हैदराबाद: फार्म हाउस विधायक खरीद-फरोख्त मामले में सिंगल जज बेंच के फैसले के खिलाफ सरकार की ओर से दायर अपील पर हाईकोर्ट ने सुनवाई स्थगित कर दी है। इस मामले को लेकर भाजपा की ओर से अधिवक्ता दामोदर रेड्डी ने दलीलें पेश की। अधीवक्ता ने पीठ को बताया कि भाजपा ने किसी भी राज्य की सरकार को नहीं गिराया है और न ही किसी पार्टी के विधायक खरीदे हैं।
दमदार रेड्डी ने अदालत के ध्यान में लाया कि सीएम केसीआर ने सार्वजनिक घोषणा की थी कि अन्य दलों के विधायक बीआरएस में शामिल हों सकते हैं। उन्होंने बताया कि 2014 से 2018 तक 37 विधायक बीआरएस में शामिल हुए हैं।
दामोदर रेड्डी की दलीलों पर प्रतिक्रिया व्यकत् करते हुए न्यायाधीश ने सवाल किया कि फार्महाउस मामले में भाजपा और बीआरएस का वास्तव में उल्लेख क्यों किया गया। उन्होंने पूछा कि बीजेपी की याचिका को सिंगल जज बेंच ने खारिज कर दिया है। ऐसे फिर आप बीजेपी की तरफ से तर्क क्यों दे रहे हैं।
दामोदर रेड्डी ने कहा कि उन्हें एसआईटी के वकील दुष्यंत दवे के तर्क के उनकी पार्टी की प्रतिष्ठा को नुकसान पहुंचवाले है। इसीलिए हस्तक्षेप करना पड़ा है। उन्होंने स्पष्ट किया कि उन्होंने एसआईटी की दलीलों का जवाब देने के लिए ही राजनीति का जिक्र किया। कोर्ट ने दोनों पक्षों की दलीलें सुनने के बाद मामले की सुनवाई सोमवार तक के लिए स्थगित कर दी।
ఫామ్‌హౌస్ ఎమ్మెల్యే కేసు: విచారణ సోమవారానికి వాయిదా
హైదరాబాద్: ఫాం హౌస్ కేసులో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై విచారణను హైకోర్టులో సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ తరఫున అడ్వొకేట్ దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని, ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదని ధర్మాసనానికి విన్నవించారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరాలని బహిరంగ ప్రకటన చేసింది సీఎం కేసీఆర్ అని దామెదర్ రెడ్డి న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 2014 నుంచి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు.
దామోదర్ రెడ్డి వాదనలపై స్పందించిన న్యాయమూర్తి ఫాం హౌస్ కేసులో అసలు బీజేపీ, బీఆర్ఎస్ ప్రస్తావన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ పిటిషన్ ను సింగిల్ జడ్జి బెంచ్ డిస్మిస్ చేసిందని, అలాంటప్పుడు బీజేపీ తరఫున మీరు ఎందుకు వాదనలు వినిపిస్తున్నారని అడిగారు.
తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా సిట్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు ఉన్నందునే తాము కల్పించుకోవాల్సి వచ్చిందని దామోదర్ రెడ్డి చెప్పారు. సిట్ వాదనలకు సమాధానం చెప్పేందుకే రాజకీయాలను ప్రస్తావించానని స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. (Agencies)