हैदराबाद : माधापुर पुलिस स्टेशन में पुलिस द्वारा वाहन जांच के दौरान भारी मात्रा में धन जब्त किया गया। चुनाव ड्यूटी के तहत बुधवार शाम जब पुलिस माधापुर और जुबली हिल्स सीमा के बीच वाहनों की जांच कर रही थी, तभी किशोर नाम का एक व्यक्ति हाई-टेक सिटी एक्सिस बैंक के 2 करोड़ 20 लाख कैश को वाहन में बेगमपेट एक्सिस बैंक ले जा रहा था।
इसी क्रम में पुलिस को वाहन में 2 करोड़ 20 लाख कैश मिले. लेकिन जब्त किए गए पैसे का चुनाव से कोई संबंध नहीं है। उन्होंने एक्सिस बैंक को बताया कि वे एटीएम भरने के लिए पैसे को बेगमपेट एक्सिस बैंक में ले जा रहे हैं। पुलिस ने खुलासा किया कि संबंधित कर्मियों ने आवश्यक दस्तावेज जमा कर दिये हैं।
మాదాపూర్ లో 2 కోట్లు పట్టివేత
హైదరాబాద్ : మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. ఎన్నికల విధుల్లో భాగంగా బుధవారం సాయంత్రం మాదాపూర్, జూబ్లీహిల్స్ సరిహద్దు మధ్యలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కిషోర్ అనే వ్యక్తి ఓ వాహనంలో హైటెక్ సిటీ యాక్సిస్ బ్యాంక్ కు చెందిన 2 కోట్ల 20 లక్షల నగదును బేగంపేట యాక్సిస్ బ్యాంక్ కు తరలిస్తున్న క్రమంలో మాదాపూర్ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఆ వాహనంలో 2 కోట్ల 20 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే పట్టుబడిన డబ్బు ఎన్నికలకు సంబంధించినది కాదని, యాక్సిస్ బ్యాంక్ కు వారు ఆ డబ్బులను ఏటీఎంలలో నింపేందుకు బేగంపేట యాక్సిస్ బ్యాంక్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత సిబ్బంది అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించినట్లు పోలీసులు వెల్లడించారు. (ఏజెన్సీలు)