हैदराबाद: फैंसी नंबर तेलंगाना परिवहन विभाग के लिए भारी कमाई लेकर आ रहे हैं। हर बार जब कोई नई सीरीज़ शुरू होती है, तो वाहन चालक अपने वाहनों के लिए लकी नंबर, रिपीट नंबर या अपने पसंदीदा नंबर पाने के लिए एक बड़ी नीलामी में भाग लेते हैं। हैदराबाद के संयुक्त परिवहन आयुक्त रमेश ने बताया कि हालिया नीलामी में खैरताबाद परिवहन विभाग कार्यालय को सिर्फ़ एक दिन में 65,38,889 रुपये की असाधारण आय प्राप्त हुई है।
इस नीलामी में सबसे ज़्यादा बोली TG 09 H 9999 की लगी। इस नंबर के लिए प्रतिस्पर्धा करने वाली ऑनर प्राइम हाउसिंग एलएलपी ने कुल 22,72,222 रुपये देकर हासिल कर लिया। यह उस दिन का सबसे महंगा नंबर बन गया। इसके विपरीत, सबसे कम बोली TG 09 J 0003 नंबर के लिए 1,15,121 रुपये की आय दर्शाती है कि वाहन चालक फैंसी नंबरों के कितने दीवाने हैं।
प्रमुख कंपनियों और व्यक्तियों ने फैंसी नंबरों के लिए प्रतिस्पर्धा की। विशेष रूप से डेवलपर्स, ऊर्जा कंपनियों और मनोरंजन कंपनियों ने अपने व्यावसायिक वाहनों और निजी वाहनों के लिए इन विशेष नंबरों को प्राप्त करने में संकोच नहीं किया। टीजी 09 जे 0009 नंबर को मेसर्स दांडू एनर्जी प्राइवेट लिमिटेड ने 6,80,000 रुपये में हासिल किया। टीजी 09 जे 0006 नंबर को साई सिल्क कलामंदिर लिमिटेड ने 5,70,666 रुपये में हासिल किया था। टीजी 09 जे 0099 यह नंबर मेसर्स गोदावरी फॉर्च्यून ने 3,40,000 रुपये में हासिल किया। टीजी 09 जे 0001 एकल अंक वाला नंबर श्रीनिधि आईटी स्पेस प्राइवेट लिमिटेड ने 2,60,000 रुपये में हासिल किया।
नंबर परिवहन विभाग के लिए ये फैंसी नंबर आय का एक अतिरिक्त स्रोत बन गए हैं। वाहन चालक इतनी बड़ी रकम खर्च करने के कुछ मुख्य कारण हैं। कई लोग अंक ज्योतिष के अनुसार भाग्यवर्धक अंक या शुभ ‘9’ जैसे अंक चाहते हैं। निर्माण और रियल एस्टेट कंपनियाँ ऐसे नंबर खरीदती हैं जो उनके ब्रांड या रुतबे को दर्शाते हों या याद रखने में आसान हों। जैसे- 0001, 0009.
यह उनके बाजार मूल्य और रुतबे का संकेत देता है। कुछ लोग अपनी जन्मतिथि या पसंदीदा नंबर भी नीलामी में शामिल करवाते हैं। यह नीलामी प्रक्रिया पूरी तरह से पारदर्शी और ऑनलाइन होती है। वाहन चालकों से होने वाली यह आय सरकारी खजाने में जाती है और जनकल्याणकारी कार्यक्रमों में खर्च की जाती है। इस एक दिन की आय से यह स्पष्ट हो जाता है कि परिवहन विभाग के लिए फैंसी नंबर कितने महत्वपूर्ण हैं।
Also Read-
ఫ్యాన్సీ నంబర్ల వేలం, రవాణా శాఖకు భారీ ఆదాయం, ఈ నంబర్ల ధర ఎంతో చూడండి…
హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు భారీ మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రతిసారీ కొత్త సిరీస్ మొదలైనప్పుడు వాహనదారులు తమ వాహనాలకు అదృష్ట సంఖ్యలు, పునరావృత సంఖ్యలు లేదా తమకు ఇష్టమైన సంఖ్యలు దక్కించుకోవడానికి పెద్ద మొత్తంలో వేలంపాటలో పాల్గొంటారు. తాజాగా జరిగిన వేలంపాటలో కేవలం ఒక్క రోజులోనే ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి అసాధారణ రీతిలో రూ. 65,38,889 ల ఆదాయం వచ్చినట్లు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు.
ఈ వేలంపాటలో అత్యధికంగా పలికిన నంబర్ TG 09 H 9999. ఈ నంబర్ కోసం పోటీపడిన హనర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఏకంగా రూ. 22,72,222 చెల్లించి కైవసం చేసుకుంది. ఇది ఆ ఒక్క రోజులో అత్యంత ఖరీదైన సంఖ్యగా నిలిచింది. దీనికి వ్యతిరేకంగా అతి తక్కువగా TG 09 J 0003 నంబరుకు కూడా రూ. 1,15,121 ఆదాయం వచ్చిందంటే వాహనదారులకు ఫ్యాన్సీ నంబర్లపై ఉన్న మక్కువ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రముఖ సంస్థలు, వ్యక్తులు పోటీపడ్డారు. ముఖ్యంగా డెవలపర్లు, ఎనర్జీ సంస్థలు, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలు తమ వ్యాపార వాహనాలకు, వ్యక్తిగత వాహనాలకు ఈ ప్రత్యేక సంఖ్యలను దక్కించుకోవడానికి వెనుకాడలేదు. TG 09 J 0009 ఈ సంఖ్యను రూ. 6,80,000 లకు మెస్సర్స్ దండు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. TG 09 J 0006 దీని కోసం సాయి సిల్స్క్ కళామందిర్ లిమిటెడ్ యాజమాన్యం రూ. 5,70,666 చెల్లించింది. TG 09 J 0099 ఈ నంబరును రూ. 3,40,000 లకు మెస్సర్స్ గోదావరి ఫార్చూన్ సంస్థ దక్కించుకుంది. TG 09 J 0001 సింగిల్ డిజిట్ నంబరు కోసం శ్రీనిధి ఐటీ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 2,60,000 చెల్లించింది. TG 09 J 0005 దీనిని రూ. 2,40,100 లకు నిహారిక ఎంటర్ టైన్ మెంట్ సంస్థ దక్కించుకుంది.
రవాణా శాఖకు ఈ ఫ్యాన్సీ నంబర్లు ఒక అదనపు ఆదాయ వనరుగా మారాయి. వాహనదారులు ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా మంది సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ) ప్రకారం తమకు అదృష్టం తెచ్చే సంఖ్యలను, లేదా శుభప్రదమైన ‘9’ వంటి సంఖ్యలను కోరుకుంటారు. నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థలు తమ బ్రాండ్ లేదా హోదాను ప్రతిబింబించే సంఖ్యలను లేదా సులభంగా గుర్తుంచుకోగలిగే సంఖ్యలను (ఉదా: 0001, 0009) కొనుగోలు చేస్తాయి.
ఇది వారి మార్కెట్ విలువను, హోదాను సూచిస్తుంది. కొంతమందికి తమ పుట్టిన తేదీ, లేదా ఇష్టమైన సంఖ్యలు ఉండేలా చూసుకుంటారు. ఈ వేలం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. వాహనదారుల నుంచి వచ్చే ఈ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. ఈ ఒక్క రోజు ఆదాయమే రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు ఎంత కీలకమో స్పష్టం చేస్తోంది. (ఏజెన్సీలు)
