Hyderabad: Prof K Seetharama Rao, Vice-Chancellor, Dr B R Ambedkar Open University released the New Year – 2024 University Diary and Calendar on Tuesday at the campus. On this occasion Prof Rao said that the university should work with more accountability. Employees will make efforts to provide the programs in ODL mode and adhere to the UGC guidelines for quality education. He also wish new year greetings to the employees.
Prof AVRN Reddy, Registrar, BRAOU, addressed the gathering, said that he called upon the employees to give more priority to student services. Prof.Ghanta Chakrapani, Director Academic; Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff members and representatives of University Service Associations were present on the occasion.
డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామరావు నూతన సంవత్సరం – 2024 డైరీ, క్యాలెండర్ ను మంగళవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి మాట్లాడుతూ ఆన్లైన్లో మరియు ఒ.డి.యల్ (ODL) పద్ధతిలో ప్రోగ్రామ్లను అందించడానికి ఉద్యోగులు కృషి చేయాలన్నారు. నాణ్యత విద్య కోసం యు.జి.సి. (UGC) మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా పని చేయాలని ఉద్యోగులను ఆదేశించారు. ఉద్యోగులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ.ఎ.వి. ఆర్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చక్రపాణి, పలు విభాగాల అధిపతులు, డీన్లు అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.