హైదరాబాద్ : ఢిల్లీ 5 ఎస్పీ మార్గ్ లో మొన్న ప్రారంభమైన పార్టీ జాతీయ కార్యాలయాన్ని శుక్రవారం నాడు బి ఆర్ ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ గారు సందర్శించారు. మధ్యాహ్నం 1.38 గం.లకు ఆఫీస్ కు చేరుకున్న కెసీఆర్ గారు, తన ఛాంబర్ లో కూర్చొని ఎంపీలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు ప్రముఖుల తో కాసేపు చర్చించారు.
అనంతరం కార్యాలయ మొదటి రెండో అంతస్థుల్లో, ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హల్ ను, పలువురికి కేటాయించిన చాంబర్లను, కలియతిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా, పలు సూచనలు చేశారు. ఆనంతరం తనను కలిసేందుకు అక్కడికి చేరుకున్న బి ఆర్ ఎస్ నేతలు,కార్యకర్తలు అభిమానులకు, అభివాదం చేస్తూ, పలకరిస్తూ ముందుకు సాగారు.
ఈ.సందర్భంగా జై భారత్, జై కేసిఆర్, జై బి ఆర్ ఎస్ నినాదాలు పార్టీ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ సందర్భంగా పార్లమెంటరీ పార్టీ నేతలు కె. కేశవరావు, నామ నాగేశ్వర్ రావు తో పాటు పలువురు ఎంపీ లు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, దామోదర్ రావు, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, కే.ఆర్.సురేష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పీ.రాములు తదితర ప్రముఖులు, రైతు సంఘాల నాయకులతో సమావేశమయ్యారు.
బీఆర్ఎస్ వ్యవస్థాపకులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఢిల్లీలో శుక్రవారం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో కలియతిరిగి, అనంతరం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు,జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, కే.ఆర్.సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్,ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డిలు, పీ. రాములు తదితర ప్రముఖులు, రైతు సంఘాల నాయకులతో కొద్దిసేపు సమావేశమయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున సర్థార్ పటేల్ మార్గ్ లో బుధవారం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.కే సీఆర్ ను కలిసిన వారిలో ఎంపీ వెంకటేష్ నేతకాని, మాజీ ఎంపీ సీతారాం నాయక్,ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన గులాబీ శ్రేణులు “జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి”,”దేశ్ కా నేత కైసే హో కేసీఆర్ జైసే హో”,”ఆబ్ కా బార్ కిసాన్ సర్కారు “అనే నినాదాలు హోరెత్తాయి.