डेटिंग ऐप की आड़ में घराना धोखाधड़ी, मोश पब के खिलाफ मामला दर्ज

हैदराबाद : आईटी गलियारे में एक और नए तरह का फ्रॉड सामने आया है। पब मालिक डेटिंग ऐप्स के जरिए लड़कों को लड़कियों से मिलवाकर धोखाधड़ी कर रहे हैं। डेटिंग ऐप्स के जरिए युवकों से परिचय कराने वाली लड़कियां व्हाट्सएप पर संदेश भेजकर कह रही हैं कि वे जल्द ही मिलेंगे। वे उसे एक पब में ले गए और महंगी शराब और अन्य खाने का सामान ऑर्डर किया। जब लड़कियां चली जाती हैं तो पब मैनेजर युवकों को धमकाते हैं और उनसे दोगुने पैसे वसूलते हैं।

ऐसी ही एक मामला माधापुर में प्रकाश में आया है। हैदराबाद के एक युवक की मुलाकात टिंडर ऐप पर एक युवती से हुई। लड़की ने कहा कि वह अगले दिन युवक से मिलेगी और उसे हाईटेक सिटी मेट्रो स्टेशन आने को कहा। तो युवक युवती से मिलने के लिए मेट्रो स्टेशन पहुंच गया। वहां कुछ देर बात करने के बाद दोनों गैलेरिया मॉल में मोश पब गए, जो मेट्रो स्टेशन के बगल में है। लड़की ने पब में युवक को अपने जाल में फांस लिया और कास्टली ने उससे शराब का ऑर्डर किया। इसके बाद वह वहां से निकल गई। हालांकि, पब प्रबंधन ने युवक को धमकाया और उससे 40,505 रुपये का दोगुना बिल वसूल लिया।
तब युवक को पता चला कि उसके साथ धोखा हुआ है।

लड़की के जाल में फंस जाने के बाद पीड़ित युवक ने गूगल पर पब का रिव्यू पढ़ा। उसे एहसास हुआ कि उसके साथ कुछ अन्य युवक भी इसी तरह की ठगी के शिकार हुए हैं। उन्होंने यह सुनिश्चित किया कि पब प्रबंधन डेटिंग ऐप के जरिए लड़कों को लड़की के जाल में फंसाकर धोखाधड़ी कर रहा है। उसने पब से एकत्र किए गए बिल पेपर को सोशल मीडिया पर पोस्ट किया है। यह वायरल हो गया और पुलिस के संज्ञान में आ गया। इसके साथ ही माधापुर पुलिस को शुक्रवार को सुमोटो शिकायत मिली और मोश पब के खिलाफ धोखाधड़ी का मामला दर्ज कर जांच शुरू कर दी। पता चला है कि पब प्रबंधक और युवतियां टिंडर और बम्बल जैसे डेटिंग ऐप्स के माध्यम से धोखाधड़ी कर रहे है।

यह भी पढ़ें-

డేటింగ్ యాప్ ముసుగులో ఘరానా మోసం, మోష్ పబ్‌పై కేసు నమోదు

హైదరాబాద్ : ఐటీ కారిడార్​లో మరో కొత్త తరహా ఫ్రాడ్​ బయటపడింది. డేటింగ్​యాప్స్​ద్వారా అబ్బాయికి అమ్మాయిని పరిచయం చేసి పబ్​ఓనర్లు ఫ్రాడ్ కు పాల్పడుతున్నారు. డేటింగ్ యాప్ ద్వారా యువకులను పరిచయం చేసుకుంటున్న అమ్మాయిలు..వెంటనే కలుద్దామని వాట్సాప్ మెసెజ్ చేస్తున్నారు. పబ్ కు తీసుకెళ్లి అక్కడ ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి జారుకుంటున్నారు. అమ్మాయిలు వెళ్లగానే పబ్ నిర్వాకులు యువకులను బెదిరించి రెండింతల డబ్బులు వసూళు చేస్తూ దోపిడికి పాల్పడుతున్నారు.

ఇలాంటి ఘటన మాదాపూర్ లో చోటుచేసుకుంది. హైదారాబాద్ కు చెందిన యువకుడికి టిండర్​యాప్​లో ఓ యువతి పరిచయమైంది. మరుసటి రోజు యువకుడిని కలుద్దామని చెప్పిన అమ్మాయి.. హైటెక్​సిటీ మెట్రో స్టేషన్​వద్దకు రావాలని కోరింది. దీంతో యువతిని కలిసేందుకు యువకుడు మెట్రో స్టేషన్​వద్దకు చేరుకున్నాడు. ఇద్దరు కలిసి అక్కడ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మెట్రో స్టేషన్​ పక్కనే ఉన్న ఈ గెలేరియా మాల్​లోని మోష్​ పబ్​కు వెళ్లారు. పబ్​లో యువకుడిని మాటల్లోకి దింపిన అమ్మాయి.. అతనితో కాస్ట్లీ మద్యం ఆర్డర్​ చేయించింది. అనంతరం అక్కడి నుంచి జారుకుంది. అయితే, పబ్​మేనేజ్​మెంట్ యువకుడిని బెదిరించి అతని వద్ద నుంచి తాగిన దానికంటే డబుల్ రూ.40,505 బిల్లును వసూళు చేసింది.
మోసపోయినట్లు గుర్తించాడు.

మోసపోయిన తర్వాత బాధిత యువకుడు గూగుల్​లో పబ్​కు సంబంధించిన రివ్యూలను చదివాడు. తనతో పాటు మరికొంత మంది యువకులు ఇదే తరహా చీటింగ్ కు గురైనట్లు గ్రహించాడు. డేటింగ్​యాప్​ ద్వారా అమ్మాయితో అబ్బాయిలను ట్రాప్​ చేయించి పబ్​మేనేజ్​మెంటే​చీటింగ్​ చేయిస్తున్నదని నిర్ధారించుకున్నాడు. పబ్​వసూళు చేసిన బిల్లు పేపర్​ను సోషల్​ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్తా వైరల్​గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో మాదాపూర్​పోలీసులు శుక్రవారం సుమోటోగా కంప్లైంట్​ స్వీకరించి, మోష్​ పబ్​పై చీటింగ్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్ నిర్వాహకులు, యువతులు కలిసి టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్ ద్వారా ఇలా ఫ్రాడ్ కు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X