हैदराबाद: वाईएस जगन मोहन रेड्डी सरकार ने आंध्र प्रदेश की ड्वारका महिलाओं को खुशखबरी दी है। वाईएसआर आसरा योजना के तहत सहायता की तीसरी किश्त की रकम शनिवार को जारी की जाएगी। एलुरु जिले के देंदुलुरु में होने वाली जनसभा में मुख्यमंत्री जगन बटन दबाकर ड्वारका महिलाओं के खातों में रकम जमा करेंगे।
ड्वारका समूह की 78.94 लाख महिलाओं के बैंक खातों में 6,419 करोड़ रुपये की सहायता राशि तीसरी किश्त के तहत जारी की जा रही है। नवीनतम में जारी किए जाने वाले 6,419.89 करोड़ रुपये के साथ सरकार ने अब तक सहायता के तहत 19,178 करोड़ रुपये प्रदान किए हैं। यह कार्यक्रम 5 अप्रैल 10 दिनों तक तक जारी रहेगी।
డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్న్యూస్, అకౌంట్లలోకి నేడు డబ్బుల జమ
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. నేడు వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడో విడత సాయాన్ని విడుదల చేయనున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించనున్న సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు.
డ్వాక్రా సంఘాల్లోని 78.94 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో మూడో విడత కింద రూ.6,419 కోట్ల ఆసరా సాయాన్ని విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేయనున్న రూ.6,419.89 కోట్లతో కలిపి ఇప్పటివరకు ఆసరా కింద రూ.19,178 కోట్లు అందించింది ప్రభుత్వం. ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడో విడత సాయాన్ని అందజేయనున్న సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు. 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా.. పొదుపు సంఘాల పేరిట ఉండే రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో ఇస్తామని మాట ఇచ్చి అమలు చేస్తున్నామన్నారు. ఇప్పుడు చెప్పినట్లుగానే మూడో విడత డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.
ఆసరాను కూడా నవరత్నాల పథకంలో చేర్చామని.. అలాగే 2016లో రద్దైన సున్నావడ్డీ పథకాన్ని కూడా తిరిగి తీసుకొచ్చామన్నారు. మహిళల జీవనోపాధి, ఆదాయ అవకాశాలకు ఈ డబ్బును వినియోగించుకునేలా.. ఆర్థికంగా ఎదిగాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని లేఖలో తెలిపారు. చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో ఆర్థికాభివృద్ధికి కృషి చేశామన్నారు. డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం కింద అందజేస్తున్న సాయం ఉపయోగించుకోవడంపై ఎలాంటి షరతులు లేవు.
జగన్ సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. మొదటి విడతగా 78.76 లక్షల మందికి రూ.6,318.76 కోట్లు చెల్లించింది. రెండో విడతగా 78.76 లక్షల మందికి మరో రూ.6,439.52 కోట్లు చెల్లించారు. ఇప్పుడు మూడో విడతగా.. 78.94 లక్షల మందికి మరో రూ.6,419.89 కోట్లు మూడో విడతగా అందజేస్తున్నారు. మూడు విడతలలో మొత్తం రూ.19,178.17 కోట్లు లబ్ధి చేకూరుతోంది.
అంతేకాదు వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల (ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు) పాటు జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. వీరు నేరుగా లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మూడో విడతలో లబ్ధిపై వివరించారు. (ఏజెన్సీలు)