హైదరాబాద్ : అందెశ్రీ అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్.
ప్రముఖ కవి, ‘జయ జయ హే తెలంగాణ..’ ఉద్యమ గీత రచయిత, డా. అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
వారి మరణం పట్ల విచారం తెలుపుతూ తన సంతాపం ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో, సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటని కేసీఆర్ అన్నారు.
ఉద్యమ కాలంలో అందెశ్రీ తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అందెశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గారి అకాల మరణం బాధాకరం.
అందెశ్రీ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

డా. అందెశ్రీ మరణం పట్ల కేటీఆర్ గారి సంతాపం
ప్రముఖ కవి, రచయిత, డా. అందెశ్రీ గారి అకాల మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అందెశ్రీ మరణం పట్ల విచారం తెలుపుతూ, కేటీఆర్ గారు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
వారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటని ఆయన అన్నారు.
Also Read-
అందెశ్రీ గారి మరణంతో శోకసముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
డా. అందెశ్రీ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం
ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ అకాల మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమానికి
అందెశ్రీ గొప్ప సాహిత్యాన్ని అందించారని, అందులో ప్రధాన పాత్ర పోషించారని తన సంతాప సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.అందెశ్రీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,అభిమానులకు ఎంపీ వద్దిరాజు ప్రగాఢ సంతాపం తెలిపారు,
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
అందెశ్రీ మరణం పట్ల రావుల సంతాపం
వారి అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన రావుల
ప్రముఖ కవి, ‘జయ జయ హే తెలంగాణ…’ ఉద్యమ గీత రచయిత డా. అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేరావుల చంద్రశేఖర్ రెడ్డి గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
వారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు రావుల తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రావుల ప్రార్థించారు.
అందె శ్రీ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను
DR బండా ప్రకాష్ ముదిరాజ్ సంతాపం
అందె ఎల్లయ్య (అందె శ్రీ ) తెలంగాణ పోరాటానికి జయజయహే తెలంగాణ పాట ద్వారా జనాన్ని చేతన్యం చేస్తూ ఉద్యమానికి ఊపిరిలూదిన మహనీయుడు, మరెన్నో గేయాలు, మరెన్నో బతుకుపోరాటల రచయిత, మనల్ని వదిలి వెళ్లడం కవులు, కళాకారులకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీరనిలోటు గా భావిస్తూ వారి కుటుంభసభ్యులకు నా ప్రఘాడ సానుబూతిని తెలియచేస్తూ డాక్టర్ అందె శ్రీ గారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుతున్నాను
అందెశ్రీ మృతిపట్ల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపట్ల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. వారి మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని, వారు మరణించినా వారి పాటలతో ప్రజల నాలుకలపై జీవిస్తారని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
