तेज रफ्तार टिपर और प्राइवेट ट्रैवल्स बस की आमने-सामने भिड़ंत, जिंदा जल गये 12 यात्री!

हैदराबाद: आंध्र प्रदेश के मरकापुरम जिले में गुरुवार को सुबह एक भयानक सड़क हादसा हुआ। इस हादसे में 12 यात्रियों की जिंदा जलकर मौत हो गई। मिली जानकारी के अनुसार, यह हादसा तब हुआ जब रायवरम के खदानों के पास एक प्राइवेट ट्रैवल्स की बस और एक टिपर की आमने-सामने भिड़त हो गई। नतीजतन, दोनों वाहनों में एक साथ आग लग गई। इस दौरान बस में सवार 12 यात्री बाहर नहीं निकल पाए। मृतकों में दोनों वाहनों के चालक और क्लीनर हैं।

चश्मदीदों के मुताबिक, निजी प्राइवेट ट्रैवल्स की बस, जो निर्मल से प्रकाशम जिले के पामुरु की ओर जा रही थी, रायवरम में खदानों के पास एक तेज़ रफ़्तार टिपर से आमने-सामने टकरा गई। इस हादसे में, टिपर का डीज़ल टैंक फट गया और कुछ ही सेकंड में दोनों वाहनों में फैल गई। आग इतनी तेज़ थी कि यात्रियों के अपनी सीटों से उठने से पहले ही बस पूरी तरह से आग की लपटों में घिर गई।

पता चला है कि हादसे के समय बस में करीब 40 पैसेंजर थे। गहरी नींद में सो रहे पैसेंजर अचानक हुए हादसे से चौंक गए। कुछ लोग खिड़कियां तोड़कर बाहर निकल पाये, जबकि अंदर फंसे 12 लोगों की मौके पर ही मौत हो गई। अधिकारियों को चिंता है कि गंभीर रूप से घायल 12 लोगों में से कुछ की हालत नाजुक है और मरने वालों की संख्या बढ़ सकती है।

सूचना मिलते ही पुलिस और फायर ब्रिगेड के लोग मौके पर पहुंचे और आग पर काबू पाया। घायलों को इलाज के लिए पास के मरकापुरम सरकारी अस्पताल में भर्ती किया गया। पुलिस के लिए लाशों की पहचान करना मुश्किल हो गया है क्योंकि वे इतनी जल चुकी थीं कि पहचान में नहीं आ रही है।

यह भी पढ़ें-

వేగంగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, మంటల్లో 12 మంది సజీవదహనం!

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళితే రాయవరం సమీపంలోని క్వారీల వద్ద హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవదహనమయ్యారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రాయవరం క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లోనే మంటలు రెండు వాహనాలకు వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ప్రయాణికులు తమ సీట్ల నుండి లేచి బయటకు వచ్చే లోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు. కొందరు కిటికీలు పగులగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకుపోయిన 12 మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X