हैदराबाद: साकेत प्रणाम कला वेदिका में वरिष्ठ नागरिकों ने अंतरराष्ट्रीय योग दिवस को भव्य रूप से मनाया। लगभग 50 वरिष्ठ नागरिकों ने इस योग दिवस कार्यक्रम में भाग लिया।
साकेत प्रणाम में मनाये गये योग दिवस समारोह में 80 साल से अधिक आयु के वयोवद्धों ने भी हिस्सा लिया। इनमे श्री M S प्रसाद और श्री K कृष्णमूर्ति भी शामिल है। इनकी उम्र 90 साल से भी अधिक हैं।
कार्यक्रम का शुभारंभ सरल योगासान से हुवा। इसके बाद कुर्सी पर बैठकर किये जानेवाले सरल योगासान दर्शाये गए। कुर्सी पर बैठकर ही सूर्य नमस्कार योग और बाद में Mat पर बैठकर सूर्य नमस्कार योग किया गया।
इसके बाद भुजंगासन, सर्वांगासन, गोमुखासन, हलासन, जानु शीर्सासन जैसे कई कठिन आसन् का भी प्रदर्शन किया गया।
इस दौरान वरिष्ठ नागरिकों उत्साह् और जोश देखने योग्य था। यह योग दिवस भारी बारिश के बीच भी जारी रहा।
సాకేత్ ప్రణామ్ లో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: సాకేత్ ప్రణామ్ కళా వేదికలో వరిష్ట నాగరికులు అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు మంచి ఉత్సాహముతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమములో సుమారు 50 వరిష్ట నాగరికులు పాల్గొన్నారు.
వీరిలో 80 సం పైబడిన అతి వరిష్ట నాగరికులు కూడా ఉన్నారు. అంతే కాక, 90 సం పైబడిన అతి అతి వరిష్ట నాగరికులైన శ్రీ M S ప్రసాద్ గారు, శ్రీ కందికుప్ప కృష్ణమూర్తి గారు కూడా, ఈ కార్యక్రమములో పాల్గొనడము మిగతా వారికి ఎంతో స్పూర్తి కలిగించింది.
సరలమైన యోగాసనములతో కార్యక్రమము ప్రారంభమయినది. దీని తరువాత కుర్చీలలో కూర్చుండే, వరిష్ట నాగరికులు సూర్య నమస్కారములు చేసి చూపించారు. అటు పిమ్మట మరి కొందరు, సూర్య నమస్కారములను యోగా Mat ల పైన చేసారు.
దీని తరువాత భుజంగాసనము, సర్వాంగాసనము, గోముఖాసనము, హలాసనము, జాను శీర్షాసనము, కూర్మాసనము వంటి కష్టతరమైన ఆసనములను కూడా వరిష్ట నాగరికులు సునాయాసముగా చేసి చూపించారు.
వరిష్ట నాగరికుల యొక్క ఉత్సాహమును, దక్షతను చూసి, కార్యక్రమమును దర్శించిన ఇతర శతాధిక వరిష్ట నాగరికులు ఎంతో ప్రశంసించారు. అకస్మాత్తుగా వచ్చిన వర్షము కూడా, కార్యక్రమునకు అంతరాయము గాని, ఆలస్యము గాని కాకుండా, నిర్వాహకులు మంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చకా చకా చేసారు.