 तक 55 रुपये, 15 से 18 तक 60 रुपये, 18 से 21 तक 66 रुपये और 21 से 24 स्टाफ तक 70 रुपये किया गया है। इसके बाद आने वाले स्टाफों के लिए 75 रुपये किराया रखा गया है।
హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనిష్ఠ ధర రూ.10 నుండి రూ.12కు పెంచింది. అంతేకాకుండా గరిష్ఠ ధర రూ.60 నుండి రూ.75కు పెంచింది.
నాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు, 6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు, 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు, 12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు, 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు, 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు, 24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది.
పెంచిన ఛార్జీలు ఎల్లుండి నుండి అమలులోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. ఇటీవల చార్జీలు పెంచుతామని ప్రకటించగా చెప్పినట్టుగా తాజాగా పెంచిన ధరలను ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రతిరోజూ వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే చాలా మంది బైకులు మరియు బస్సుల్లో ప్రయాణించకుండా మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు.
దీంతో మెట్రోలో రద్దీ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మెట్రో సమాయాన్ని కూడా పెంచుతూ ఎల్అండ్‌టీ నిర్ణయం తీసుకుంది. అయితే మొదటి నుండి మెట్రో నష్టాల్లో ఉందని చెబుతున్న సంస్థ చార్జీలను పెంచి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. (ఏజెన్సీలు)
