ఈ నిర్బంధ రాజ్యంలోకి ఎలా వచ్చిపడ్డాం? : ప్రో. హరగోపాల్

पृथक तेलंगाना आंदोलन में भाग लेने वाले किसी ने भी व्यक्ति ने कल्पना नहीं की होगी कि तेलंगाना राज्य इस बदलते ढांचे में फंस जाएगा। यह पूछे जाने पर कि क्या तेलंगाना का भविष्य लोगों की कल्पना के अनुरूप हो सकता है? डॉ. जयशंकर मुझसे बार-बार कहते थे कि तेलंगाना में हिरासत बहुत सीमित है। अजीब बात है कि तेलंगाना राज्य ने किसी भी अन्य राज्य की तुलना में उपनियमों का सबसे अधिक दुरुपयोग किया। मैंने एक वरिष्ठ पुलिस अधिकारी से पूछा कि बड़े संघर्ष से जीत हासिल किये गए तेलंगाना में इतनी अधिक दमन क्यों है? तो उन्होंने जवाब दिया कि क्या आपने तेलंगाना आंदोलन के दौरान नजरबंदी कानूनों को बदलने और पुलिस के व्यवहार में परिवर्तन की कोई मांग की थी? मनुष्य ने राज्य क्यों बनाया? राज्य की क्या भूमिका निभानी चाहिए? संविधान राज्य से क्या अपेक्षा करता है? स्वतंत्रता-प्रेमी नागरिक समाज को सत्तारूढ़ दलों सहित विपक्षी दलों से संवैधानिक मूल्यों के विकास के पीछे स्वतंत्रता आंदोलनों के बलिदान, साहसिक कार्यों और भावना के बारे में सवाल पूछना चाहिए। उन्हें हासिल करने के लिए लगातार प्रयास किये जाने चाहिए।

రాజనీతి శాస్త్రంలో రాజ్య ఆవిర్భావం ఎలా జరిగింది, మానవ సమూహాలకి రాజ్య అవసరం ఎందుకు కలిగింది అనే ఒక విస్తృత చర్చ జరుగుతూనే ఉంది. మనుషులు పూర్తి భద్రతతో కూడిన స్వేచ్ఛను అనుభవించడానికి ఒక వ్యవస్థ అవసరమని భావించడం వల్ల రాజ్య వ్యవస్థ రూపొందిందని, రాజ్యానికి సమాజానికి మధ్య ఒక ఒడంబడిక (compact) జరిగిందని, ఆ ఒడంబడికలో పౌరులు కొంత తమ స్వేచ్ఛను ఇష్టపూర్వకంగా రాజ్యానికి అప్పచెప్పారని, దీనికి బదులు రాజ్యం పౌరులకి పూర్తి భద్రతతో కూడిన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కాపాడే పాలనను అందించాలనేది ఈ ఒడంబడిక ముఖ్య సారాంశం. ఈ చర్చలో పౌరులకి రాజ్యానికి మధ్య ఎలాంటి సంబంధం ఉండాల్సిందనే భావన చాలా ప్రధానమైంది. పరిణామ క్రమంలో రాజ్యం ఈ లక్ష్యానికి బదులు బలప్రయోగాన్ని పెంచుతూ వస్తున్నది.

మానవ సమాజం బలప్రయోగం మీద ఆధారపడ్డ భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థగా ఎదుగుతున్న కాలంలో పెట్టుబడిదార్లకు, శ్రామికులకు మధ్య ఏర్పడ్డ ఘర్షణను నివారించేందుకు హక్కుల భావన రూపొందింది. మానవ హక్కులు పెట్టుబడికి శ్రమకు మధ్య ఏర్పడిన రాజీ అని కూడా భావించబడుతున్నది. హక్కుల భావన విస్తరిస్తూ స్వేచ్ఛా, స్వాతంత్య్రం అనే విలువలు నిరంతరంగా వికాసం చెందుతున్న క్రమంలో రాజ్యాంగం వీటికి హామీ పడటం 13వ శతాబ్దంలో మాగ్నా కార్టా (Magna Carta) ద్వారా మొదలై, వలసవాద వ్యతిరేక పోరాటాలలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవి. సోషలిస్టు భావన ఈ హక్కుల నిర్వచనాన్ని, పరిధిని మరింత విస్తృతం చేసింది. స్వాతంత్య్ర పోరాటాలలో ప్రజల ఆకాంక్షలు రూపుదిద్దుకొని, లిఖిత రాజ్యాంగ భావన బలపడి చాలా దేశాలు రాజ్యాంగాలని రాసుకున్నారు. అలా రాజ్యాంగం రాసుకున్న దేశాలలో భారతదేశం చాలా ముందు వరుసలో ఉంది.

భారత్‌లో రాజ్యాంగం పౌరులు తమకు తాము ఇచ్చుకున్న రాజ్యాంగంగా పేర్కొనబడింది. మిగతా రాజ్యాంగాల వలె కాక మన రాజ్యాంగంలో ఎలాంటి సమాజాన్ని మనం సృష్టించుకోవాలో, మన ప్రయాణం ఏ దిశలో సాగాలో కూడా పేర్కొనబడింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదుల మీద సమాజ పునర్‌ నిర్మాణం జరగాలని కూడా కాంక్షించింది. మానవ చరిత్రలోని ఉదాత్తమైన విలువలు రాజ్యాంగానికి ఇరుసుగా ఉన్నాయి. ఎలాంటి సమాజం అనే రూపకల్పన లేకపోతే రాజ్యాంగం హామీపడ్డ స్వేచ్ఛకు అర్థం లేదు. పౌరులు తమ స్వేచ్ఛను ఒక అదర్శప్రాయమైన మానవీయమైన సమాజ నిర్మాణానికి ఉపయోగించుకోవాలి అనే ఆశయం రాజ్యాంగంలో స్పష్టంగానే ఉంది. రాజ్యాంగ రచనలో అట్టడుగు వర్గం నుండి అద్భుతంగా ఎదిగిన డా. అంబేడ్కర్‌ కీలకపాత్ర నిర్వహించడం వలన రాజ్యాంగానికి బలమైన ప్రజాస్వామిక స్వభావం చేకూరింది. మన సమాజం ఇంతకాలం పాటించిన పద్ధతులు కులపర, మతపర ఆధిపత్య సంబంధాల, ఆచార వ్యవహారాల స్థానంలో రాజ్యాంగ నైతికత (Constitutional morality) చోటు చేసుకోవాలని డా. అంబేడ్కర్ నొక్కి చెప్పాడు.

గత ఏడు దశాబ్దాలుగా భారత రాజ్యాంగం, రాజ్యపాలన చాలా ఆటుపోటులకు గురైంది. గతంలో 1975లోనే రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామికమైన హక్కులను రద్దు చేయడం చూసి, హక్కులు రద్దయితే ఏం పరిణామాలు ఉంటాయో, ఏ పర్యవసానానికి దారి తీస్తుందో భారత సమాజం తన అనుభవం ద్వారా అవగాహన చేసుకున్నది. ఇది తీవ్ర అసమానతలకు దారి తీసే ఆర్థిక మార్పుకు సూచికగా కూడా మనం గమనించవచ్చు. రెండవసారి ఎన్నికైన ఇందిరాగాంధీ పేదరికం అసమానతలు సామాజిక న్యాయం లాంటి సమస్యలను వెనక్కి నెట్టి, దేశ మార్కెట్‌కు అంతర్జాతీయ మార్కెట్‌కు సంధానకర్తగా మారక తప్పలేదు. ఈ నయా ఆర్థిక విధానానికి సమాజపొరలలో ఇంతకాలం దాగి ఉన్న మతం, ద్వేషం, హింస, ఇతర మతాల పట్ల, జీవన విధానాల పట్ల అసహనం ఒక్కటొక్కటి బహిర్గతమై సమాజ బలహీనతలను, అసంతృప్తిని రాజకీయం చేసి తమ పబ్బం గడుపుకునే రాజకీయాలు ఉధృతమయ్యాయి. అభిప్రాయ భేదాలు, అధికారంతో విభేదించడం, ప్రభుత్వ చర్యలను విమర్శనాత్మకంగా చూడడం అన్నవి ప్రజాస్వామ్య విలువలుగా కాక, వాటిని నేరంగా, దేశ ద్రోహంగా చూసే ఒక నమ్మలేని మలుపు రాజకీయ ప్రక్రియ తీసుకుంది.

అభివృద్ధి దిశ మారడంతో, భారత రాజ్యాంగం వాగ్దానం చేసిన ఆశయాలు అటుంచి, పౌరుడికి గ్యారెంటీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు కుదించబడుతూ వచ్చాయి. రాజ్యాన్ని నిర్మించుకున్న సమాజమే రాజ్యపు కనుసన్నలలో మెలగాలనే మార్పు దేశ చరిత్రలోనే ఒక పెద్ద విషాదం. గత మూడు, నాల్గు దశాబ్దాలుగా ఆర్థిక అభివృద్ధి ఏం జరిగిందో కాని ప్రజాస్వామ్యం, స్వతంత్ర సంస్థలు క్రమక్రమంగా కూలిపోతున్నాయి. రాజ్యం ప్రజల సమ్మతితో, ప్రజల అభిమానంతో పాలన నిర్వహించే బదులు ఒకదాని తర్వాత మరొక నిర్బంధ చట్టం చేస్తూ పౌరులని పౌర సమాజాన్ని నిరంతరంగా భయకంపితులను చేయడం ఒక పరిపాటి అయిపోయింది. దీనికి ఉపా చట్టం ఒక పరాకాష్ఠ. న్యాయశాస్త్ర ప్రమాణాలే మారుతూ అంతకుముందు అంగీకరించిన రాజ్యాంగ ప్రమాణాలకు, న్యాయ సూత్రాలకు కొత్త నిర్వచనం ఇవ్వడం జరుగుతున్నది. ఉదాహరణకు న్యాయ శాస్త్ర పరిణామ క్రమంలో నేరం రుజువయ్యే వరకు నేరస్థుడు అమాయకుడే (Presumption of Innocence) అన్న నాగరిక ప్రమాణాన్ని మార్చి రాజ్యం ఒక వ్యక్తిని నేరస్థుడు అని భావిస్తే, తాను అమాయకుడినని పౌరుడే రుజువు చేసుకోవాలి!

విచిత్రమైన ఈ సూత్రం ఆచరణలోకి తెచ్చారు. అంతేకాదు ఊపా లాంటి చట్టంలో పౌరులని ఇరికిస్తే ఇక వారు సాలెగూడులో పడ్డట్టే. సాక్ష్యాధారాలు లేకుండా, సరియైన ఇన్‌వెస్టిగేషన్‌ లేకుండానే అధికారంలో ఉండే రాజకీయ పార్టీని లేదా వాళ్ళ నాయకులను విమర్శిస్తే చాలు, దీనిని టెర్రరిస్టు చర్య అని, దేశ ద్రోహం అని పోలీసులు భావిస్తే చాలు శిక్ష ప్రారంభమైనట్లే. ఈ చట్టాన్ని కఠినతరం చేస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు దుర్వినియోగం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, టెర్రరిజం లాంటి చర్యలకు పాల్పడితేనే ఈ చట్టాన్ని ఉపయోగిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హోంమంత్రి చిదంబరం, బీజేపీ హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంటుకు హామీ ఇచ్చారు. కానీ ఈ చట్టాలను దురుపయోగం చేస్తున్న వైనాన్ని పౌరులు గమనిస్తూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ కూడా ఇలాంటి చట్టాలు రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం అని కొట్టివేయకుండా వాళ్ల చేతులను వాళ్ళే కట్టేసుకున్నారు.

ఊపాలాంటి చట్టం ఏ ప్రజాస్వామ్య, నాగరిక ప్రమాణాలకు నిలబడదు. రాజ్యాన్ని నిర్మించుకున్న సమాజం రాజ్యం నుండి ఇంత నిర్బంధాన్ని ఊహించలేదు. సాధారణ పౌరులకే కాక ఈ నిర్బంధం ప్రతిపక్ష పార్టీల దాకా వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ప్రతిపక్ష పార్టీలు కూడా భయపడే స్థితి వచ్చింది. స్వేచ్ఛ మనిషికి ఉండే అత్యంత విలువైన హక్కు. స్వేచ్ఛగా జీవించలేకపోతే, మనిషి జీవితానికి, సామాజిక నాగరికతకు అర్థం ఉండదు. చాలా ఆశ్చర్యంగా జాతీయ భద్రత సలహాదారు యువ పోలీసు అధికారులనుద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశం చేయబోయే నాల్గవ యుద్ధం పౌర సమాజంతోనే అనడం రాజ్యం నిర్వహింపవలసిన ప్రాథమిక కర్తవ్య వక్రీకరణకు పరాకాష్ఠ.

ఈ మారుతున్న చట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇంతలోతుగా కూరుకుపోతుందని ఈ ఉద్యమంలో పాల్గొన్న ఎవ్వరూ ఊహించలేదు. తెలంగాణలో భవిష్యత్తు ప్రజల ఊహలకు తగ్గట్టు ఉండగలదా అన్నపుడు మిత్రులు డా. జయశంకర్‌ తెలంగాణలో నిర్బంధం చాలా పరిమితులలో ఉంటుందని నాతో పదే పదే చెప్పేవాడు. విచిత్రంగా తెలంగాణ రాష్ట్రం ఉపా చట్టాన్ని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ దురుపయోగం చేసింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంత నిర్బంధం ఏమిటి అని ఒక సీనియర్‌ పోలీస్‌ అధికారిని అడిగితే తెలంగాణ ఉద్యమ కాలంలో నిర్బంధ చట్టాలను మార్చాలని, పోలీసుల ప్రవర్తన మారాలని మీరు ఏమైనా డిమాండ్‌ చేసారా? అని ఎదురుప్రశ్న వేసాడు.

ఇవ్వాళ మనుషులు రాజ్యాన్ని ఎందుకు సృష్టించుకున్నారు? రాజ్యం ఏం పాత్ర నిర్వహించాలి? రాజ్యాంగం రాజ్యం నుండి ఏం ఆశించింది? రాజ్యాంగ విలువల వికాసం వెనక ఉన్న త్యాగాలు, సాహాసాలు, స్వాతంత్య్ర ఉద్యమాల స్ఫూర్తి ఏమయినట్లు అనే ప్రశ్నలను అధికారంలో ఉండే పార్టీలతో సహా ప్రతిపక్ష పార్టీలు వాటికి మించి స్వేచ్ఛను ప్రేమించే పౌర సమాజం అడగాలి. వాటి సాధనకు నిరంతర కృషి చేయాలి. (సోషల్ మీడియా సౌజన్యంతో)

ప్రొ. జి. హరగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X