హైదరాబాద్ : భారత రత్న డా. బి. ఆర్. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆదివారం డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పుష్ప నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామారావు, డైరెక్టర్ (అకాడమిక్) ప్రొ. జి. పుష్ప చక్రపాణి; రిజిస్ట్రార్ ప్రో.ఎ.వి.ఆర్.ఎన్ రెడ్డి; జి.ఆర్.సీ.ఆర్ & డీ డైరెక్టర్, ఈ.ఎం.ఆర్ & ఆర్.సీ డైరెక్టర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సి.ఎస్.టి.డి డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్; విద్యార్ధి సేవల విభాగ డీన్ డా. బానోత్ లాల్, డైరెక్టర్ డా. ఎల్వికే రెడ్డి; పరీక్షల నియంత్రణ అధికారి డా. పరాంకుశం వెంకట రమణ, ఉద్యోగ సంఘాల నాయకులు జి. మహేష్ గౌడ్, విశ్వవిద్యాలయ ఎస్సీ ఎస్టీ సెల్ ఇంఛార్జ్ డా. బానోత్ ధర్మ, ఏస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డా. బోజు శ్రీనివాస్, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు.
FLORAL TRIBUTES TO Dr B R AMBEDKAR AT BRAOU
Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU) paid rich floral tributes to Bharat Ratna Dr. B. R. Ambedkar on his 133rd Birthday celebrations at the campus on Sunday.
Prof. K. Seeetharama Rao, Vice-Chancellor; Prof. G. Pushpa Chakrapani, Director (Academic); Prof. A.V.R.N. Reddy, Registrar; Prof. Vaddanam Srinivas, Director EMR&RC; Prof. I. Anand Pawar, Director CSTD; Dr. L.V.K. Reddy, Director LSSD, all Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff Members, representatives of service associations and students garlanded the Dr. B. R. Ambedkar Portrait and offered rich floral tributes.
ఇది కూడా చదవండి:
సీఎం రేవంత్ రెడ్డి నివాళి
రాజ్యాంగా నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం అంబేద్కర్ 133వ నివాళులర్పించి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, పలువురు నాయకులు అంబేద్కర్ కు నివాళి అర్పించారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.