తెలంగాణలో ఉన్న వికలాంగులకు శుభవార్త…

హైదరాబాద్ : తెలంగాణ లో ఉన్న వికలాంగుల కి తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఉచితంగా మొబైల్ బిసినెస్ బ్యాటరీ ట్రై సైకిల్, ల్యాప్ టాప్ లు, బ్యాటరీ వీల్ చైర్లు, ట్యాబ్ లు, 5G స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందించడానికి OBMMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ లు కోరుచున్నది. ఈ నెల 10 వ తేదీని చివరి తేదిగా నిర్ణయించడం జరిగింది. Note @ ఇంతకు ముందు అప్లై చేసి అవకాశం రాని వారు కుడా ఇప్పుడు మరల అప్లై చేసుకోవచ్చు.

1) బ్యాటరీ వీల్ చైర్
వీటి కోసం అప్లై చేసుకోవాల్సిన వ్యక్తులు మస్కూలరీ డిస్ట్రోఫీ, Spinal card Injury వ్యక్తులు వైకల్య శాతం 40 మరియు అంతకంటే ఎక్కువ ఉన్నవారు అలాగే శారీరక వికలాంగులు అయితే 80% అంతకంటే ఎక్కువ ఉన్నవారు వయసు 12 సంవత్సరాలు నుండి 55 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడంతో చివరి తేదీ ఫిబ్రవరి 10 /2026..

2)మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్ (Empower Cart) చదువుతో నిమిత్తం లేకుండా చదువుకొని వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది వికలాంగులు చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థికంగా నిలబడడానికి ఉపయోగ పడుతుంది.

వీటికోసం శారీరక వికలాంగులు వైకల్య శాతం 40% అంతకంటే ఎక్కువ కలిగినటువంటి వ్యక్తులు 18 నుండి 55 సంవత్సరాల కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి కూడా . చివరి తేదీ ఫిబ్రవరి 10/ 2026.

Also Read-

3) హైబ్రిడ్ వీల్ చైర్ మరియు అటాచ్మెంట్ వీల్ చైర్ వీటికోసం శారీరిక వికలాంగులు.
ఇంటర్మీడియట్ మరియు ఆపై చదువులు కలిగిన వైకల్య శాతం 40% మరియు అంతకంటే ఎక్కువ కలిగిన 18 నుండి 55 సంవత్సరాల వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు చివరి తేదీ ఫిబ్రవరి 10 /2026.

4) LOW END LAPTAPS
వినికిడి లోపం, దృష్టి లోపం ఉన్న వ్యక్తులు అర్హులు.
వీటి కొరకు దరఖాస్తు చేసుకునే వ్యక్తులు డిగ్రీ VH,(55% above),HH (51% above ) 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు అర్హులు. చివరి తేదీ.ఫిబ్రవరి 10/ 2026.

5) High End LAPTAP లు శారీరక వైఖల్యం, వినికిడి లోపం, దృష్టి లోపం ఉన్న వ్యక్తులు అర్హులు PG /PG కి సమానమైన కోర్సులు మరియు ఆపై చదువులు చదువుతున్న వ్యక్తులు వైకల్య శాతం 40% మరియు అంత కంటే ఎక్కువ కలిగిన 18-55 yrs కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోగలరు.చివరి తేదీ ఫిబ్రవరి 10/ 2026.

6) TABS
వినికిడి లోపం, దృష్టి లోపం ఉన్న వ్యక్తులు అర్హులు.

వీటి కోసం దరఖాస్తు చేసుకునే వారు VH (50% above ),HH (51% above ) ఇంటర్మీడియట్ కోర్సు చదువుతున్న 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు అర్హులు. చివరి తేదీ ఫిబ్రవరి 10 /2026.

7) 5G స్మార్ట్ ఫోన్లు

వీటి కోసం దరఖాస్తు చేసుకునేవారు VH (50% above ),HH (51% above ), పదవ తరగతికి సమాధానం చదువుపూర్తి చేసి ఉన్న కానీ చదువుతున్న వ్యక్తులు మరియు రెండు సంవత్సరాలు వ్యవధి వరకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి 16 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు దరఖాస్తు అర్హులు. చివరి తేదీ ఫిబ్రవరి 10/ 2026. ఈ అప్లికేషన్ లో మీకు ఏమైనా సమస్యలు వచ్చిన యెడల చైర్మన్ కార్యాలయం ఇంచార్జి రజిని 9959583502 కి ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 6గంటల వరకు సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X