हैदराबाद: बेल्लमपल्ली से कांग्रेस उम्मीदवार और एचसीए के पूर्व अध्यक्ष जी विनोद के घर ईडी की छापेमारी से हड़कंप मच गया। ईडी ने विनोद, पूर्व क्रिकेटर शिवलाल यादव और अयूब के घरों और कार्यालयों में तलाशी ली। तेलंगाना एसीबी ने उप्पल स्टेडियम के निर्माण में भ्रष्टाचार के खिलाफ तीन आरोपपत्र दायर किए हैं।
ईडी के अधिकारियों ने एसीबी की चार्जशीट के आधार पर निरीक्षण किया। हाल ही में आईटी अधिकारियों ने चेन्नूर से कांग्रेस उम्मीदवार विनोद के भाई विवेक के घरों और दफ्तरों की तलाशी ली है। कांग्रेस ने बीजेपी और बीआरएस पर चुनाव के समय आईटी हमले करने का आरोप लगाया है।
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ఇంట్లో ఈడీ దాడులు
హైదరాబాద్: తెలంగాణ బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, జీ.వినోద్ ఇంటిపై ఈడీ దాడులు కలకలం రేపాయి. వినోద్ సహా మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అయూబ్ ఇళ్లు, కార్యాలయల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతిపై మూడు ఛార్జిషీట్లను తెలంగాణ ఏసీబీ దాఖలు చేసింది.
ఏసీబీ ఛార్జిషీట్ల ఆధారంగా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక, ఇటీవల చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి, వినోద్ సోదరుడు వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ కావాలనే బీజేపీ, బీఆర్ఎస్ ఐటీ దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. (ఏజెన్సీలు)