Happy New Year 2023 : नशे में वाहन चलाने पर दस हजार रुपये का जुर्माना, 6 महीने की जेल

हैदराबाद: नए साल के मौके पर अगर कोई नशे में वाहन चलाता है तो उसे पर दस हजार रुपये जुर्माना और छह महीने जेल की सजा होगी। क्योंकि हैदराबाद, साइबराबाद और राचकोंडा पुलिस शराब के नशे में गाड़ी चलाने वालों पर जुर्माना लगाने का फैसला लिया है। नए साल के जश्न के मद्देनजर हैदराबाद, साइबराबाद और राचकोंडा पुलिस आयुक्तालयों में पुलिस बल को अलर्ट कर दिया गया है।

హైదరాబాద్ : న్యూ ఇయర్ సందర్భంగా ఎవరైనా మందు తాగి బండి నడిపితే అంతే సంగతి. ఎందుకంటే మద్యం మత్తులో వాహనం నడిపిన వారికి హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు ఫైన్ వేయనున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రిపుల్‌ రైడింగ్‌, డ్రంకన్‌ డ్రైవ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌పై కేసులు నమోదు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ రాత్రి నుంచి జనవరి 1 వరకూ పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి బేగంపేట్‌, లంగర్‌హౌస్‌ మినహా అన్ని పై వంతెనలపై రాకపోకలు నిలిపివేయనున్నారు. డ్రంకన్‌ డ్రైవ్‌లో దొరికిపోతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ టి.శ్రీనివాసరావు ఇప్పటికే తెలిపారు.

మొదటిసారి దొరికితే రూ.10,000 జరిమానా, 6 నెలల జైలుశిక్ష, రెండోసారి దొరికితే రూ.15,000, 2 సంవత్సరాల శిక్ష తప్పదన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ సీజ్‌ చేసి సస్పెన్షన్‌కు రవాణా శాఖకు పంపుతామని చెప్పారు. మొదటిసారి 3 నెలల సస్పెన్షన్‌, రెండోసారి పట్టుబడిన వారి లైసెన్స్‌ శాశ్వతంగా రద్దవుతుందన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ టి.శ్రీనివాసరావు సూచించారు.

డ్రంకన్ డ్రైవ్ తనిఖీల కోసం స్టాటిక్, మొబైల్, స్పీడ్ కంట్రోల్ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. పబ్స్, హోటళ్ల రూట్లలో స్టాటిక్ టీమ్ చెక్ పాయింట్లు పెట్టారు. డ్రంకన్ డ్రైవ్ ఎక్కువగా జరిగే ఏరియాల్లో మొబైల్ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రోమింగ్ ఏర్పాట్లు చేశారు. మూడు కమిషనరేట్లలో కలిపి 190 స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్స్ ను రంగంలోకి దించారు. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీడ్ నియంత్రణకు స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగే ప్రాంతాల్లో క్యాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మద్యం మత్తులో ఉన్న వారిని క్యాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తరలించాలని చెప్పారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X