Delhi Liquor Scam Case: CM KCR కుమార్తె MLC K కవిత పేరు, ఆధారాలు ధ్వంసం చేసేందుకు పగలగొట్టారు పది సెల్‌ఫోన్లు!

హైదరాబాద్: దేశంతో పాటు తెలంగాణలో కలకలం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ అధికారులు చేర్చారు. మీడియాలో ప్రచురితమైన మరియు ప్రచారం చేయబడిన కథనాల ప్రకారం, ఈ కేసులో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును అధికారులు చేర్చారు.

కుంభకోణంలో నిందితుడు విజయ్ నాయర్ సౌత్ గ్రూప్‌కు రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చిన వారిలో కవిత కూడా ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను ధ్వంసం చేసేందుకు కవిత దాదాపు పది సెల్‌ఫోన్లను ధ్వంసం చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. 32 పేజీల ఈ రిపోర్టులో మూడు చోట్ల కె కవిత పేరును ప్రస్తావించారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ‘సౌత్ గ్రూప్‌’ను శరత్ రెడ్డి, కె కవిత, మాగుంట నియంత్రించినట్లు తాజా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం గమనార్హం.

గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుల్లో అమిత్ ఒకరు. ఇవాళ ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసింది. సిసోడియాకు అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా అత్యంత సన్నిహితులు కాగా.. వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కార్యకలాపాల నిమిత్తం ఉపయోగించిన 10 సెల్‌ఫోన్లను ధ్వంసం చేసినట్లు తాజా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లుగా గుర్తించినట్లు తెలిపింది. ఈ కేసులో మొత్తం 36 మంది రూ. 1.38 కోట్ల విలువైన 170 మొబైల్‌ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ప్రాథమిక దర్యాప్తులో అమిత్ అరోరా ఇచ్చిన వాగ్మూలంలో ధ్రువీకరించిన అంశాల ఆధారంగా రిమాండ్‌ రిపోర్ట్‌ నివేదించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఈ కేసులో సీబీఐ తొలి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. సుమారు 10 వేల పేజీల ఛార్జ్షీట్ ను రౌస్‌ అవెన్యూ కోర్టులో అధికారులు దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో A1 గా కుల్దీప్ సింగ్, A2 గా నరేంద్ర సింగ్, A3గా విజయ్ నాయర్, A4 గా అభిషేక్ బోయిన పల్లి ఉన్నారు. ఈ కేసులో మొదట సీబీఐ విచారణ జరపగా.. తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. విజయ్ నాయర్, అభిషేక్ రావుకు ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దానిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X