Hyderabad: Dr B R Ambedkar Open University permitted a special Re-Admission by allowing the old batches under graduate (B.A/B.Com/B.Sc) students to complete their backlogs by paying the requisite fee immediately.
The students belonging to 1991 to 2011 batches, who could not completed their course are requested to approach the Director (Learner Support Services) at University Head quarters, Jubilee Hills, Hyderabad to avail this opportunity. The Candidates may noted that no further relaxation will be given in this regard. For more details students may contact BRAOU Call Centre : 18005990101; Help Desk : 7382929570.
అంబేద్కర్ వర్శిటీ పాత బ్యాచ్ ల విద్యార్థులకు ప్రత్యేక అడ్మిషన్
హైదరాబాద్: డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పాత బ్యాచ్ ల విద్యార్థులకు తమ కోర్సు పూర్తి చేసుకోవడానికి ప్రత్యేక అవకాశం (స్పెషల్ రీ – అడ్మిషన్) కల్పిస్తున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యా సంవత్సరం 1991 నుండి 2011 డిగ్రీ (బి.ఏ/ బి.కాం /బి.యస్సి) బ్యాచ్లకు చెందిన విద్యార్థులకు విశ్వవిద్యాలయం స్పెషల్ రీ అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తుంది.
గతంలో విశ్వవిద్యాలయంలోని పలు కోర్సుల్లో చేరి, సకాలంలో కోర్సు పూర్తి చేయలేకపోయిన (ఓల్డ్ బ్యాచ్) విద్యార్థులకు వాటిని పూర్తి చేయడానికి ప్రత్యేక అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ రీ అడ్మిషన్ పొందాలి అనుకునే విద్యార్థులందరూ, జూబ్లీ హిల్స్ (హైదరాబాద్)లోని విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్, విద్యార్థి సేవల విభాగంను సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇదే చివరి అవకాశం అన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు విశ్వవిద్యాలయ కాల్ సెంటర్ : 18005990101 లేదా హెల్ప్ డెస్క్ : 7382929570 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
