हैदराबाद में एक और दर्दनाक हादसा, चार साल के बच्चे की नहर में गिरने से मौत

हैदराबाद: शहर में भारी बारिश तबाही मचा रही है। मूसलाधार बारिश के कारण सभी निचले इलाकों में बाढ़ आ गई। कल एक महिला नहर में बह गई। आज एक और दुखद घटना घटी जहां एक चार साल का बच्चा नहर में गिर गया और उसकी मौत हो गई। प्रगति नगर नाले में बच्चे का शव मिला।

शहर में पिछले 2 दिनों से लगातार हो रही बारिश के कारण निचले इलाकों में पानी भर गया है। नतीजतन नहरें बाढ़ के पानी से लबालब बह रही हैं। चार साल के बच्चे के नाले में गिरकर बह गया तो परिवार का रो-रोकर बुरा हाल है।

प्रगति नगर में साईंनगर पुलिया पर खेलते समय नितिन नामक बालक गलती से नहर में गिर गया और बह गया। स्थानीय लोगों ने देखा तो बच्चे को बचाने की कोशिश की लेकिन कोई फायदा नहीं हुआ। स्थानीय लोगों ने तुरंत पुलिस को सूचना दी। मामले की जानकारी होने पर पुलिस तुरंत मौके पर पहुंची और लड़के की तलाश शुरू की।

बहाव तेज होने के कारण पुलिस भी लड़के को नहीं बचा सकी। आख़िरकार, लड़के का शव राजीव के आवास पर पाया गया। पुलिस ने नाला से शव बरामद किया। शव को पोस्टमॉर्टम के लिए सरकारी अस्पताल भेज दिया गया। लड़के के माता-पिता फूट-फूट कर रो रहे हैं।

హైదరాబాద్‌లో మరో విషాదకర ప్రమాదం, కాలువలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కాగా నిన్న ఓ మహిళ నాలాలో గల్లంతు కాగా ఈరోజు ఓ నాలుగేళ్ల చిన్నారి నాలాలో పడి మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రగతి నగర్ నాలాలో ఒక బాలుడి మృతదేహం కొట్టుకు వచ్చింది.

గత 2 రోజులుగా నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు వరదలు పొటెత్తాయి. ఫలితంగా నాలాలు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. అయితే ఒక నాలుగేళ్ల బాలుడు నాలాలో పడి కొట్టుకుపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రగతి నగర్‌లోని సాయినగర్ కల్వర్టు వద్ద ఉన్న నాలా పక్కనే నితిన్ అనే బాలుడు సరదాగా ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు ఆ పిల్లడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితంగా లేకుండా పోయింది. దీంతో వెంటనే స్థానికులు, పోలీసులకు సమాచారాన్ని అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పోలీసులు కూడా బాలుడిని కాపాడలేకపోయారు. చివరికి రాజీవ్ స్వగృహ వద్ద బాలుని మృతదేహం లభ్యమైంది.

మృతదేహాన్ని పోలీసులు నాలాలో నుంచి వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఆడుకుంటున్న చిన్నారి క్షణాల్లోనే నాలాలో పడి విగత జీవిగా దొరకటంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X