GHMC और HYDRA के बीच गहराया मतभेद, कमीश्नर आम्रपाली ने दिया यह कड़ा आदेश

हैदराबाद: ग्रेटर हैदराबाद नगर निगम कमिश्नर आम्रपाली ने हाइड्रा में काम करने वाले अधिकारियों के खिलाफ अपना गुस्सा जाहिर किया है। गुरुवार को स्थायी समिति के सदस्यों ने इस बात पर आपत्ति जताई कि दैनिक गतिविधियों, जांच और रिपोर्ट तैयार करने में विजिलेंस ऑफिसर की जरूरत है, लेकिन वे अपनी जिम्मेदारी नहीं निभा रहे हैं। इस मामले पर कमिश्नर आम्रपाली ने कड़ी प्रतिक्रिया व्यक्त की। सरकार ने हाल ही में जीएचएमसी में सतर्कता विभाग को बहाल करने का आदेश जारी किया है। लेकिन, विजिलेंस अधिकारी कमिश्नर के आदेश को नजरअंदाज कर हाइड्रा को नहीं छोड़ रहे हैं। ऐसे में आम्रपाली ने उन्हें वेतन नहीं देने का आदेश दिया।

जीएचएमसी का पूर्व सतर्कता विभाग हाल ही में सरकारी आदेशों के अनुसार अस्तित्व में आया है। हालांकि, संबंधित अधिकारी हाइड्रा (हैदराबाद डिजास्टर रिस्पांस एंड एसेट प्रोटेक्शन एजेंसी) के साथ चिपके हुए हैं। जीएचएमसी हाइड्रा कमिश्नर के प्रति जवाबदेह रहते हुए कमिश्नर के आदेशों की अनदेखी कर रही है। इस संबंध में आयुक्त आम्रपाली ने प्रशासन विभाग को आदेश दिया है कि उनके दायरे में काम नहीं करने वाले अधिकारियों को वेतन न दिया जाये।

इस बीच, सतर्कता विभाग की जिम्मेदारी जीएचएमसी से संबंधित विभिन्न विकास कार्यों में भ्रष्टाचार, अनियमितताओं और अधिकारियों के आरोपों की आंतरिक जांच करना और आयुक्त को एक रिपोर्ट सौंपना है। हालाँकि, हाइड्रा के गठन के साथ, ईवीडीएम का तत्कालीन सतर्कता विभाग बाल्दिया में स्थानांतरित कर दिया गया। इस दौरान विजिलेंस से जुड़े कांस्टेबल, एसआई, सीआई और एसीपी को बलदिया को रिपोर्ट करना होगा।

लेकिन करीब एक माह बाद भी अपर आयुक्त सतर्कता को कोई रिपोर्ट नहीं दी गई है। हाइड्रा कमिश्नर को भी पत्र लिखकर हाइड्रा में कार्यरत विजिलेंस स्टाफ को तत्काल कार्यमुक्त करने को कहा गया, लेकिन उन्होंने कोई जवाब नहीं दिया। यही मुद्दा गुरुवार को स्थायी समिति के सदस्यों द्वारा जीएचएमसी आयुक्त के संज्ञान में लाया गया। इसलिए उन्होंने ये आदेश जारी किया है।

Also Read-

హైడ్రాతో ఉన్న ఆ అధికారులకు జీతాలివ్వొద్దు : ఆమ్రపాలి

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి హైడ్రాలో పనిచేస్తోన్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ కార్యక్రలాపాలు, విచారణలు, నివేదికల రూపకల్పనలో విజిలెన్స్‌ అధికారుల అవసరం ఉందని, కానీ, వారు ఆ బాధ్యతలు నిర్వర్తించడం లేదని గురువారం స్థాయీ సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశంపై కమిషనర్‌ ఆమ్రపాలి తీవ్రంగా స్పందించారు. జీహెచ్‌ఎంసీలో విజిలెన్స్ విభాగాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది. అయినా, విజిలెన్స్ అధికారులు.. కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హైడ్రాను వీడటం లేదు. ఈ నేపథ్యంలో వారికి ఇక నుంచి వేతనాలు చెల్లించొద్దని ఆమ్రపాలి ఆదేశించారు.

‘‘జీహెచ్‌ఎంసీలోని పూర్వ విజిలెన్స్‌ విభాగం ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులతో యథాతథంగా అమల్లోకి వచ్చింది.. అయినా సంబంధిత అధికారులు మాత్రం హైడ్రాను (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) అట్టిపెట్టుకుని ఉన్నారు. హైడ్రా కమిషనర్‌కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో తమ పరిధిలో పని చేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దు’ అని పరిపాలన విభాగాన్ని కమిషనర్‌ ఆమ్రపాలి ఆదేశించారు.

కాగా, జీహెచ్ఎంసీకి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలు, అధికారులపై వచ్చిన ఆరోపణలపై అంతర్గతంగా విచారణ జరిపి కమిషనర్‌కు నివేదిక అందించాల్సిన బాధ్యత విజిలెన్స్‌ విభాగానిది. అయితే, హైడ్రా ఏర్పాటుతో అప్పటి వరకు ఉన్న ఈవీడీఎంలోని విజిలెన్స్‌ విభాగాన్ని బల్దియాకు బదిలీ చేశారు. ఈ సమయంలో విజిలెన్స్‌కు సంబంధించిన కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ, సీఐ, ఏసీపీలు బల్దియాకి రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

కానీ దాదాపు నెల రోజులు దాటినా ఇప్పటి వరకు అడిషనల్ కమిషనర్‌ విజిలెన్స్‌కు రిపోర్టు చేయలేదు. హైడ్రాలో పనిచేస్తున్న విజిలెన్స్‌ స్టాఫ్‌ను వెంటనే రిలీవ్‌ చేయాలని హైడ్రా కమిషనర్‌కు లేఖ కూడా రాసినా స్పందించ లేదు. ఇదే అంశాన్ని స్థాయీ సంఘం సభ్యులు గురువారం నాడు జీహెచ్ఎంసీ కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ఈ ఆదేశాలు వెలువరించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X