हैदराबाद : मंचेरियाल जिले के मंदमरी मंडल के गुडीपेल्ली गांव में छह लोगों को जिंदा जल जाने की घटना में कई तरह की आशंका जताई जा रही है। दुर्घटनाग्रस्त घर के पास दो डिब्बे मिलना संदेह पैदा करता है। पुलिस डेढ़ घंटे में आग पूरे घर में कैसे फैल गई हर पहलू से जांच कर रही है।
सूचना मिलते ही दमकल की गाड़ियां मौके पर पहुंची और आग बुझाई। बिजली विभाग के अधिकारियों ने बताया कि यह हादसा शॉट सर्किट से नहीं हुआ है। अधिकारियों ने स्पष्ट किया कि घर में रखे गैस सिलेंडर में भी विस्फोट नहीं हुआ। मामले की जानकारी होने पर मंचेरियाल के डीसीपी अखिल महाजन और एसीपी तिरुपति रेड्डी मौके पर पहुंचे।
डीसीपी अखिल महाजन ने स्पष्ट किया कि शिवय्या के परिवार के सदस्यों की मौत की सभी कोणों से जांच की जा रही है। उन्होंने कहा कि आग और ट्रांसको की रिपोर्ट आनी है। उन्होंने कहा कि कुछ संदिग्धों को पहले ही हिरासत में लिया जा चुका है। उन्होंने बताया कि 16 टीमें गठित कर मामले की जांच की जा रही है। शांतय्या के परिवार के सदस्यों से भी जांच की जा रही है।
मंचेरियाल जिले के मंदमरी मंडल के गुडीपेल्ली गांव में एक घर में आग लगने से छह लोग जिंदा जल गये। मरने वालों में मासू शिवय्या, उसकी पत्नी राज्यलक्ष्मी, शिवय्या की बेटी मौनिका, हिमबिन्दु, स्वीटी और शांतय्या (सिंगरेनी कर्मचारी और मृतक के रिश्तेदार) शामिल है।
दूसरी ओर, शिवय्या के बेटे ने अग्नि दुर्घटना की जांच के लिए पुलिस से शिकायत की। पता चला है कि प्रेम विवाह करने के बाद वह अपने माता-पिता से दूर रह रहा है।
आपको बता दें कि कल शाम को ग्राम पंचायत की ओर से पांच शवों का अंतिम संस्कार किया गया। शांतय्या के परिजन का कोई सदस्य नहीं आने के कारण अंतिम संस्कार नहीं किया गया। इसके चलते शांतय्या के शव को अस्पताल ले जाया गया। कहा जा रहा है कि आज शांतय्या के शव का अंतिम संस्कार किया जाएगा।
ఆరుగురు సజీవ దహనమైన ఘటనలో అనేక అనుమానాలు, అందరి దృష్టి ల్యాబ్స్ నివేదికపైనే
Hyderabad: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలోని ఇల్లు దగ్ధమై ఆరుగురు సజీవ దహనమైన ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గురైన ఇంటికి కొద్ది దూరంలో రెండు క్యాన్లు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. గంటన్నర సమయంలోనే ఇల్లు మొత్తం కాలి బూడిదవగా మంటలు ఒకేసారి ఎలా వ్యాప్తి చెందాయనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదం షాట్ సర్క్యూట్ వల్ల కాలేదని విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలలేదని అధికారులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతి రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు.
శివయ్య కుటుంబ సభ్యుల మరణంపై అన్నీ కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని డీసీపీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. ఫైర్, ట్రాన్స్ కో రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కొంతమంది అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 16 టీంలను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగెషన్ చేస్తున్నామని తెలిపారు. శాంతయ్య కుటుంబ సభ్యులను కూడా విచారణ చేస్తున్నామన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో ఇల్లు దగ్ధం కావడంతో ఆ మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో మాసు శివయ్య (50), ఆయన భార్య రాజ్యలక్ష్మి, శివయ్య వదిన కూతురు మౌనిక (35), హిమబిందు (4), స్వీటి (2), శాంతయ్య (సింగరేణి కార్మికుడు, మృతుడి బంధువు) ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులకు శివయ్య కుమారుడు ఫిర్యాదు చేశారు. అతడు ప్రేమ వివాహం చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.
నిన్న సాయంత్రం ఐదు మృతదేహాలను గ్రామ పంచాయతీ వారు దహనం చేశారు. శాంతయ్య కుటుంబంలో ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించలేదు. దీంతో శాంతయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. శాంతయ్య మృతదేహానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. (Agencies)