हैदराबाद: तेलंगाना में बुधवार से मौसम में बड़े बदलाव होंगे। एक तरफ चिलचिलाती धूप भी परेशान करेगी। दूसरी ओर भारी बारिश भी हो सकती है। इससे वातावरण बड़ा बदलाव देखने को मिलेगा। हैदराबाद मौसम विज्ञान केंद्र ने कहा है कि बुधवार से चार दिनों तक तेलंगाना में हल्की से भारी बारिश होगी। प्रदेश में पूर्व और दक्षिण-पूर्व दिशा से पश्चिम की ओर बहने वाली हवाओं का गर्त सोमवार को और मजबूत हो गया।
हवाएं 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से चलने की संभावना है। वहीं, विभिन्न जिलों में 36 से 40 डिग्री तापमान दर्ज किए जाने की संभावना है। इस महीने की 16 और 17 तारीख को उत्तरी तेलंगाना के जिलों में ओलावृष्टि और 17 तारीख को उत्तर, पश्चिम और उत्तर-पूर्व जिलों में भारी बारिश की चेतावनी जारी की है।
गुरुवार को आदिलाबाद, कुमरामभिम, निर्मल, निजामाबाद, जगित्याल, मंचेरियाल, कामारेड्डी, सिरिसिल्ला, वरंगल, हनमकोंडा, महबूबाबाद, भद्राद्री-कोत्तागुडेम जिलों में कुछ स्थानों पर गरज और हल्की बारिश की संभावना है। आदिलाबाद, निर्मल, निजामाबाद, जगित्याल, सिरिसिल्ला और कामारेड्डी जिलों में शुक्रवार को गरज, बिजली के साथ तेज हवाएं चलेंगी।
शनिवार को आदिलाबाद, निजामाबाद, जगित्याल, राजन्ना सिरिसिला, पेद्दापल्ली, करीमनगर, कुमरामभीम, मंचेरियाल, जयशंकर भूपालपल्ली, वरंगल, हनमकोंडा, कामारेड्डी और मुलुगु जिलों में गरज, बिजली और ओलावृष्टि होने की संभावना है। इसके चलते मौसम विभाग ने संबंधित जिलों को तीन दिन के लिए येलो अलर्ट जारी किया गया है। कई जिलों में मंगलवार और बुधवार को तापमान 36-40 डिग्री रिकॉर्ड दर्ज होने की संभावना है।
బుధవారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు, తీవ్ర ఎండలు, భిన్న వాతావరణం
హైదరాబాద్ : రాష్ట్రంలో బుధవారం నుంచి వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు భగభగ మండే ఎండలు కాస్తాయి. మరోవైపు వానలూ కురుస్తాయి. దీంతో విరుద్ధమైన వాతావరణం నెలకొంటుంది. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి సోమవారం బలపడింది.
ఈ గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలూ ఉన్నాయని వెల్లడించింది. ఈ నెల 16, 17 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన, 17న ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
శనివారం ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, కుమ్రంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీంతో మూడు రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో 36-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.