हैदराबाद: तेलंगाना में सत्तारूढ़ भारत राष्ट्र समिति (BRS) की राजस्व में भारी इजाफा हुआ है। एक साल में ही बीआरएस की आय में जबरदस्त बढ़ोत्तरी हुई है। बीआरएस तेलंगाना में सत्ता में आये लगभग साढ़े आठ साल हो चुके है। पिछली बार की तुलना में यानी 2021-2022 के बीच बीआरएस की आय में जबरदस्त इजाफा हुआ है। 2022 की ऑडिट रिपोर्ट के मुताबिक इलेक्टोरल बॉन्ड, ट्रस्ट और डोनेशन से भारी आमदनी हुई है।
बीआरएस पार्टी ने 2022 की ऑडिट रिपोर्ट केंद्रीय चुनाव आयोग को सौंप दी है। इसमें शामिल विवरण के अनुसार, 31 मार्च 2021 तक बीआरएस की कुल आय 37.65 करोड़ रुपए थी। मार्च 2022 तक यह आय 218.11 करोड़ रुपए हो गया है। 2021 में इलेक्टोरल बॉन्ड और ट्रस्ट के जरिए बीआरएस को एक रुपए की भी आय नहीं है। लेकिन उसने अपनी ऑडिट रिपोर्ट में कहा है कि इस साल मार्च तक इलेक्टोरल ब्रांड्स के जरिए 153 करोड़ रुपये और ट्रस्टों के माध्यम से 40 करोड़ रुपये की आय प्राप्त हुई है।

बीआरएस पार्टी की नवीनतम संपत्ति की कुल शुद्ध आय, प्रारंभिक शेष राशि और सामान्य निधि कुल 480 करोड़ रुपये हैं।
साथ ही 31 मार्च 2021 तक डाकघरों में जमा राशि 253 करोड़ रुपये थी और 31 मार्च, 2022 तक यह बढ़कर 451 करोड़ रुपये हो गई है। 31 मार्च 2021 तक फीस और सब्सक्रिप्शन से 17 करोड़ रुपये प्राप्त हुए और 31 मार्च 2022 को इनसे होने वाली आय 8,04,74,020 रुपये है। व्यक्तिगत सदस्यता से आय मार्च 2021 तक 1,00,02,379 रुपये थी। पिछले साल मार्च तक यह 90,00,000 रुपये थी। मार्च 2021 तक सामान्य अभिदान के माध्यम से 3 करोड़ रुपये और इस वर्ष मार्च तक 3.75 करोड़ रुपये प्राप्त हुए हैं। पिछले साल मार्च तक अन्य आय से 16.21 करोड़ रुपये और इस साल मार्च तक 16.12 करोड़ रुपये मिले है।
अब तक क्षेत्रीय पार्टी तक ही सिमित रही टीआरएस को मुख्यमंत्री केसीआर ने राष्ट्रीय पार्टी बीआरएस में बदल दिया हैं। देश की राजनीति में बदलाव लाने की दिशा में काम करने और कांग्रेस और बीजेपी के अलावा अन्य दलों के साथ मिलकर संघर्ष करने की बात कह रहे हैं। इसी क्रम में कई बार कई राज्यों का दौरा कर चुके। सीएम केसीआर ने बीजेपी और कांग्रेस से बिना किसी संबंध के तीसरे मोर्चे पर भी मंथन किया। कई दलों ने केसीआर से मिलने में रुचि दिखाई। लेकिन अन्य दलों की ओर से कोई प्रतिक्रिया नहीं आई।

ఇదిగో BRS ఆస్తుల విలువ, ఒక్క ఏడాదిలోనే ఊహించనంత పెరిగిన ఆదాయం
హైదరాబాద్ : తెలంగాణలో అధికార భారత్ రాష్ట్ర సమితి (BRS) భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోంది. ఒక్క ఏడాదిలోనే బీఆర్ఎస్ ఆదాయం భారీగా పెరిగింది. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ దాదాపు ఎనిమిదిన్నరేళ్లుగా అధికారంలో కొనసాగుతోండగా గతంతో పొలిస్తే 2021-2022 మధ్య కాలంలో బీఆర్ఎస్ ఆదాయం విపరీతంగా పెరిగింది. ఎలక్టోరల్ బాండ్లు, ట్రస్టుల, విరాళాల ద్వారా భారీగా ఆదాయం వచ్చినట్లు 2022 ఆడిట్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది.
2022 ఆడిట్ రిపోర్టును బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఇందులో పొందుపర్చిన వివరాలను చూస్తే.. 31 మార్చి 2021 నాటికి బీఆర్ఎస్ ఆదాయం మొత్తం రూ.37.65 కోట్లుగా ఉండగా.. మార్చి 2022 నాటికి ఏకంగా రూ.218.11 కోట్లకు చేరుకుంది. 2021లో ఎలక్టోరల్ బాండ్లు, ట్రస్టుల ద్వారా బీఆర్ఎస్‌కు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. కానీ ఈ ఏడాది మార్చి నాటికి ఎలక్టోరల్ బ్రాండ్ల ద్వారా రూ.153 కోట్లు. ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు తన ఆడిట్ రిపోర్టులో పేర్కొంది.

ఇక నికర ఆదాయం, ఓపెనింగ్ బ్యాలెన్స్, జనరల్ ఫండ్ మొత్తం కలిపి బీఆర్ఎస్ పార్టీ తాజా ఆస్తుల విలువ రూ.480 కోట్లుగా ఉంది. అలాగే 2021 మార్చి 31 నాటికి పోస్టాఫీసుల్లో డిపాజిట్ల రూపంలో రూ.253 కోట్లు ఉండగా.. 31 మార్చి 2022 నాటికి రూ.451కు పెరిగింది. 31 మార్చి 2021 నాటికి రుసుములు, చందాల ద్వారా రూ.17 కోట్లు రాగా.. 31 మార్చి 2022 నాటికి వీటి ద్వారా వచ్చిన ఆదాయం రూ.8,04,74,020గా ఉంది. వ్యక్తిగత చందాల ద్వారా వచ్చిన ఆదాయం మార్చి 2021 నాటికి రూ.1,00,02,379గా ఉండగా.. గత ఏడాది మార్చి నాటికి రూ.90,00,000గా ఉంది. సాధారణ చందాల ద్వారా 2021 మార్చి నాటికి రూ.3 కోట్లు రాగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3.75 కోట్లు వచ్చాయి. గత ఏడాది మార్చి నాటికి ఇతర ఆదాయం ద్వారా రూ.16.21 కోట్లు రాగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.16.12 కోట్లు వచ్చాయి.
మొన్నటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌ను.. బీఆర్ఎస్ ద్వారా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చే దిశగా పనిచేస్తామని, కాంగ్రెస్,బీజేపీయేతర పార్టీలతో కలిసి పోరాడతామని చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా థర్డ్ ఫ్రంట్‌పై చర్చలు జరిపారు. పలువురు కేసీఆర్‌తో కలిసొచ్చేందుకు ఆసక్తి చూపగా.. మరికొంతమంది నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇక ఓపెనింగ్ బ్యాలెన్స్, జనరల్ ఫండ్, నికర ఆదాయం మొత్తం కలిపి బీఆర్ఎస్ పార్టీ తాజా ఆస్తుల విలువ ఏకంగా రూ.408 కోట్లుగా ఉంది. కాగా ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీగా వున్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించింది. మరి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ సక్సెస్ అవుతారో లేదో చూడాలి. (Agencies)