हैदराबाद: सर्राफा बाजार में सोने की कीमत ‘बुल’ की तरह बढ़ता जा रहा है। सर्राफा बाजार के विश्लेषकों का कहना है कि यही स्थिति रही तो अगले महीने घरेलू बाजार में सर्राफा बाजार 62 हजार रुपये तोला (10 ग्राम) तक पहुंचेगा।
హైదరాబాద్ : బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ‘బుల్’ మాదిరిగా పరుగులు తీస్తున్నది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చేనెలలో దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ. 62 వేల మార్క్‌ను చేరుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.
సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీ పరిధిలోని మల్టీ కమొడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 976 పెరిగి రూ. 60,359లకు చేరుకున్నది. స్పాట్ గోల్డ్‌కు గిరాకీ ఎక్కువగా ఉండటంతో ఎంసీఎక్స్‌లో పుత్తడి ధర మరో ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. తులం బంగారం ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ ధర రూ. 976 పెరిగి రూ. 60,359కి చేరుకున్నది. 8789 లాట్ల టర్నోవర్ బిజినెస్ జరిగింది. బులియన్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ఉత్సాహం ప్రదర్శించడంతో బంగారం ధర మెరుపులు మెరిపించింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం (24 క్యారట్లు) ధర 1.53 శాతం వృద్ధితో 2020.70 డాలర్లకు చేరుకున్నది. అమెరికాలోని సిలికాన వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంకుల్లో సంక్షోభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గం బంగారానికి ప్రాధాన్యం ఇచ్చారు. యూఎస్ బాండ్లు బలహీనంగా ఉండటంతోపాటు డాలర్ ఇండెక్స్ పతనమైంది.
ఫలితంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అమెరికా బ్యాంకుల్లో సంక్షోభం నేపథ్యంలో ఈ నెల 22న యూఎస్ ఫెడ్ రిజర్వు సమావేశం అవుతుందని భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వు నిర్ణయాలు బులియన్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని మెహతా ఈక్విటీస్ కమొడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కాలంత్రి పేర్కొన్నారు.
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర రూ.62 వేల మార్క్‌ను దాటేస్తుందని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ కమొడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా చెప్పారు. ఏప్రిల్‌లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు తగ్గి రూ.60 వేల మార్క్ వద్ద నిలుస్తాయని అంచనా వేశారు. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 2050 డాలర్ల నుంచి 2080 డాలర్లకు చేరవచ్చునన్నారు.
యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయాన్ని బట్టి బంగారం ధరలు ప్రభావితం అవుతాయన్నారు. ప్రస్తుతం అమెరికా బ్యాంకుల్లో నెలకొన్న సంక్షోభం.. ఆర్థిక మాంద్యం ముప్పుకు సంకేతంగా ఉందని అనూజ్ గుప్తా హెచ్చరించారు. వెండి ఉదయం ట్రేడింగ్‌లో నష్టపోయినా, తర్వాత పుంజుకున్నది. కిలో వెండి ధర రూ.721 పెరిగి రూ.69,222 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం త్వరలో 23.30&24 డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. దేశీయంగా కిలో వెండి ధర రూ.69,800-రూ.71,000 మధ్య తచ్చాడుతుందని అనూజ్ గుప్తా తెలిపారు. (ఏజెన్సీలు)