हैदराबाद: उस्मानिया अस्पताल (Osmania Hospital) के डॉक्टरों ने एक और दुर्लभ सर्जरी की। एक 240 किलो वाले व्यक्ति की सर्जरी की और 70 किलो वजन कम किया। यह पहली बार है कि जब किसी मोटे व्यक्ति की सरकारी अस्पताल में वजन घटाने की सर्जरी की गई है।
सर्जिकल गैस्ट्रोएंटरोलॉजी, एंडोक्रिनोलॉजी और एनेस्थीसिया विभागों की संयुक्त देखरेख में सर्जरी सफलतापूर्वक की गई। डिस्पेंसरी अधीक्षक डॉ बी नागेंदर ने बताया कि यह एक संयोजन सर्जरी है जो पेट की क्षमता को कम करती है और अवशोषण को कम करती है।
डॉक्टर ने आगे कहा कि वजन बढ़ने से रोकने के लिए आंतों की क्षमता भी कम हो गई है और दो महीने में 70 किलो वजन कम करने वाले मोटे मरीज को सफलता का संकेत है। यह याद किया गया कि अतीत में मोटापे के रोगियों की साधारण गैस्ट्रिक बाईपास सर्जरी की जाती थी।
ఉస్మానియా దవాఖానలో అరుదైన సర్జరీ, 240 కిలోల బరువు ఉన్న వ్యక్తికి ఆపరేషన్, ఎందుకంటే…
హైదరాబాద్ : ఉస్మానియా దవాఖాన వైద్యులు మరో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 240 కిలోల బరువున్న అతి ఊబకాయ రోగికి సర్జరీ ద్వారా 70 కిలోల బరువును తగ్గించారు. అతి ఊబకాయ రోగికి శస్త్రచికిత్సతో బరువు తగ్గడం ప్రభుత్వ దవాఖానలో ఇదే తొలిసారి కావడం విశేషం.
సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, అనస్థీషియా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. కడుపు సామర్థ్యం తగ్గింపుతోపాటు శోషకశక్తిని తగ్గించే కాంబినేషన్ సర్జరీ ఇది అని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ వివరించారు.
బరువు పెరుగుదల పునఃస్థితిని నివారించడానికి పేగుల సామర్ధ్యం కూడా తగ్గించామని, రెండు నెలల్లో ఊబకాయ రోగి 70 కిలోల బరువును తగ్గించగలగడం విజయానికి సంకేతమని తెలిపారు. గతంలో ఊబకాయ రోగులకు సాధారణ కడుపు సామర్ధ్యం తగ్గింపు శస్త్రచికిత్స చేసేవారని గుర్తు చేశారు. (ఏజెన్సీలు)