हैदराबाद: हैदराबाद मौसम विज्ञान केंद्र के अधिकारियों ने बताया कि आवधिकता के प्रभाव के कारण दक्षिण ओडिशा और उत्तरी आंध्र के तटीय क्षेत्रों में निम्न दबाव बन गया है। इसके बुधवार तक दक्षिणी ओडिशा और दक्षिणी छत्तीसगढ़ की ओर बढ़ने की संभावना है। पता चला है कि इसके असर से तेलुगु राज्यों में भारी बारिश होगी। इस निम्न दबाव क्षेत्र से तेलंगाना पर भी एक सतही परिसंचरण जारी है।
अधिकारियों ने कहा कि इसके प्रभाव से और अधिक बारिश होगी। आज सुबह कई जिलों में 40 से 50 किलोमीटर प्रति घंटे की रफ्तार से आंधी, गरज और बिजली के साथ भारी बारिश की आशंका है। बाहर जाने वाले लोगों को सावधानी बरतने की सलाह दी जाती है क्योंकि राज्य में आंधी-तूफान की संभावना है।
निम्न दबाव के प्रभाव के कारण आज और कल निज़ामाबाद, जगित्याला, राजन्ना सिरिसिल्ला, आदिलाबाद, कुमुरम भीम आसिफाबाद, मंचेरियाल, निर्मल, करीमनगर, पेद्दापल्ली, मुलुगु, भद्राद्री कोत्तागुडेम, जयशंकर भूपालपल्ली, खम्मम और कामारेड्डी जिलों में बारिश होगी। मंगलवार को हैदराबाद में भारी बारिश हुई। कई इलाकों में रिकॉर्ड बारिश दर्ज की गई है। भारी बाढ़ का पानी सड़कों तक पहुंच गया। कॉलोनियां जलमग्न हो गईं। इससे लोगों को भारी दिक्कतों का सामना करना पड़ा।
यह भी पढ़ें:
मुसी नदी खतरनाक स्तर पर बहने के कारण मुसारामबाग पुल को बंद कर दिया गया है। दोनों जलाशयों से भारी मात्रा में बाढ़ का पानी छोड़े जाने के कारण अधिकारियों ने पुल पर यातायात रोक दिया है। स्थिति के आधार पर कल सुबह यातायात की अनुमति देंगे। लेकिन आज अगले दो घंटों में शहर में हल्की बारिश की संभावना है। उन्होंने कहा कि भारी बारिश की कोई संभावना नहीं है।
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తన ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బుధవారం నాటికి ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశాలు చెప్పారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని చెప్పారు.
దీని ప్రభావంతో మరింతగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇవాళ ఉదయం పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని ఆరుబయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్‌లో నిన్న (సెప్టెంబర్ 5) కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. కాలనీలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మూసి వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నందున మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేశారు. జంట జలాశయాల నుంచి భారీగా వరద నీరు విడుదల కావటంతో బ్రిడ్జిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. రేపు ఉదయం పరిస్థితిని బట్టి రాకపోకలను అనుమతి ఇస్తామంటున్నారు. అయితే ఇవాళ మాత్రం నగరంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వచ్చే రెండు గంటల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని అన్నారు. భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదని చెప్పారు. (ఏజెన్సీలు)