हैदराबाद: गणतंत्र दिवस के मौके पर केंद्र सरकार ने देश के सर्वोच्च नागरिक पुरस्कारों की घोषणा की है। कुल 106 लोगों को पद्म पुरस्कारों के लिए चुना गया है। छह को पद्म विभूषण, नौ को पद्म भूषण और 91 को पद्म श्री पुरस्कार का ऐलान किया गया है। उल्लेखनीय है कि इस बार तेलुगु राज्यों के 12 लोगों को पद्म पुरस्कार मिला है। एमएम कीरावनी को कला श्रेणी में पद्म श्री से सम्मानित किया गया। गायिका वाणी जयराम को पद्म भूषण से सम्मानित किया गया।आध्यात्मिक गुरु चिन्ना जीयर स्वामी को प्रतिष्ठित ‘पद्म भूषण’ पुरस्कार मिला है।
आध्यात्मिक क्षेत्र में उनकी उत्कृष्ट सेवाओं के लिए उन्हें केंद्र सरकार द्वारा पद्म भूषण पुरस्कार के लिए चुना। चिन्ना जेयार स्वामी के साथ, तेलंगाना के कमलेश डी पाटिल को पद्म भूषण पुरस्कार मिला। तेलंगाना से बी रामकृष्ण रेड्डी, आंध्र प्रदेश से एमएम कीरावनी और संकुरात्री चंद्रशेखर को पद्म श्री मिला है। काकीनाडा से संकुरात्री चंद्रशेखर और तेलंगाना से रामकृष्ण रेड्डी को आदिवासी और दक्षिणी भाषाओं को सेवाएं प्रदान करने के लिए केंद्र द्वारा समाज सेवा विभाग में पद्म श्री पुरस्कारों के लिए चुना है।
उल्लेखनीय है कि इस बार अधिक तेलुगू लोगों को पद्म पुरस्कार मिला है। कुल 106 लोगों को पद्म पुरस्कारों के लिए चुना गया है। इनमें सात आंध्र प्रदेश और पांच तेलंगाना से हैं। ओआरएस के संस्थापक दिलीप महालनाबिस को पद्म विभूषण पुरस्कार मिला है। पश्चिम बंगाल के इस 87 वर्षीय डॉक्टर ने अपने आविष्कार से अब तक दुनिया भर में 5 करोड़ लोगों की जान बचाई है। उत्तर प्रदेश के पूर्व मुख्यमंत्री मुलायम सिंह यादव को भी पद्म विभूषण देने की घोषणा की गई। इस बार कुल छह लोगों को पद्म विभूषण पुरस्कार के लिए चुना गया है।
అత్యున్నత పౌర పురస్కారాలు, తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికి పద్మ అవార్డులు
హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 106 మందిని పద్మ అవార్డులను ఎంపిక చేసింది. ఆరుగురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మ భూషణ్, 91 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి 12 మందిని పద్మ పురస్కారాలు వరించడం విశేషం. ఎంఎం కీరవాణికి ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ లభించింది. సింగర్ వాణీ జయరామ్‌ను పద్మ భూషణ్ వరించింది.
ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామిని ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డు వరించింది. ఆధ్యాత్మిక రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయణ్ని పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. చిన్న జీయర్ స్వామితో పాటు తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక రంగంలో కమలేష్ డి పాటిల్‌ను పద్మభూషణ్ అవార్డు వరించింది. తెలంగాణకు చెందిన బి రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంఎం కీరవాణి, సంకురాత్రి చంద్రశేఖర్‌ను పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. సామాజిక సేవా విభాగంలో కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్, గిరిజన, దక్షిణాది భాషలకు సేవలు అందించిన తెలంగాణకు చెందిన రామకృష్ణారెడ్డిని కేంద్రం పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికచేసింది.
తెలుగు వారికి ఈసారి ఎక్కువ మందికి పద్మ పురస్కారాలు దక్కడం విశేషం. మొత్తం 106 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఓఆర్ఎస్ (ORS) సృష్టికర్త దిలీప్ మహలనబిస్‌ను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 87 ఏళ్ల ఈ డాక్టర్.. తన ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడారు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు కూడా పద్మవిభూషణ్ ప్రకటించారు. ఈసారి మొత్తం ఆరుగురికి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేశారు.
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు:
1) బాలకృష్ణ జోషీ (మరణానంతరం) – ఆర్కిటెక్ రంగం (గుజరాత్)
2) తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ – కళలు (మహారాష్ట్ర)
3) కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం. కృష్ణ – పబ్లిక్ అఫైర్స్ (కర్ణాటక)
4) దిలీప్ మహాలనబిస్ (మరణానంతరం) – వైద్యరంగం (పశ్చిమ బెంగాల్)
5) శ్రీనివాస్ వర్థన్ -సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఎన్నారై)
6) ములాయం సింగ్ యాదవ్ (మరణానంతరం) – పబ్లిక్ అఫైర్స్ (ఉత్తర ప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీకి ఎంపికైనవారు:
★ ఎంఎం కీరవాణి – ఆర్ట్
★ గణేష్ నాగప్ప – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
★ సీవీ రాజు – ఆర్ట్స్
★ అబ్బారెడ్డి నాగేశ్వరరావు – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
★ కోట సచ్చిదానంద శాస్త్రి – ఆర్ట్స్
★ సంకురాత్రి చంద్రశేఖర్ – సామాజిక సేవ
★ ప్రకాష్‌చంద్ర సూదు – లిటరేచర్
తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు:
★ పసుపులేటి హనుమంతరావు – మెడిసిన్
★ మోదుగు విజయ్ గుప్తా – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
★ రామకృష్ణారెడ్డి – లిటరేచర్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి, సింగర్ వాణీ జయరాం, వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా, ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి సహా 9 మందిని పద్మభూషణ్ పురస్కారం వరించింది.
పద్మ భూషణ్ పురస్కారాలు:
1) ఎస్.ఎల్. భైరప్ప – లిటరేచర్, విద్య (కర్ణాటక)
2) కుమార మంగళం బిర్లా – వాణిజ్యం (మహారాష్ట్ర)
3) దీపక్ ధార్ – సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (మహారాష్ట్ర)
4) వాణీ జయరాం – కళలు (తమిళనాడు)
5) చినజీయర్ స్వామి – ఆధ్యాత్మికం (తెలంగాణ)
6) సుమన్ కల్యాణ్‌పూర్ – కళలు (మహారాష్ట్ర)
7) కపిల్ కపూర్ – లిటరేచర్, విద్య (ఢిల్లీ)
8) సుధామూర్తి – సామాజిక సేవ (కర్ణాటక)
9) కమలేశ్ డి పటేల్ – ఆధ్యాత్మికం (తెలంగాణ)
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. గత ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు పద్మ అవార్డులకు నామినేషన్లను స్వీకరించిన కేంద్రం, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. (ఏజెన్సీలు)