गिर गया उस्मानिया यूनिवर्सिटी का रैंक, जानिए अन्य के कितने नंबर हैं

हैदराबाद: तेलंगाना के सरकारी कॉलेजों और विश्वविद्यालयों में शिक्षा का स्तर दिन-ब-दिन गिरता जा रहा है। उस्मानिया विश्वविद्यालय (OU) तेलंगाना की शान है। मगर बेहतर शिक्षा प्रदान नहीं कर रहा है। नेशनल इंस्टीट्यूशनल रैंकिंग फ्रेमवर्क (NIRF) के तहत केंद्रीय उच्च शिक्षा विभाग द्वारा जारी रैंक में गिरकर OU का स्थान 64वें पर आ गया है।

पिछले साल की तुलना में OU 18 स्थान नीचे गिर गया। तेलंगाना के केवल चार शैक्षणिक संस्थानों ने ओवरऑल कैटेगरी में टॉप 100 में जगह बनाई है। IITH को 14वां और HCU को 20वां स्थान मिला है। नेशनल इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी वरंगल को 53वां और उस्मानिया यूनिवर्सिटी को 64वां स्थान मिला है। शिक्षाविदों का मत है कि सरकार द्वारा अपर्याप्त वित्त पोषण तथा प्राध्यापकों के रिक्त पदों को न भरने के कारण शिक्षा व्यवस्था कमजोर हो रही है।

भारतीय प्रौद्योगिकी संस्थान (आईआईटी) मद्रास देश में सर्वश्रेष्ठ शिक्षण संस्थान के रूप में उभरा है। बैंगलोर आईआईटी, दिल्ली आईआईटी, बॉम्बे आईआईटी, कानपुर आईआईटी, दिल्ली एम्स, खड़गपुर आईआईटी, रुड़की आईआईटी, गुवाहाटी आईआईटी और जवाहरलाल नेहरू विश्वविद्यालय दूसरे स्थान पर रहे। यूनिवर्सिटी कैटेगरी में इंडियन इंस्टीट्यूट ऑफ साइंस, बैंगलोर पहले स्थान पर रहा। इसी तरह इंजीनियरिंग कैटेगरी में आईआईटी मद्रास टॉप पर है। कॉलेजों की श्रेणी में दिल्ली का मिरांदा हाउस पहले स्थान पर है।

प्रबंधन श्रेणी के रूप में आईआईएम अहमदाबाद और आईआईएम बैंगलोर पहले और दूसरे स्थान पर रहे। मेडिकल कॉलेज की श्रेणी में दिल्ली एम्स पहले स्थान पर है। डेंटल कॉलेज श्रेणी में चेन्नई का सविता इंस्टीट्यूट ऑफ मेडिकल एंड टेक्निकल साइंसेज शीर्ष पर रहा है। लॉ कैटेगरी में नेशनल लॉ स्कूल ऑफ इंडिया यूनिवर्सिटी, बेंगलुरु पहले स्थान पर है। शिक्षण, सीखने, संसाधन, अनुसंधान, पेशेवर अभ्यास, स्नातक परिणाम और प्रवेश के आधार पर 13 श्रेणियों में रैंक की घोषणा की गई।

रैंक के लिहाज से ओयू, केयू और जेएनटीयू नीचे गिरे हैं। समग्र श्रेणी में शीर्ष सौ में ओयू एकमात्र राज्य विश्वविद्यालय है। पिछले साल ओयू 46वें स्थान पर था, लेकिन इस बार यह गिरकर 64वें स्थान पर आ गया है। स्कोर भी नीचे चला गया। यूनिवर्सिटी कैटेगरी में पिछले साल ओयू को 22वां स्थान मिला था, लेकिन इस साल यह गिरकर 36वें स्थान पर आ गया। एचसीयू 10वें स्थान पर रहा है, जबकि आईआईटीएच 84वें स्थान पर रहा है। कॉलेज स्तर पर तेलंगाना से एक भी सरकारी कॉलेज नहीं है। केवल सेंट फ्रांसिस महिला कॉलेज को 98वां रैंक मिला है।

इंजीनियरिंग कैटेगरी में पिछले साल जेएनटीयूएच 76वें पायदान पर था, लेकिन इस साल फिसलकर 83वें स्थान पर आ गया है। ओयू इंजीनियरिंग कॉलेज टॉप 100 में भी नहीं आता है। फार्मेसी श्रेणी में राज्य विश्वविद्यालय काकतीय में मानकों में भारी गिरावट आई है। पिछले साल यह 44वें स्थान पर था, लेकिन इस बार यह गिरकर 82वें स्थान पर आ गया है। हालांकि इस कैटेगरी में नेशनल इंस्टीट्यूट ऑफ फार्मास्यूटिकल एजुकेशन एंड रिसर्च, हैदराबाद (एनआईपीईआर) देश में टॉप पर है। जबकि पिछले दूसरे स्थान पर थी। इस साल वह पहले स्थान पर पहुंच गई है।

मेडिकल कैटेगरी में एक भी कॉलेज नहीं है। डेंटल श्रेणी में आर्मी डेंटल कॉलेज, सिकंदराबाद 33वें स्थान पर रहा है। राष्ट्रीय कृषि विस्तार प्रबंधन संस्थान ने कृषि और उसके संबद्ध क्षेत्र की श्रेणी में 32वां स्थान प्राप्त किया। नालसर लॉ यूनिवर्सिटी लॉ कैटेगरी में तीसरे स्थान पर रही, जबकि आईआईटी इनोवेशन कैटेगरी में तीसरे स्थान पर रही। एचसीयू और आईआईटी संस्थानों को विभिन्न श्रेणियों में अच्छे रैंक मिले हैं।

దిగజారిన ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంక్

హైదరాబాద్: తెలంగాణలోని గవర్నమెంట్ కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. రాష్ట్రానికే తలమానికంగా నిలిచే ఉస్మానియా యూనివర్సిటీలోనూ మెరుగైన విద్య అందడం లేదు. నేషనల్ ఇన్​స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌‌వర్క్‌‌ (ఎన్ఐఆర్​ఎఫ్) కింద కేంద్ర ఉన్నత విద్యాశాఖ ఈ ఏడాదికి సంబంధించి విడుదల చేసిన ర్యాంకుల్లో ఓయూ 64వ స్థానానికి పడిపోయింది.

నిరుటితో పోలిస్తే 18 స్థానాలు దిగజారింది. ఓవరాల్ కేటగిరిలో టాప్ 100లో తెలంగాణ నుంచి నాలుగు విద్యా సంస్థలే చోటు దక్కించుకున్నాయి. ఐఐటీహెచ్ 14వ స్థానంలో, హెచ్​సీయూ 20వ స్థానంలో నిలిచాయి. నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ 53, ఉస్మానియా యూనివర్సిటీ 64 స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వం సరిపడా నిధులివ్వకపోవడంతో పాటు ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతున్నదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ నిలిచింది. తర్వాతి స్థానంలో బెంగళూరు ఐఐటీ, ఢిల్లీ ఐఐటీ, బాంబే ఐఐటీ, కాన్పూర్ ఐఐటీ, ఢిల్లీ ఎయిమ్స్, ఖరగ్​పూర్ ​ఐఐటీ, రూర్కీ ఐఐటీ, గువాహటి ఐఐటీ, జవహర్​లాల్ నెహ్రూ యూనివర్సిటీలు నిలిచాయి. యూనివర్సిటీ కేటగిరీలో ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఫస్ట్ ప్లేస్​లో నిలిచింది. అదేవిధంగా, ఇంజినీరింగ్ కేటగిరీలో మద్రాస్ ఐఐటీ టాప్​లో ఉంది. కాలేజీల కేటగిరీలో ఢిల్లీకి చెందిన మిరాంద హౌస్ నంబర్ వన్ ప్లేస్​లో ఉంది.

మేనేజ్​మెంట్ కేటగిరీపరంగా ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు ఫస్ట్, సెకండ్ ప్లేస్​లో నిలిచాయి. మెడికల్ కాలేజ్ కేటగిరిలో ఢిల్లీ ఎయిమ్స్ ఫస్ట్ ప్లేస్​లో ఉంది. డెంటల్ కాలేజ్ కేటగిరిలో చెన్నైకి చెందిన సవిత ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ టాప్​లో నిలిచింది. లా కేటగిరీలో బెంగళూరులోని నేషనల్‌‌ లా స్కూల్‌‌ ఆఫ్‌‌ ఇండియా యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్​లో ఉంది. టీచింగ్, లెర్నింగ్, రీసోర్సెస్, రీసెర్చ్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ ఔట్​కమ్స్, అడ్మిషన్స్ వంటి అంశాల ఆధారంగా 13 కేటగిరీల్లో ర్యాంకులు ప్రకటించారు.

ర్యాంకుల పరంగా ఓయూ, కేయూ, జేఎన్టీయూ కింద పడిపోయాయి. ఓవరాల్ కేటగిరీలో టాప్ వందలో స్టేట్ వర్సిటీ ఓయూ మాత్రమే ఉంది. గతేడాది ఓయూ 46వ ర్యాంకు పొందగా, ఈసారి 64కు దిగజారింది. స్కోర్ కూడా తగ్గింది. యూనివర్సిటీ కేటగిరీలో లాస్టియర్ ఓయూ 22వ స్థానంలో ఉంటే, ఈఏడాది 36వ స్థానానికి పడిపోయింది. హెచ్​సీయూ పదో స్థానంలో నిలవగా, ఐఐటీహెచ్ 84వ స్థానంలో నిలిచింది. కాలేజ్ లెవెల్​లో తెలంగాణ నుంచి ఒక్క గవర్నమెంట్ కాలేజీ లేదు. కేవలం సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీ 98వ ర్యాంకు పొందింది. 

ఇంజినీరింగ్ కేటగిరీలో నిరుడు జేఎన్టీయూహెచ్ 76వ స్థానంలో ఉంటే, ఈ ఏడాది 83కు దిగజారింది. టాప్ 100లో కూడా ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ కనిపించలేదు. ఫార్మసీ కేటగిరీలో స్టేట్ వర్సిటీ కాకతీయలో భారీగా ప్రమాణాలు పడిపోయాయి. గతేడాది 44వ ర్యాంకు పొందితే, ఈసారి ఏకంగా 82కు పడిపోయింది. అయితే, ఈ కేటగిరీలో నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్​ (నైపర్) దేశంలోనే టాప్​లో నిలిచింది. నిరుడు రెండోస్థానంలో నిలవగా, ఈఏడాది ఫస్ట్​ ప్లేస్​కి చేరింది. 

మెడికల్ కేటగిరీలో ఒక్క కాలేజీ లేదు. డెంటల్ కేటగిరిలో ఆర్మీ డెంటల్ కాలేజీ, సికింద్రాబాద్ 33వ స్థానంలో నిలిచింది. అగ్రికల్చర్, దాని అనుబంధ సెక్టార్ కేటగిరీలో  నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్​మెంట్ 32వ ర్యాంకు సాధించింది. లా కేటగిరీలో నల్సార్ లా యూనివర్సిటీ మూడో స్థానంలో నిలవగా, ఇన్నోవేషన్ కేటగిరీలో ఐఐటీహెచ్ థర్డ్ ప్లేస్​లో నిలిచింది. హెచ్​సీయూ, ఐఐటీహెచ్ సంస్థలు వివిధ కేటగిరీలో మంచి ర్యాంకులు పొందాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X