हैदराबाद: तेलंगाना राज्यपाल कार्यालय ने जेल में बंद कैदियों को खुशखबरी दी है। अच्छे आचरण के तहत कैदियों की रिहाई के लिए सरकार द्वारा प्रस्तावित दिशानिर्देशों पर राज्यपाल ने सकारात्मक प्रतिक्रिया दी है। सोमवार को सीएम रेवंत रेड्डी की प्रभारी राज्यपाल राधाकृष्णन से मुलाकात में अच्छे आचरण वाले कैदियों की रिहाई की फाइल को मंजूरी दे दी गई।
इसके साथ ही राज्य भर की विभिन्न जेलों से 220 कैदियों के रिहा होने की संभावना है। इस बीच, सरकार ने 231 कैदियों वाली सूची को राज्यपाल कार्यालय को भेजी, हालांकि, उनमें से कुछ कैदियों को पहले ही रिहा कर दिया गया है। इसलिए कैदियों की संख्या कम हो गई है। जिन कैदियों के नाम सूची में हैं उन्हें अगले दो या तीन दिनों में जेल से रिहा कर दिया जाएगा।
हालांकि, बताया जा रहा है कि सरकार की ओर से राज्यपाल ने सीएम रेवंत रेड्डी को जेल से रिहा हुए कैदियों को रोजगार मुहैया कराने का सुझाव दिया है। ताकि वे बुरी लत, चोरी और चोरियों में शामिल न हो सकें। इसी तरह राज्य की सभी जेलों से रिहा होने वाले कैदियों को मंगलवार को चार्लापल्ली सेंट्रल जेल लेकर आएंगे।
यह भी पढ़ें-
తెలంగాణ జైలులో ఉన్న ఖైదీలకు గుడ్ న్యూస్, 220 మంది జైళ్ల నుంచి విడుదల ఫైల్‌కు ఆమోదం
హైదరాబాద్ : తెలంగాణ జైలులో ఉన్న ఖైదీలకు గవర్నర్ కార్యాలయం గుడ్ న్యూస్ చెప్పింది. సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గదర్శకాలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఇన్‌చార్జి గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయిన క్రమంలో సత్ప్రవర్తన ఖైదీల విడుదల ఫైల్‌కు ఆమోదం లభించింది.
దీతో రాష్ట్ర వ్యాప్తంగా 220 మంది ఖైదీలు వివిధ జైళ్ల నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. కాగా, ముందు 231 మంది ఖైదీలతో కూడిన లిస్ట్ ను ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపగా అందులో కొంద్దరు ఖైదీలు ఇప్పటికే విడుదల కాగా ఆ సంఖ్య కాస్త తగ్గింది. జాబితాలో పేర్లు ఉన్న ఖైదీలు మరో రెండు, మూడు రోజుల్లో జైలు నుంచి విడుదల కానున్నారు.
అయితే, జైలు నుంచి విడుదలైన ఖైదీలు చెడు వ్యసనాలకు, దొంగతనాలు, దొపడీలకు పాల్పడకుండా ప్రభుత్వమే వారికి ఉపాధి కల్పించాలని గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డికి సూచించనట్లుగా సమాచారం. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను మంగళవారం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తీసుకురానున్నారు. (ఏజెన్సీలు)