హైదరాబాద్ : ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తన సాగుచేసే రైతులు అకారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. పశువులు చనిపోతున్నాయి. మొక్క జొన్న సాగుచేసే రైతులకే ఈ విధంగా జరగడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై వ్యవసాయ కమిషన్కు అక్కడి రైతులు లేఖ రాయడంతో.. కమిషన్ సీరియస్ గా తీసుకుంది.
మొక్క జొన్న సాగుచేసే రైతుల వివరాలు, వేసిన విత్తనం, వాడిన పురుగుమందుల కంపెనీల వివరాలతో కూడిన సమాచారం వెంటనే కమిషన్ కు చేర్చాలని ములుగు జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశించింది. దీనిపై రేపు కమిషన్ కార్యాలయంలో సమీక్షించి ప్రభుత్వానికి ఓ నివేదికను తయారుచేసి ఇవ్వనున్నట్లు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు.
Also Read-
ఇప్పటికే వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఏర్పడినప్పటి నుండి ఈరోజు వరకు చేపట్టిన కార్యక్రమాలు, పర్యటనల వివరాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టినట్లు చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు.