డా. బి. ఆర్. అంబేద్కర్ గొప్ప సామాజిక శాస్త్రవేత్త : ప్రొ ఘంటా చక్రపాణి

హైదరాబాద్ : దేశంలో ఎంత మంది శాస్త్రవేత్తలు ఉన్నా వాళ్ళు వారి వారి రంగాల్లో విశేష పరిశోధనలు చేసి దేశాభివృద్ధికి పాటు పడ్డారని అయితే ఈ దేశంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పరితపించిన రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ గొప్ప సామాజిక శాస్త్రవేత్త అని డా. బి. ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అభిప్రాయపడ్డారు. డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, సైన్స్ విభాగం ఆధ్వర్యంలో భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ గౌరవార్ధం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశం అయినా సైన్స్ ను నమ్ముకొని, పలు రంగాల్లో వస్తున్న ఆర్ధిక, సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని అప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. మూడ నమ్మకాలకు దూరంగా, అశాస్త్రీయ పద్ధతులను విడనాడి భవిష్యత్ భారత్ ను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు.

యువ పరిశోధకులు ఆధునిక టెక్నాలజీ, సామాజికాభివృద్ధి పరిశోధనలపై దృష్టి సారించాలని వీసీ సూచించారు. రానున్న రోజుల్లో ఇక్రిశాట్ తో కలిసి అవగాహనా ఒప్పందం చేసుకోనున్నామని, తెలంగాణలోని గ్రామీణ విద్యార్థులకు, రైతులకు మేలు జరిగేలా కొత్త కోర్సులను రూపొందిస్తున్నామన్నారు ప్రొ. చక్రపాణి పేర్కొన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి సరికొత్త వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులను ప్రారంభిస్తామని వెల్లడించారు.

Also Read-

ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో ప్రధాన వక్తగా ప్రఖ్యాత పరిశోధకులు, అంతర్జాతీయ పంటల పరిశోనా సంస్థ ఇక్రిసాట్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ డా.హిమాన్ష్ పాఠక్ హాజరై “భారతదేశ వ్యవసాయ – విప్లవం : సైన్స్ తో కొరత నుండి మిగులు” అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. అయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశ జనాభాకు సరిపడా వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో లేవని ఆకలి చావులు ఎక్కువగా ఉండేవన్నారు.

అప్పటికీ ఇప్పటికీ భారత భూ భాగం అంతే అని అదేవిధంగా జనాభా ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తోందన్నారు. అయినప్పటికీ లోటు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఈ రోజు మన దేశం ప్రపంచ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి చేరింది అంటే అది కేవలం సైన్స్ తోనే సాధ్యం అయిందని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశోధనలు దేశంలో భాగా పెరిగాయని, దిగుబడి పెరిగే వంగడాలను వృద్ధి చేయడంలో ఇక్రిశాట్ ముందు వరసలో ఉందని డా.హిమాన్ష్ పాఠక్ వివరించారు. తినే ఆహారాన్ని, పండించే రైతులను గౌరవించాలని పిలుపునిచారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్, సైన్స్ విభాగ డీన్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి మాట్లాడుతూ ప్రఖ్యాత భారతీయ పరిశోధకులు సర్ సి.వి.రామన్ ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్ ను గుర్తించుకునేలా ఆయన పేరున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరపడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమ నిర్వహణా ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు యస్. వి. రాజశేఖర్ రెడ్డి, సైన్స్ విభాగ అధ్యాపకులు ప్రొ. శ్రీదేవి, ప్రొ. కె. ప్రమీలా కేతావత్; డా. కిషోర్. డా. రామకృష్ణ, డా. ఎస్. రజిత; డా. వై. కుమార్; డా. నరసయ్య బట్టు, డా. వై. అశోక్, పలు విభాగాల డైరెక్టర్లు, డీన్స్, సైన్స్ విభాగ విద్యార్థులు, బోధన, భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విభాగాల విద్యార్ధులు ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు, ప్రత్యేకంగా రూపొందించిన రోబో తో పాటు పలు రకాల పాముల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X