హైదరాబాద్ : డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించడం ప్రతి విద్యార్థి కల. ఆ కలను సాకారం చేస్తూ డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCSiON) తో కలిసి వినూత్నమైన ‘జాబ్ అచీవర్ – బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది విద్యార్ధులకు బంగారు బాట వేయనుందని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం లో అడ్మిషన్స్ జరుగుతున్నాయని, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పటికే మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇందులో చేరడానికి మార్చ్ 15 చివరి తేదీగా పేర్కొన్నారు.
ప్రొ. చక్రపాణి శనివారం క్యాంపస్ లో టీసీఎస్ ప్రోగ్రాం డైరెక్టర్ లీనా టిప్రే, ప్రతినిధి నరేందర్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, ఓఎస్డీ ప్రొ. రాబింద్రనాథ్ సోలమన్, ప్లేస్ మెంట్ అధికారి డా. పి. వేణు గోపాల్ రెడ్డి లతో కలిసి పోస్టర్ ను విడుదల చేశారు. ఐటీ, సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇది గొప్ప వరంగా ప్రొ. ఘంటా చక్రపాణి అభివర్ణించారు.

ఈ ప్రోగ్రామ్ కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, టీసీఎస్ తో అనుసంధానమై ఉన్న 3000 పైగా కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలను కల్పించేలా శిక్షణను ఇస్తుందని వెల్లడించారు. బిజినెస్ ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్, సేల్స్, అడ్మిన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి విభిన్న రంగాల్లో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యంగా వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి వివరించారు.
పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ : ఈ ‘జాబ్ అచీవర్ – బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్ధులకు ఎం.ఎస్. ఆఫీస్, CRM టూల్స్, ప్రాసెస్ మేనేజ్‌మెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ప్రత్యేక ఎల్.ఎం.ఎస్. ప్లాట్ ఫార్మ్ పై రూపొందించిన మాడ్యుల్స్ ద్వారా విద్యార్థులు సొంతంగా ఆన్లైన్ లో ప్రాక్టీసు చేస్తూ సులభంగా ఈ ప్రత్యేక కోర్సు నేర్చుకోవచ్చు. సందేహాల నివృత్తి కోసం నిపుణులతో లైవ్ చాట్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కేవలం థియరీ మాత్రమే కాకుండా, నేరుగా పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టులలో పని చేసే అవకాశం కూడా విద్యార్ధులకు లభిస్తుంది. కోర్సు పూర్తయిన తర్వాత లభించే TCSiON, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికేట్, వేలాది కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలకు బాటలు వేస్తుంది.
ఎవరు అర్హులు? డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బి. ఏ (B.A), బి. కామ్ (B.Com) లేదా బి. ఎస్సీ (B.Sc) చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులందరూ ఈ ప్రోగ్రామ్‌లో చేరడానికి అర్హులు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే సమయానికే చేతిలో గొప్ప పేరున్న సంస్థలో ఉద్యోగంతో బయటకు వచ్చేలా ఈ కోర్సును రూపొందించారు. ఆసక్తి గల విద్యార్థులు వెంటనే నమోదు చేసుకోవాలి, మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: www.braou.ac.in లేదా 040 23680555 లో లేదా టోల్-ఫ్రీ నంబర్: 1800-599-0101 లో సంప్రదించాలి.
Also Read-
Dr. B. R. Ambedkar Open University… STUDENTS GET A ‘GOLDEN CHANCE’ : Prof. Ghanta Chakrapani
Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU) offered “Job Achiever – Business Operations Executive” programme in collaboration with IT giant Tata Consultancy Services (TCSiON) for University students. Prof. Ghanta Chakrapani, Vice-Chancellor stated that the University fulfilling the dreams of every student’s to securing a job immediately after graduation. The University has launched an innovative ‘Job Achiever – Business Operations Executive’ program, which will pave a golden path for students. He mentioned that admissions are currently underway for this program, and students who have already enrolled in the first year at Ambedkar Open University should utilize this opportunity. The last date to apply is March 15.
Prof. Ghanta Chakrapani described this program as a great boon for students who wish to establish themselves in the IT, software, and corporate sectors. He revealed that this program is not limited to training alone, but will also provide training that leads to job opportunities in over 3000 corporate companies associated with TCS. He also explained that the main objective of this course is to train students to become experts in diverse fields such as business operations, customer support, sales, administration, and project management. Later, Prof. Ghanta Chakrapani, Vice-Chancellor and TCS Program Director Leena Tipre along with representative Narendra and Dr. LVK Reddy, Registrar, Prof. Rabindranath Solomon, OSD; Dr. P. Venu Gopal Reddy, Placement Officer released “Job Achiever” program poster at the campus on Saturday.
Training tailored to industry needs: Students enrolled in this ‘Job Achiever – Business Operations Executive’ program receive specialized training in areas such as MS Office, CRM tools, process management, and interview skills. Students can easily learn this specialized course independently through modules designed on a dedicated LMS platform, practicing online at their own pace. A live online chat facility with experts is available for doubt clarification. Beyond theory, students also get the opportunity to work on real-world industry projects. The TCSiON and Ambedkar Open University certificate awarded upon completion of the course paves the way for job opportunities in thousands of corporate companies.
Who is eligible?
All first-year students pursuing B. A., B. Com, or B. Sc. at Dr. B. R. Ambedkar Open University are eligible to enrol in this program. This course is designed to ensure that students graduate with a job offer from a reputable company. Interested students should register immediately. For more information, please visit the website: www.braou.ac.in or contact 040 23680555 or the toll-free number: 1800-599-0101.
