हैदराबाद : मंगलवार आधी रात को नागरकर्नूल जिले के बिजिनपल्ली मंडल में एक घातक सड़क दुर्घटना हुई। उगादी उत्सव के अवसर पर कर्नाटक क्षेत्र के मल्लन्ना भक्त 13 लोगों के साथ एक क्रूजर में श्रीशैल मल्लन्ना दर्शन के लिए गए। बिजिनपल्ली लौटते समय यह वाहन डिवाइडर से टकरा गया।
इस दुर्घटना में कर्नाटक के बीजापुर जिले की वंदना (45) की मौके पर ही मौत हो गई, जबकि उसी इलाके के 12 अन्य लोग गंभीर रूप से घायल हो गए। कहा जा रहा है कि पुलिस के सही समय पर मौके पर नहीं पहुंचने के कारण अन्य यात्रियों को गंभीर कठिनाइयों का सामना करना पड़ा।
डिवाइडर के अधूरे होने और साइनबोर्ड नहीं के कारण कई वाहन डिवाइडर से टकरा गया। इससे पहले भी कई लोगों की यहां पर मौत हो चुकी है, लेकिन अधिकारी अभी भी आवश्यक कदम नहीं उठाया गया। लोगों की मांग है कि उच्च अधिकारी इस प्रकार की दुर्घटनाओं को रोकने के लिए आवश्यक कदम उठाये।
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా (తెలంగాణ) బిజినపల్లి మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉగాది పర్వదినం సందర్భంగా కర్ణాటక ప్రాంతానికి చెందిన మల్లన్న భక్తులు 13మందితో కలిసి క్రూజర్‌లో శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బిజినపల్లికి చేరుకోగానే డివైడర్‌ను వీరు ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొట్టింది.
ఈ ఘటనలో కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా ప్రాంతానికి చెందిన వందన(45) అక్కడికక్కడే మృతి చెందగా అదే ప్రాంతానికి చెందిన మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలంలో సరైన సమయానికి పోలీసులు లేకపోవడంతో ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ డివైడర్ అసంపూర్తితో పాటు సూచిక బోర్డులు లేకపోవడంతో ఎన్నో వాహనాలు ఢీకొని ఎందరో ప్రాణాలు పోయినా కానీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు. (ఏజెన్సీలు)