छह लोगों की हत्या करने वाले आरोपी को मौत की सजा, पढ़ें रोंगटे खड़े करने वाला मामला

हैदराबाद : तेलंगाना के कामारेड्डी जिला कोर्ट ने छह लोगों की हत्या करने वाले एक आरोपी को मौत की सज़ा सुनाई है। आरोपी ने अपने दोस्त का घर अपने नाम पर रजिस्टर कर लिया और इसके बाद उसे लोन देने का वादा करके धोखा दिया। इतना ही नही, दोस्त के परिवार के अन्य सदस्यों की भी बेरहमी से अलग-अलग जगहों पर हत्या करके दफ़ना दिया, जला दिया और शवों को नदी में फेंक दिया।

पुलिस के अनुसार, 23 दिसंबर, 2023 को पुलिस ने कामारेड्डी ज़िले के सदाशिवनगर मंडल के भूमपल्ली गाँव के बाहरी इलाके में एक अनजान महिला की लाश को जलाने की शिकायत पर मामला दर्ज किया और जाँच शुरू की। पुलिस ने स्थानीय सीसीटीवी फुटेज और टेक्नोलॉजी का इस्तेमाल करके एक कार की पहचान की। कार के नंबर के आधार पर पुलिस ने निज़ामाबाद ज़िले के मकलूर गाँव से मेडिदा प्रशांत नामक व्यक्ति को गिरफ्तार करके पूछताछ की और पता चला कि उसने एक नहीं, बल्कि पाँच और लोगों की हत्या की है। आरोपी प्रशांत ने दोस्त प्रसाद को यकीन दिलाया कि उसके मकान उसके नाम पर रजिस्टर कर दे और रजिस्टर होने के बाद उसे लोन दिलाएगा। प्रसाद ने मकान उसके नाम कर दिया।

हालांकि, महीनों बीत जाने पर भी लोन नहीं दिलाया। एक दिन उसने प्रशांत से लोन के बारे में पूछा। प्रशांत ने सोचा कि अगर वह परिवार के सभी लोगों को मार देगा, तो लोन देने की ज़रूरत नहीं पड़ेगी और मकान भी उसका हो जाएगा। तुरंत उसने उसके छोटे भाई तेजकिरण और एक अन्य व्यक्ति गुगुलोत विष्णु को भी प्रशांत के परिवार की हत्या करने की योजना के बारे में बताया। वे सभी उसकी बात मान गये। 29 नवंबर को विष्णु अपने दोस्त बारोत वंशी कृष्णा को साथ लेकर आये और दोनों ने मिलकर प्रसाद को मक्लुरे के बाहरी इलाके के जंगल में ले गए। वहां उसकी हत्या कर दी और वहाँ एक गड्ढा खोदकर दफ़ना दिया।

यह भी पढ़ें-

अगले दिन प्रसाद की पत्नी रमणी उर्फ़ शांविका को यह बताकर कार में ले गए कि प्रसाद ने उसे बुलाया है। तीनों आरोपियों ने गला घोंट उसकी हत्या कर दी और लाश को बासरा पुल से गोदावरी नदीं में फेंक दी और चले गए। बाद में वे प्रसाद की छोटी बहन श्रावणी को यह कहकर माचारेड्डी ले गये कि भाई और भाभी ने उसे बुलाया है। वे उसे कार में बिठाकर चेगुंटा इलाके में लेकर गए और वहाँ पर श्रावणी की हत्या कर दी गई तथा पेट्रोल डालकर आग लगा दी।

5 दिसंबर को प्रसाद के जुड़वां बच्चों- चैत्रिका और चेत्रिका को उनके मां-बाप के पास जाने बात बताकर बासरा ले गये और उनके गले में रस्सी से गला घोंटकर हत्या कर दी। पुल पर से नीचे नदीं फेंक दिया। 13 तारीख को प्रसाद की बड़ी बहन स्वप्ना की भी हत्या कर दी और शव को भूमपल्ली के बाहरी इलाके में ले गये और पेट्रोल डालकर आग लगा दी और कार में चले गए। प्रसाद की माँ ओडेम्मा ने भी इन सभी हत्याओं में उसकी मदद की। नतीजतन, पुलिस ने गहन जांच के बाद सभी आरोपियों को गिरफ्तार किया और न्यायिक हिरासत में भेज दिया।

कामारेड्डी जिला जज वरप्रसाद ने पुलिस की ओर से पेश सबूतों के आधार पर मुख्य आरोपी प्रशांत को मौत की सज़ा और 8,000 रुपये का जुर्माना लगाया। साथ ही गुगुलोत विष्णु और प्रशांत की माँ ओडेम्मा को भी उम्रकैद की सज़ा सुनाई। दो अन्य आरोपी- तेज किरण और वंशी कृष्णा अपराध के समय नाबालिग होने के कारण उनके खिलाफ खिलाफ जांच जारी है।

ఆరుగురిని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష

హైదరాబాద్‌ : ఆరుగురిని హత్య చేసిన ఓ నిందితుడికి కామారెడ్డి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. స్నేహితుడి ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుని రుణం ఇప్పిస్తానని మోసం చేయడమే కాకుండా అటు రుణం ఇవ్వకుండా, ఇటు ఇంటిని అప్పగించకుండా స్నేహితుని కుటుంబ సభ్యులను హత్య చేసి వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టి, దహనం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కామారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది.

2023 డిసెంబర్ 23న కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ శవం దహనం చేశారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానంతో ఓ కారును గుర్తించి కారు నంబర్ ఆధారంగా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామానికి చెందిన మెడిద ప్రశాంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మరొక ఐదుగురిని హత్య చేసినట్టు తేలింది. నిందితుడు ప్రశాంత్ తన స్నేహితుడైన పూణే ప్రసాద్ ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుని రుణం ఇప్పిస్తానని ప్రసాద్ ను నమ్మించాడు.

నెలలు గడుస్తున్నా రుణం ఇప్పిచకపోవడంతో ఒకరోజు ప్రశాంత్ ను నిలదీసి అడిగాడు. దాంతో కుటుంబ సభ్యులందరిని హత్య చేస్తే రుణం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇల్లు కూడా తన సొంతం అవుతుందని ప్రశాంత్ భావించాడు. వెంటనే తన తమ్ముడు తేజ కిరణ్, మరొక వ్యక్తి గుగులోత్ విష్ణుకు విషయం చెప్పగా ఒకే చెప్పారు. నవంబర్ 29న విష్ణు తన స్నేహితుడైన బారోత్ వంశీకృష్ణను కూడా తోడుగా తీసుకుని రాగా అందరూ కలిసి ప్రసాద్ ను మాక్లూర్ శివారులోని అడవిలోకి తీసుకెళ్లి హత్య చేసి అక్కడే గుంత తీసి పాతిపెట్టారు.

మరుసటి రోజు ప్రసాద్ భార్య రమణి అలియాస్ శాన్వికను ప్రసాద్ రమ్మంటున్నాడని నమ్మించి కారులో తీసుకెళ్లి తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని బాసర బ్రిడ్జిపై నుంచి నీటిలో పడేసి వెళ్లిపోయారు. అనంతరం ప్రసాద్ చిన్న చెల్లెలు శ్రావణిని అన్నా వదిన ఫలానా చోట ఉన్నారని మాచారెడ్డికి తీసుకుని వెళ్లి అక్కడినుంచి కారులో చేగుంట ప్రాంతానికి వెళ్లారు. అక్కడ శ్రావణిని హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేశారు.

డిసెంబర్ 5న ప్రసాద్ కవల పిల్లలు చైత్రిక, చేత్రికలను అమ్మానాన్నల వద్దకు వెళదామని బాసర వైపు తీసుకెళ్లి ఇద్దరిని గొంతు పై తాడు బిగించి ఊపిరాడకుండా చేసి చంపి బ్రిడ్జిపై నుంచి పడేసారు. 13 న ప్రసాద్ పెద్ద చెల్లెలు స్వప్నను హత్యచేసి భూంపల్లి శివారులో పెట్రోల్ పోసి దహనం చేసి కారులో వెళ్లిపోయారు. ఈ హత్యలన్నింటికి ప్రసాద్ తల్లి ఒడ్డెమ్మ కూడా సహకరించింది. దాంతో పోలీసులు అందరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

కోర్టులో పోలీసులు సాక్షాధారాలు సమర్పించగా ప్రధాన నిందితుడు ప్రశాంత్ కు ఉరిశిక్షతో పాటు రూ.8 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ సంచలన తీర్పు చెప్పారు. అలాగే గుగులోత్ విష్ణు, ప్రశాంత్ తల్లి ఒడ్డెమ్మలకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. మరొక ఇద్దరు నిందితులైన తేజ కిరణ్, వంశీకృష్ణలు నేరం చేసిన సమయానికి మైనర్లు కావడంతో వారిపై విచారణ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X